- Home
- Entertainment
- సిల్వర్ స్క్రీన్ పై స్పీడ్ పెంచిన శ్రీముఖి, స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఛాన్స్ లు కొట్టేస్తున్న స్టార్ యాంకర్
సిల్వర్ స్క్రీన్ పై స్పీడ్ పెంచిన శ్రీముఖి, స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఛాన్స్ లు కొట్టేస్తున్న స్టార్ యాంకర్
సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా ఎదగాలి అని ఇండస్ట్రీకి వచ్చింది యాంకర్ శ్రీముఖి. కానిక్యారెక్టర్ ఆర్టిస్ట్ తో సరిపెట్టుకుంది. ఆతరువాత కూడా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో... బుల్లి తెరకు షిఫ్ట్ అయిన శ్రీముఖి.. అక్కడ స్టార్ యాంకర్ గా వెలుగు వెలిగింది. ఇక ఇప్పుడు మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై గట్టిగా దృష్టి పెట్టింది బ్యూటీ..

ఒక వైపున టీవీ షోస్ చేస్తూనే.. వరుసగా సినిమా అవకాశాలు సాధిస్తోంది బుల్లి తెర బ్యూటీ శ్రీముఖి. వెడితెరపై స్టాండెడ్ గా నిలబడటానికి ప్రయత్నం చేస్తోంది. వచ్చిన ఏ అవకాశాలను వదులుకోకుండా సద్వినియోగం చేసుకుంటోంది స్టార్ బ్యూటీ. సిల్వర్ స్క్రీన్ర పై బిజీ అవ్వాలి అన్న తన కోరికను నెరవేర్చుకుంటుంది.
యాంకర్ రష్మీ, అనసూయ లాంటి వారు కూడా ఇలా సినిమాల్లో నిలబడాలని వచ్చినవారు. వారు కూడా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ.. యాంకరింగ్ రంగంలో స్థిరపడ్డారు. అయితే వీరిలో అనసూయ మాత్రం.. చిన్నగా సిల్వర్ స్క్రీన్ పై స్టార్ గా ఎదిగింది. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో మంచి మంచి పాత్రలు ఆమెను వరిస్తున్నాయి. ఇక ఇటు ఆఫార్ములాతోనే.. ప్రయత్నాలు చేస్తోంది యాంకర్ శ్రీముఖి.
ఇటు రష్మీ గౌతమ్ కూడా ఇలానే ప్రయత్నిస్తోంది కాని.. ఆమెకు అదృష్టం కలిసి రావడంలేదు. రెండు మూడు సినిమాలు హీరోయిన్ గా చేసినా.. పెద్దగా అవకాశాలు వరించలేదు రష్మిని. ఇక శ్రీముఖి మాత్రం ప్రస్తుతం స్టార్ హరోల సినిమాలలో ఇంపార్టెంట్ పాత్రలు చేసి.. వెలుగు వెలగడానికి గట్టిగాప్రయత్నం చేస్తోంది.
నిజానికి ఒక హీరోయిన్ కి కావలసిన గ్లామర్ శ్రీముఖిలో పుష్కలంగా ఉంది. ఆమెను పూర్తిగా సినిమాల వైపుకు వచ్చేయమనే అభిమానులు కూడా ఉన్నారు. కానీ శ్రీముఖి ముఖ్యమైన పాత్రలతోనే సరిపెడుతూ వస్తోంది. ఇక గతంలో కంటే ఇప్పుడు శ్రీముఖికి సినిమా ఛాన్స్ లు పెరుగుతున్నాయి.
బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టిన తరువాత కాస్త సైలెంట్ అయిన శ్రీముఖి.. ఇప్పుడు గట్టిగా అవకాశాలు సాధిస్తోంది. ఆమె సినిమాల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. ఈలెక్కన్న అనసూయ మధిరిగా.. కొంతకాలానికి శ్రీముఖి కూడా.. సిపిమాలకే పరిమితం అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం శ్రీముఖి చిరంజీవి భోళా శంకర్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఈ పాత్ర తనకి మంచి పేరు తీసుకువస్తుందనే నమ్మకంతో ఆమె ఉంది. ఇక బాలయ్య - అనిల్ రావిపూడి సినిమాలోను ప్రత్యేకమైన పాత్రలో ఆమె కనిపించనుంది. వెంకటేశ్ .. నాగార్జున సినిమాల్లో కూడా ఆమెకు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఛాన్స్ ను వదులుకోకుండా.. ఇదే జోరును కంటీన్యూ చేయాలని చూస్తోంది. శ్రీముఖి.