- Home
- Entertainment
- చివరికి సుమ కూడా తగ్గడం లేదుగా... బుల్లితెర మహారాణిని ఇంత గ్లామరస్ గా ఎప్పుడు చూసి ఉండరు!
చివరికి సుమ కూడా తగ్గడం లేదుగా... బుల్లితెర మహారాణిని ఇంత గ్లామరస్ గా ఎప్పుడు చూసి ఉండరు!
యాంకర్ సుమ కూడా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. సుమలోని ఊహించని కోణం మైండ్ బ్లాక్ చేస్తుంది.

Anchor Suma Kanakala
తొలితరం తెలుగు యాంకర్స్ లో సుమ కనకాల ఒకరు. కేబుల్ టీవీ ప్రాచుర్యం పొందుతున్న రోజుల్లో సుమ, ఝాన్సీ, ఉదయభాను వంటి యాంకర్స్ వెలుగులోకి వచ్చారు. ఝాన్సీ, ఉదయభాను పలు కారణాలతో రేసులో వెనుకబడ్డారు. షోకి షోకి తన పాపులారిటీ పెంచుకుంటూ సుమ మాత్రం అగ్రస్థానం కైవసం చేసుకున్నారు.
Anchor Suma Kanakala
అప్పట్లో యాంకరింగ్ అంటే చక్కని రూపం, వాక్పటిమ మాత్రమే. సమయానుసారంగా మాట్లాడి షోని రక్తి కటించే యాంకర్స్ రాణించారు. ట్రెండ్ మారింది. స్కిన్ షో అనే కొత్త ట్రెండ్ నడుస్తుంది. అనసూయ, రష్మీ, శ్రీముఖి, వర్షిణి గ్లామరస్ యాంకర్స్ గా పేరు తెచ్చుకున్నారు. బుల్లితెర మీద ఈ తరం యాంకర్స్ గా చెరగని ముద్ర వేశారు.
Anchor Suma Kanakala
కాలం మారినా, కొత్త సరుకు దిగినా సుమకు మాత్రం పోటీ కాలేకపోయారు. ఆమె స్థానం పదిలంగా ఉంది. కాగా ప్రతి యాంకర్ సోషల్ మీడియాను విరివిగా వాడుతున్నారు. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి పాప్యులర్ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు. గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను పెంచుకుంటున్నారు. ఇది ఆదాయ మార్గం కూడాను.
Anchor Suma Kanakala
ఎంత టాలెంట్, ఫ్యాన్ బేస్ ఉన్నా... ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే. అందుకే సుమ కూడా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. అలాగే ఆసక్తికర రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. ఇంస్టాగ్రామ్ లో సుమకు రెండున్నర మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్ గా సుమ ఫోటో షూట్స్, వీడియోలను చూస్తారు. తమ స్పందన తెలియజేస్తారు.
Anchor Suma Kanakala
కాగా సుమ గతంలో మాదిరి షోలు చేయడం లేదు. సంఖ్య తగ్గించారు. ప్రస్తుతం సుమ అడ్డా టైటిల్ తో సుమ ఒక షో చేస్తున్నారు. అలాగే అమ్మ ఆవకాయ టైటిల్ తో మరో షో స్టార్ట్ చేసినట్లు సమాచారం. అప్పుడప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నారు.
Anchor Suma Kanakala
ఐదు పదుల వయసు దగ్గర పడగా జోరు తగ్గించారు. డిమాండ్ ఉన్నా ఆచితూచి ప్రోగ్రామ్స్ ఎంచుకుంటున్నారు. గత ఏడాది జయమ్మ పంచాయతీ టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేశారు. ఇక కొడుకు రోషన్ ని హీరోగా పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. యాంకర్ గా ఏకఛత్రాధిపత్యం చేసిన సుమకు వందల కోట్ల ఆస్తి ఉన్నట్లు సమాచారం.
Anchor Suma Kanakala
ఇటీవల సుమ భర్త రాజీవ్ కనకాలతో విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరు విడివిడిగా ఉంటున్న నేపథ్యంలో మనస్పర్థలు తలెత్తాయంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను రాజీవ్ కనకాల ఖండించారు. ఇతర కారణాలతో నేను తల్లిదండ్రుల ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నట్లు వెల్లడించారు.