రాత్రిళ్ళు లేటుగా వచ్చి బయట మెట్లపైనే పడుకుని.. కష్టాలు గుర్తురావడంతో ఏడ్చేసిన సుమ
టాలీవుడ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ , ఇతర సినిమా కార్యక్రమాలు ఉంటే ముందుగా గుర్తుకు వచ్చేది యాంకర్ సుమనే. స్టార్ హీరోల సినిమా ఫంక్షన్స్ అయితే 90 శాతం సుమనే యాంకరింగ్ చేస్తుంది.
టాలీవుడ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ , ఇతర సినిమా కార్యక్రమాలు ఉంటే ముందుగా గుర్తుకు వచ్చేది యాంకర్ సుమనే. స్టార్ హీరోల సినిమా ఫంక్షన్స్ అయితే 90 శాతం సుమనే యాంకరింగ్ చేస్తుంది. ఎక్కడ చూసినా సుమన్ కనిపిస్తుండడంపై హీరోలు, దర్శకులు ఆమెపై తరచుగా జోక్స్ వేస్తుంటారు. బుల్లితెరపై కూడా సుమ అనేక కార్యక్రమాలకు హోస్ట్ గా చేస్తోంది.
మలయాళీగా పుట్టిన నేను ఇక్కడ ఈ స్థాయికి చేరుకున్నాను అంటే కేవలం తెలుగువారి అభిమానం, ప్రేమ వల్లే అని సుమ తెలిపింది. మీ ప్రేమాభిమానాలు లేకపోతే నేను లేను అంటూ సుమ పలు సందర్భాల్లో గుర్తు చేసుకుంది. తాజాగా సుమ జబర్దస్త్ కమెడియన్లు సందడి చేసిన దీపావళి ఈవెంట్ లో సుమ కూడా మెరిశారు.
సుమ తనయుడు రోషన్ కనకాల కూడా స్పెషల్ ఈవెంట్ కి అతిథిగా హాజరయ్యాడు. రోషన్ నటించిన తొలి చిత్రం బబుల్ గమ్ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తొలి చిత్రంలో రోషన్ కాస్త బోల్డ్ గానే నటించినట్లు ఉన్నాడు. ఇక సుమ విషయానికి వస్తే మరోసారి ఈ టాప్ యాంకర్ షోలో ఎమోషనల్ అయ్యారు.
ఈ షోకి మరో సీనియర్ యాంకర్ శిల్పా చక్రవర్తి కూడా హాజరైంది. శిల్పా చక్రవర్తి, సుమ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం శిల్పా చక్రవర్తి.. సుమ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్ని కష్టాలు అనుభవించిందో వివరించినట్లు ఉంది.
Suma Kanakala
సుమ కొన్ని సార్లు షూటింగ్స్ నుంచి ఆలస్యంగా వచ్చేది. దీనితో బాగా లేట్ నైట్ అయ్యేది. ఆ సమయంలో తలుపు ఎంత సేపు తట్టినా తీసేవారు కాదు. దీనితో సుమ చాలా రాత్రిళ్ళు బయట మెట్లపైనే పడుకోవటం నేను చూశాను అని చెప్పింది.
Suma Kanakala
తన కష్టాలు గుర్తుకు రావడంతో సుమ కంటతడి పెట్టుకుని ఏడ్చేసింది. అక్కడే ఉన్న రోషన్ తన తల్లిని ఆప్యాయంగా హద్దుకున్నాడు. ఆ తర్వాత ఇమ్మాన్యూల్, నూకరాజు, చలాకి చంటి లాంటి వాళ్ళు తమ ఫన్నీ స్కిట్స్ తో నవ్వించే ప్రయత్నం చేసినట్లు ఉన్నారు.