- Home
- Entertainment
- అమ్మానాన్న లేని `జబర్దస్త్` వినోద్ భార్యకి సీమంతం చేసిన యాంకర్ సుమ.. కన్నీళ్లు పెట్టించే కమెడీయన్ స్టోరీ
అమ్మానాన్న లేని `జబర్దస్త్` వినోద్ భార్యకి సీమంతం చేసిన యాంకర్ సుమ.. కన్నీళ్లు పెట్టించే కమెడీయన్ స్టోరీ
`జబర్దస్త్` లో కమెడీయన్ వినోద్ తన మార్క్ హాస్యంతో నవ్వులు పూయిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన జీవిత గాథ కన్నీళ్లు పెట్టిస్తుంది. ఎవరూ లేని ఆయన భార్యకి యాంకర్ సుమ సీమంతం చేయడం హాట్ టాపిక్ అవుతుంది. భావోద్వేగానికి గురి చేస్తుంది.

వినోద్.. రెబల్ యాక్టింగ్‌తో `జబర్దస్త్` షోలో కామెడీ పంచుతున్నారు. లేడీ గెటప్‌లో కనిపిస్తూ అలరిస్తుంటారు. ఎక్కువగా చమ్మక్ చంద్ర టీమ్‌లో కనిపించే వినోద్.. తన మార్క్ యాక్టింగ్ తో,పంచ్‌లతో ఆద్యంతం ఆకట్టుకుంటున్నారు. `జబర్దస్త్` షో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. షోలో లేడీ గెటప్‌లోనే దర్శనమిస్తూ తన టీవీ ఆడియెన్స్ కి నవ్వులు పూయిస్తున్నారు.
తాజాగా వినోద్ తన భార్యతో కలిసి సుమ యాంకర్‌గా రన్ అవుతున్న `క్యాష్` ప్రోగ్రామ్`లో సందడి చేశారు. వినోద్‌తోపాటు ఇతర జబర్దస్త్ కమెడీయన్లు, పవన్, తన్మయి, హరికృష్ణ కూడా పాల్గొన్నారు. హరికృష్ణ కూడా తన భార్యతో పాల్గొనగా, పవన్, ట్రాన్స్ జెండర్ తన్మయి తమ మదర్స్ తో షోలో పాల్గొన సందడి చేశారు. తమదైన కామెడీతో నవ్వించారు.
అయితే ఈ సందర్భంగా వినోద్ భార్య విజయ సీమంత చేసింది సుమ. ప్రస్తుతం విజయ ప్రెగ్నెన్సీతో ఉన్నారు. దీంతో `క్యాష్` షోలోనే ఇతర జబర్దస్త్ కమెడీయన్లు, గెస్ట్ లు, ఆడియెన్స్ మధ్య వినోద్ భార్య సీమంతం నిర్వహించారు యాంకర్ సుమ. అయితే ఆమె సీమంతం ఈ షోలో చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఆ విషయాన్ని జబర్దస్త్ కమెడీయన్ వెల్లడించారు.
విజయ గర్భవతిగా ఉంది కదా,సీమంతం చేద్దామని ఆమెని అందంగా రెడీ చేసి సీమంత చేశారు. సుమ ఏకంగా హరతి కూడా పట్డడం విశేషం. ఇది చూసిన వినోద్ ఎమోషనల్ అయ్యాడు. తట్టుకోలేక అసలు సీక్రెట్ బయటపెట్టారు. ఇటీవల తన తండ్రి చనిపోయినట్టు చెప్పాడు వినోద్. దీంతో తాను ఒంటరైపోయాడట. తన గురించి సుమ ముందు అందరికి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
అంతేకాదు ఇంకా చెబుతూ, విజయకి కూడా అమ్మానాన్న లేరని, అన్నీ తానే అని వెల్లడించారు వినోద్. దీంతో విజయ కూడా కన్నీరుమున్నీరయ్యింది. ఇది చూసి చలించిపోయిన సుమ.. మీకు అమ్మ లేదు కదా, అమ్మ ఉంటే ఇలానే చేసేది కదా అంటూ `నీకు నేనే అమ్మని, నీకు నేను సీమంతం చేస్తా` అంటూ ఆమెకి ప్రత్యేకంగా సుమనే తల్లై సీమంతం చేసింది. దీంతో అందరు చప్పట్లు కొట్టారు. తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు.
ఈ సన్నివేశాలు తాజాగా విడుదలైన `క్యాష్` లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలోని సన్నివేశాలు. విడుదలైన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతుంది. అభిమానులను అలరిస్తుంది.
`క్యాష్` షోలో తన సీమంతం గ్రాండ్‌గా నిర్వహించిన నేపథ్యంలో ఆ ఆనందంలో కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ వినోద్ భార్య విజయ. తమ పరిస్థితులు తలచుకుని ఎమోషనల్ అయ్యారు.
యాంకర్ సుమ ఆధ్వర్యంలో జబర్దస్త్ కమెడీయన్ వినోద్ భార్య విజయ సీమంతం గ్రాండ్‌గా నిర్వహిస్తున్న దృశ్యం. ఈ సన్నివేశాలు `క్యాష్` ప్రోమోలో హైలైట్‌గా నిలిచాయి. సుమ యాంకర్‌గా రన్ అయ్యే `క్యాష్` షో ఈటీవీలో ప్రసారమవుతుంది.