రామ్ చరణ్ ఫస్ట్ క్రష్ ఎవరు? గ్లోబల్ స్టార్ సిగ్గుపడుతూ చెప్పిన అతి పెద్ద సీక్రెట్
మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక లేడీస్ అయితే చాలామంది ఆయన్ను ప్రేమిస్తుంటారు. చరణ్ అంటే క్రష్ ఉన్నవారు ఎంతో మంది. మరి రామ్ చరణ్ కు ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు మాస్ ఇమేజ్ తో పాటు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. రామ్ చరణ్ అంటే క్రష్ ఉన్నవారు ఎందరో. సెలబ్రిటీలలో కూడా చరణ్ ను పిచ్చిగా ప్రేమించేవారు ఉన్నారు. మరి ఇంతమంది అభిమానించి, ప్రేమించే చరణ్ కు ఫస్ట్ క్రష్ ఎవరై ఉంటారు ఈ విషయాన్ని చరణ్ స్వయంగా కొంత కాలం క్రితం వెల్లడించారు. ఇంతకీ రామ్ చరణ్ ఫస్ట్ క్రఫ్ ఎవరు..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తొలి క్రష్ ఎవరో స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించి షాక్ ఇచ్చారు. ఓ హాలీవుడ్ హీరోయిన్ ను ఎంతో అభిమానించేవాడిని అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రామ్ చరణ్, పాన్ ఇండియా స్థాయిని దాటి, హాలీవుడ్ మీడియాను ఆకర్షించిన తెలుగు నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 2022లో విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా సమయంలో హాలీవుడ్ మీడియాతో పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.
KNOW
రామ్ చరణ్ ఫస్ట్ క్రష్
2023లో ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అందులో భాగంగా, “మీ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ ఎవరు?” అని ప్రశ్నించగా, “జూలియా రాబర్ట్స్” అని చెప్పారు చరణ్. ఆ పేరు చెప్పేముందు రామ్ చరణ్ కాస్త సిగ్గుపడ్డారు. ఆయన అలా సిగ్గుపడుతూ చెప్పడం అభిమానులను మరింతగా ఆకర్శించింది.
చరణ్ మాట్లాడుతూ, “జూలియా రాబర్ట్స్ నా ఫస్ట్ క్రష్. ఆమెను టీవీలో కానీ, బిగ్ స్క్రీన్‌పై కానీ చూసినప్పుడు నా కళ్లను పక్కకు తిప్పుకోకుండా చూసేవాడిని. ఆమెకి నేను పెద్ద ఫ్యాన్. ‘ప్రెట్టి ఉమెన్’ సినిమా చూసిన తర్వాత ఆమెపై నాకు ప్రత్యేక అభిమానం ఏర్పడింది,” అని పేర్కొన్నారు.అంతే కాకుండా మరో హాలీవుడ్ నటి పేరు కూడా చరణ్ బయటపెట్టారు. కేథరిన్ జీటా జోన్స్ తనకు ఇష్టమైన నటి అని తెలిపారు. “తాను ఆమె నటన చూసిన మొదటి సినిమా ‘ది మార్క్ ఆఫ్ జోరో’. ఆ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ నన్నెంతో ఆకట్టుకుంది” అని అన్నారు.
ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ గుర్తింపు
ఇటీవలే ఆస్కార్ అవార్డు వేదికపై మెరిసిన ఆర్ ఆర్ ఆర్ టీమ్‌లో భాగంగా రామ్ చరణ్ కూడా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. అయితే ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ రెండు డిజాస్టర్స్ ను ఫేస్ చేశారు. తన తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య సినిమాతో పాటు, సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘గేమ్ చేంజర్’ కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన రిజల్ట్ ను చూపించింది. దాంతో ఈసారి ఎలాగైన సాలిడ్ హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు రామ్ చరణ్. అందుకు తగట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాడు.
పెద్ది సినిమా బిజీలో మెగా పవర్ స్టార్
ఈసారి పక్కగా హిట్ కొట్టి.. తన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి మూవీని అందించాలని పట్టుదలతో ఉన్నాడు రామ్ చరణ్. సుకుమార్ రాసిన కథతో, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తన 16వ సినిమాను చేస్తున్నాడు. పెద్ది టైటిల్ తో రూపొందుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈసినిమా తరువాత ఆయన సుకుమార్ డైరెక్షన్ లో మరో సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది.