- Home
- Entertainment
- 14 ఏళ్లకే స్టార్ డమ్, 300 పైగా సినిమాలు, డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన 63 ఏళ్ల మాజీ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
14 ఏళ్లకే స్టార్ డమ్, 300 పైగా సినిమాలు, డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన 63 ఏళ్ల మాజీ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తు పట్టారా? 14 ఏళ్లకే హీరోయిన్ గా మారి, చాలాతక్కువ టైమ్ లోనే స్టార్ స్టేటస్ సంపాదించిన ఈ హీరోయిన్ 300లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇంతకీ ఎవరా స్టార్.

300 లకు పైగా సినిమాలు
సౌత్ లో స్టార్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఎవరి ప్రత్యేకత వారిది. ఎవరి రికార్డులు వారివి. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుని ఇండస్ట్రీ హిట్లు కొట్టినవారు చాలామంది ఉన్నారు. సినిమాలతో పాటు రాజకీయాలల్లో కూడా రాణించిన తారలు ఉన్నారు. ప్రస్తుతం మనం అలాంటి హీరోయిన్ గురించే మాట్లాడుకుందాం. చాలా చిన్న వయసులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి. కెరీర్ మొత్తంలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ 63 ఏళ్ల వయస్సులో కూడా తగ్గేదే లేదు అంటోంది. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుస జయప్రద.
KNOW
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యింది
సౌత్ సినిమాలో ఓ వెలుగు వెలిగిన ప్రముఖ నటి జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయం, నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను మెప్పించిన ఈ నటి, కేవలం 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టింది.జయప్రదకు చిన్నప్పటి నుంచే డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. చదువుకుంటూనే డాన్స్ నేర్చుకుని ప్రత్యేకంగా ప్రదర్శణలు ఇచ్చేది జయప్రద. అయితే ఓ సందర్భంలో జయప్రదను నాట్య ప్రదర్శనలో చూసిన నటుడు ఎం. ప్రభాకర్ రెడ్డి, ఆమెను సినిమాకు పరిచయం చేశారు. 1976లో విడుదలైన "భూమి కోసం" అనే చిత్రంలో కేవలం మూడు నిమిషాల పాత్రలో నటిస్తూ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది ఈ నటి.
10 రూపాయల రెమ్యునరేషన్
తొలి సినిమాలో 10 పారితోషికం తీసుకున్న జయప్రద, క్రమంగా టాలీవుడ్ నుంచి ఇతర భాషల సినిమాల్లోకి వెళ్లి, భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి గా మారింది.
తన కెరీర్‌లో ఆమె 300కి పైగా చిత్రాల్లో నటించింది. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కమల్ హాసన్, కృష్ణంరాజు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగు చిత్రాలతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
రాజకీయాల్లో జయప్రద
తొలుత హీరోయిన్‌గా వెలుగులోకి వచ్చిన జయప్రద, తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో కూడా తన మార్క్ చూపించింది. 2005 వరకు కొనసాగిన ఆమె సినీ ప్రస్థానంలో, మూడు దశాబ్దాల పాటు అద్భుతమైన పాత్రలు చేస్తూ.. మంచి పేరు తెచ్చుకుంది. నటిగా స్క్రీన్ కు దూరం అవుతూనే రాజకీయాల వైపు వెళ్లిపోయింది జయప్రద. 1986 జూన్ 22న ఆమె సినీ నిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకున్నారు. 1994 అక్టోబర్ 10న తెలుగుదేశం పార్టీ (టిడిపి) లో చేరి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించింది జయప్రద. ఆతరువాత ఆమె నార్త్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టిన జయప్రద, అక్కడి సమాజ్ వాద్ పార్టీలో చేరి ఎంపీగా సేవలు అందించారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు.
63 ఏళ్ల వయసులో
ఇప్పటికీ ఆమె అందం, అభినయం గురించి సినీప్రేమికులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. 63 ఏళ్ల వయసులో కూడా జయప్రద తన గ్లామర్, స్టైలిష్ లుక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. సినిమా ఈవెంట్లకు హాజరవుతూ.. అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ బిజీగా గడిపేస్తోంది జయప్రద. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది సీనియర్ నటి.