- Home
- Entertainment
- అమ్మకు క్యాన్సర్, నాన్నకు అప్పులు, తినడానికి తిండి కూడా లేదు, జబర్దస్త్ యాంకర్ సౌమ్య జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా?
అమ్మకు క్యాన్సర్, నాన్నకు అప్పులు, తినడానికి తిండి కూడా లేదు, జబర్దస్త్ యాంకర్ సౌమ్య జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా?
జీరో నుంచి బుల్లితెర స్టార్ గా ఎదిగింది యాంకర్ సౌమ్య రావు. అమ్మ అనారోగ్యం, నాన్న అప్పులు, తినడానికి తిండి లేదు, చదువుకునే స్తోమత లేదు. అయినా సరే జీవన పోరాటం చేసి, తాను ఎదిగిన క్రమాన్నిఆమె వివరంగా వెల్లడించారు.

బుల్లితెరపై స్టార్ యాంకర్
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితురాలు సౌమ్యరావు. ఎన్నో ఎత్తుపల్లాలు చూసి, జీవితంలో ఈ స్థాయికి ఎదిగిన సౌమ్య.. తాజాగా తన జీవితంలోని కొన్ని విషాద క్షణాలను పంచుకున్నారు. కన్నడ టీవీ రంగంలో నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె, యాంకర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో పలు సీరియల్స్, టీవీ షోలు చేసిన సౌమ్య.. జబర్దస్త్ షో కి యాంకర్ గా చేసిన అతి కొద్ది కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
KNOW
గతాన్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టిన సౌమ్యరావు
తాజాగా ఓ టీవీ ఛానల్ ప్రోగ్రామ్ లో సౌమ్య తన బాల్యం, కుటుంబ పరిస్థితుల గురించి భావోద్వేగంగా వెల్లడించింది. తను జీవితంలో పడిన ఇబ్బందులు తలుచుకుంటూ విలపించింది. అమ్మ ఫోటోను పట్టుకుని బోరుమన్నారు సౌమ్యరావు. ఇదే విషయాన్ని ఆమె పలు ఇంటర్వ్యూల ద్వారా కూడా వెల్లడించారు. సౌమ్య పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. "మా నాన్న ఊరంతా అప్పులు చేశారు. మమ్మల్ని పట్టించుకోలేదు. ఆయన గురించి మాట్లాడకపోవడమే మంచిది, నేను ఆయన్ను పట్టించుకోలేదు. కాని ఆయన చేసిన అప్పుల వల్ల, అప్పులు ఇచ్చిన వారు మా ఇంటికి వచ్చి మా అమ్మని మానసికంగా వేధించేవారు. ఆ సమయంలో నేను స్కూల్ వయసులో ఉండేను. నన్ను చూసి ఎంతో మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు. మా అమ్మ ఇవన్నీ భరించలేక, నన్ను, నా అన్నను తీసుకొని కొన్ని బట్టలు, రూ.120తో తిరుపతికి వెళ్లింది.
తినడానికి తిండి కూడా లేని రోజులు
బయటకు వచ్చిన తరువాత ఏం చేయాలో తెలియని పరిస్థితి. నైట్ బస్ స్టాండ్‌లో పడుకున్నాం. రెండు రోజులు అన్నం కూడా తినలేదు, ఆతరువాత చిన్న ఇంటింకి మారాం. ఎన్నో కష్టాలు పడ్డాం. తినడానికి తిండి లేదు. మా కడుపు నింపడం కోసం అమ్మ పక్కింటికి వెళ్లి నా బిడ్డకు అన్నం పెట్టండి, కాస్త కూర ఇవ్వండి అని అడిగేది. ఇక రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు పక్కింటి నుంచి కాఫీ, పంచదార అప్పుగా తెచ్చేవాళ్లం. అందుకే మేం వస్తున్నాం అని తెలియగానే పక్కింటివాళ్లు తలుపులు వేసేసేవాళ్లు. మేము వచ్చాం అనగానే వాళ్లకు భయం వేసేది. ఒకోసారి అన్నం తినడానికే కష్టపడ్డాం. అలా కష్టపడుతూనే నేను చదువుకున్నాను'' అన్నారు సౌమ్యరావు.
అమ్మ అనారోగ్యం, జీవితాన్ని కుదిపేసింది
సౌమ్య మాట్లాడుతూ.. ''నా జీవితంలో ఎప్పుడూ కొత్త పుస్తకాలు కొనలేదు. ఎప్పుడు సెకండ్ హ్యాండ్ బుక్స్ మాత్రమే కొనుకుక్కి చదువుకున్నాను. చదువుతూనే అని చెప్పారు. పార్ట్ టైం జాబ్స్ చేస్తూ.. ఇంటిని నెట్టుకొచ్చాను. నేను బాగా చదివి చిన్న ఉద్యోగం చేసి, ఇంటిని చూసుకోవాలి అనుకున్నాను. కాని అదే టైమ్ లో అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. లోపల సెల్స్ చాలా డ్యామేజ్ అయ్యాయి. అమ్మకు రేడియో థెరపీ చేయించడం కోసం నేను వాళ్లను వీళ్లను డబ్బులు అడుక్కున్నాను. ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు అని లేకుండా అందరిని సాయం అడిగి డబ్బులు కలెక్ట్ చేసి థెరపీ చేయించాను. కానీ అంత చేసినా అమ్మ మునిపటిలా మారలేదు. రాను రాను చంటి బిడ్డలా మారింది. ఈ విషయాన్ని డాక్టర్ ముందుగానే చెప్పారు.
కూతురికి బిడ్డలా మారిన తల్లి
ఆతరువాత అమ్మ నాకు బిడ్డగా మారింది. చిన్న పిల్లమాదిరి మారిపోయింది. ఆమెకు అన్నీ నేనే అయ్యాను. చంటిపాపలా వాష్ రూమ్ కడిగి, స్నానం చేయించి, డైపర్ మార్చి, చిన్న పిల్లలా చూసుకున్నాను. అమ్మకు అలా జరగకుండా ఉంటే బాగుండేదనిపిస్తుంది," అంటూ సౌమ్యరావు సఎమోషనల్ అయింది. జబర్థస్త్ యాంకర్ గా చాలా తక్కువ టైమ్ పనిచేసింది సౌమ్య. కాని ఆమె ఉన్న కొంత కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. కారణం ఏంటో తెలియదు కాని సడెన్ గా జబర్థస్త్ నుంచి మాయం అయ్యింది సౌమ్యరావు. ఈ విషయంలో రకరకాల కారణాలు సోషల్ మీడియాలో వినిపించాయి. ప్రస్తుతం కన్నడ , తెలుగు ఇండస్ట్రీల్లో కొన్ని షోలు, టెలివిజన్ సిరీస్ లు చేస్తోంది.