- Home
- Entertainment
- భర్త రాజీవ్ కనకాలపై షోలో తన ఫీలింగ్ బయటపెట్టిన యాంకర్ సుమ.. వామ్మో ఈ ఏజ్‌లో అంతటి కసి ఉందా?
భర్త రాజీవ్ కనకాలపై షోలో తన ఫీలింగ్ బయటపెట్టిన యాంకర్ సుమ.. వామ్మో ఈ ఏజ్‌లో అంతటి కసి ఉందా?
యాంకర్ సుమ, రాజీవ్ కనకాల పెళ్లై చాలా ఏళ్లు అవుతుంది. కొడుకు రోషన్ కూడా మొన్న హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఇప్పటికీ రాజీవ్‌పై సుమలో ఆ కసి ఉందట. తాజాగా అది బయటపడింది.

సుమ కనకాల స్టార్ యాంకర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా రంగంలో అత్యంత పారితోషికం అందుకునే యాంకర్‌గా రాణిస్తుంది సుమ. అంతేకాదు అత్యంత బిజీ యాంకర్ కూడా తనే. అయితే ఇటీవల ఆ జోరు తగ్గింది. కుర్ర యాంకర్లు స్పీడు పెరగడంతో సుమ కాస్త డౌన్ అయ్యింది.
ఒకప్పుడు నాలుగైదు టీవీ షోస్ చేస్తూ బిజీగా ఉండేది సుమ. దీనికితోడు సినిమా ఈవెంట్లకి తనే యాంకర్‌గా ఉండేది. పెద్ద హీరోల సినిమాలకు ఆమె తప్ప మరో ఛాన్స్ లేదు. ఆమె ఫ్రీ టైమ్‌ని బట్టే ఈవెంట్లు పెట్టుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు `సుమ అడ్డా` అనే షో మాత్రమే చేస్తుంది. ఎలాగూ ఈవెంట్లు కూడా చేస్తుంది.
`సుమ అడ్డా`లో తనదైన జోష్‌తో వినోదాన్ని పంచుతుంది. వచ్చిన గెస్ట్ లను ఉక్కిరి బిక్కిరి చేస్తూ అలరిస్తుంది. ఓ రేంజ్‌లో ఆడుకుంటుంది. ఏదైనా ఫన్ చేస్తూ షోని రక్తికట్టిస్తుంది. అయితే కొన్ని సార్లు అడ్డంగా బుక్కైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమెకి ఆడుకునే గెస్ట్ లు కూడా వస్తుంటారు. గత ఎపిసోడ్‌లో విశ్వక్ సేన్ సుమకి చుక్కలు చూపించాడు.
ఇప్పుడు మరోసారి తనకు గట్టి స్ట్రోక్ తగిలింది. అయితే అది గెస్ట్ ల రూపంలో కాదు, ఆమె గేమ్ రూపంలో తాను చేసిన పనికి తానే పరువు పోగొట్టుకోవాల్సి వచ్చింది. తన మనసులో కోరికని బయటపెట్టి అడ్డంగా బుక్కైంది సుమ. తాజాగా `సుమ అడ్డా` లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చింది.
ఇందులో `భజే వాయు వేగం` టీమ్ పాల్గొంది. హీరో కార్తికేయ, హీరోయిన్ సంయుక్త మీనన్, దర్శకుడు, కమెడియన్ పాల్గొన్నారు. వీరిని కాసేపు ఆడుకుంది సుమ. పలు ప్రశ్నలతో తికమక పెట్టింది. అంతేకాదు కార్తికేయ చిరంజీవి అభిమాని కావడంతో చిరు పాటకి డాన్స్ చేయించింది. అందరిలో జోష్ నింపారు.
ఐపీఎల్ మ్యాచ్‌లపై ప్రశ్నలు ఫన్నీగా సాగాయి. ఈ క్రమంలో మనసులో కలిగే ఫీలింగ్ స్క్రీన్‌పై వస్తుందనే ఓ టాస్క్ పెట్టింది సుమ. అందులో ముందు కార్తికేయ పాల్గొన్నారు. ఆ మధ్యనే ఆయనకు పెళ్లి అయ్యింది. లావణ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అయితే ఆ కుండిపై చేయి పెట్టి మనసులో అనుకున్న ఫీలింగ్ స్క్రీన్‌పై వస్తుంది. కార్తికేయ మనసులో చాలా మంది అమ్మాయిలు ఉన్నట్టుగా వచ్చింది. ఇక ఇంటికి వెళ్లాలంటే భయమేస్తుందని కార్తికేయ చెప్పిన మాట నవ్వులు పూయించింది. దీంతోపాటు కమెడియన్ నర్సింహ చేయిపెడితే ఫస్ట్ నైట్ బెడ్ వచ్చింది. నవ్వులు పూయించింది.
ఈ క్రమంలో సుమకి టాస్క్ ఇచ్చాడు కార్తికేయ. ఆమె తన మనసులో మాట చెప్పాలని తెలిపారు. భర్త రాజీవ్ కనకాలపై ప్రస్తుతం ఫీలింగ్ ఏంటి అని అడగ్గా.. స్క్రీన్‌పై సుమ కొడుకు రోషన్ నటించిన `బబుల్‌గమ్` చిత్రంలోని స్టిల్ వచ్చింది. ఇందులో హీరోయిన్.. రోషన్ కసిగా బుగ్గ కొరుకుతుంది.
అంతే అడ్డంగా బుక్కైపోయింది సుమ. తన మనసులో ఫీలింగ్‌కి ఆ ఫోటో రావడం ఒక వింత అయితే, ప్రస్తుతం రాజీవ్ కనకాలపై ఆమెకి ఉన్న ఫీలింగ్ అది అనే అర్థంలో ఆ ఫోటో ప్రజెంట్ కావడం పిచ్చెక్కించేలా ఉంది. అంటే సుమకి ప్రస్తుతం రాజీవ్‌ని కొరికేయాలనేంత కసిగా ఉందా అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
ఫోటో అర్థం కూడా అలానే ఉండటం విశేషం. దీంతో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు సుమ. పంచ్‌లు, సెటైర్లతో రెచ్చిపోతూ ఆమె ఇజ్జత్ తీసే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఇది చూసి సుమ కూడా షాక్ అవ్వడం విశేషం. ప్రస్తుతం `సుమ అడ్డా` ప్రోమోలో ఇది హైలైట్గా నిలిచింది.