- Home
- Entertainment
- Sreemukhi: చదువొద్దు గేదెలు కాస్తానంటోన్న శ్రీముఖి.. గేదెల కోసం అమ్మ ముందు అలక...క్యూట్‌నెస్ ఓవర్‌లోడ్
Sreemukhi: చదువొద్దు గేదెలు కాస్తానంటోన్న శ్రీముఖి.. గేదెల కోసం అమ్మ ముందు అలక...క్యూట్‌నెస్ ఓవర్‌లోడ్
శ్రీముఖి తెలుగు టాప్ యాంకర్‌లో ఒకరు. తనదైన చలాకీ తనంతో ఎంటర్‌టైన్‌మెంట్ షోలను రక్తికట్టిస్తుంది. టీవీ ఆడియెన్స్ ని అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ గేదెలు కాస్తానంటోంది.

శ్రీముఖి పలు షోలతో యాంకర్‌గా బిజీగా ఉంది. అందులో `కామెడీస్టార్స్` ప్రధానంగా చెప్పొచ్చు. వీటితోపాటు సండే స్పెషల్ షోలో, అలాగే పండుగల సందర్భంగా నిర్వహించే ప్రత్యేకమైన షోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారుతుంది. వరుసగా కామెడీ షోలతో ఎంటర్‌టైన్ చేస్తుందీ భారీ అందాల భామ.
అయితే ఈ ఆదివారం డల్ మూడ్‌లో ఉంది శ్రీముఖి. సోఫాలో నుంచి లేచే పరిస్థితి లేదు. దీంతో మరీ బద్దకంగా తయారైంది. వాళ్లమ్మ ఏం చెప్పినా వినడం లేదు. అంతేకాదు అందరికి షాకిచ్చేలా గేదెలు కాస్తానంటోంది.
స్కూల్‌కి వెళ్లావా అంటూ వాళ్లమ్మ అడగ్గా నేను వెళ్లను, ఇంట్లోనే ఉంటా, ఇంటి పనులు చూసుకుంటా అని చెబుతుంది శ్రీముఖి. ఇంట్లో ఏం పనులు చూసుకుంటావని వాళ్లమ్మ అడగ్గా గేదెల పనులు చూసుకుంటానని చెబుతుంది. గేదెలు లేవుగా మనకి అనగా, కొనమని చెప్పు డాడీని అని ఖరాఖండిగా చెబుతుంది శ్రీముఖి.
గేదెలు కొన్ని పేడకాలు ఎత్తాలంటే నేను ఎత్తను అంటుంది శ్రీముఖి. గడ్డికోసుకొస్త, నీళ్లు పెడతా. ఇవే చేస్తా ఇంకేం చేయను అని గట్టిగా చెబుతుంది. స్కూల్‌కి ఎందుకెళ్లావ్ అంటూ నేను వెళ్లను అని చెప్పింది రాములమ్మ. ప్రస్తుతం ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శ్రీముఖి పంచుకోగా, అది వైరల్ అవుతుంది.
సండే సందర్బంగా సరదాగా శ్రీముఖి చేసిన రీల్ ఇది. ప్రస్తుతం తెగ ఆకట్టుకుంటుంది. స్కూల్ లైఫ్ ని ప్రతిబింబిస్తుంది. అయితే వీడియోలో స్కూల్‌కి వెళ్లను, గేదెలు కొనమని చెప్పినశ్రీముఖి.. రియల్ లైఫ్‌లో మాత్రం గుడ్ గర్ల్ అట, వీడియోకి పోస్ట్ గా ఈ విషయాన్ని తెలిపింది. తమ్ముడు సుశ్రుత్ మాత్రం `నేను స్కూల్‌కి వెళ్లను` అని చెప్పే బ్యాచ్ అని పేర్కొంది.
అయితే రీల్ చాలా బాగుందని, చాలా ఎంజాయ్ చేశామని నెటిజన్లు, ఆమె అభిమానులు అంటున్నారు. ఆమెకి అభినందనలు చెబుతున్నారు. అదే సమయంలో ఇందులో క్యూట్‌నెస్ ఓవర్ లోడ్ అని, చాలా అందంగా ఉన్నావని అభినందిస్తున్నారు. మొత్తంగా ఆదివారం స్పెషల్‌గా తన అభిమానులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ని పంచింది బొద్దుగుమ్మ శ్రీముఖి.
ఇదిలా ఉంటే త్వరలో కొత్త షోని ప్రారంభిస్తుంది శ్రీముఖి. గతంలో సూపర్ హిట్ అయిన `సరిగమప` పాటల కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమోని పంచుకుంది. జీ తెలుగులో ప్రసారమయ్యే ఈ షోకి శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తుంది. గత సీజన్‌లో ప్రదీప్ యాంకర్‌గా చేసిన విషయం తెలిసిందే.