- Home
- Entertainment
- డబ్బు కోసమే బిగ్ బాస్ కి వెళ్ళా, నా జీవితంతో ఆడుకున్నారు..అక్కడ తెరవెనుక జరిగే నిజాలు బయటపెట్టిన యాంకర్ రవి
డబ్బు కోసమే బిగ్ బాస్ కి వెళ్ళా, నా జీవితంతో ఆడుకున్నారు..అక్కడ తెరవెనుక జరిగే నిజాలు బయటపెట్టిన యాంకర్ రవి
యాంకర్ రవి బిగ్ బాస్ షో వల్ల తాను ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షో వల్ల తనకి జరిగిన మంచి రెమ్యునరేషన్ మాత్రమే అని అన్నారు. బిగ్ బాస్ గురించి రవి ఇంకా ఎలాంటి విషయాలు బయటపెట్టారో ఈ కథనంలో తెలుసుకుందాం.

త్వరలో బిగ్ బాస్ తెలుగు 9 ప్రారంభం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలో ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష పేరుతో సామాన్యులని ఎంపిక చేసే ప్రక్రియని ముందుగానే ప్రారంభించారు. దీనితో బిగ్ బాస్ సందడి మొదలైపోయింది. గత 8 సీజన్లకు భిన్నంగా సీజన్ 9 ఉండబోతోంది. ఈ సారి షోలో 2 హౌస్ లని తీసుకురాబోతున్నారు. మరిన్ని సర్ప్రైజ్ లు ఉండబోతున్నాయి. బిగ్ బాస్ 9 లాంచ్ సమీపిస్తున్న తరుణంలో యాంకర్ రవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
KNOW
బిగ్ బాస్ పై యాంకర్ రవి వ్యాఖ్యలు
యాంకర్ రవి గతంలో బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. బుల్లితెరపై టాప్ యాంకర్లలో రవి ఒకరు. దీనితో రవి బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో అతడిపై చాలా ఫోకస్ పడింది. కానీ బిగ్ బాస్ షో వల్ల రవి తీవ్రమైన నెగిటివిటీ ఎదుర్కొన్నాడు. బిగ్ బాస్ షో వల్ల తనకి చాలా నష్టం జరిగింది అని, సోషల్ మీడియాలో తన జీవితంతో ఆడేసుకున్నారు అన్ని రవి ఆవేదన వ్యక్తం చేశాడు.
నేను అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చారు
అసలు నాకు బిగ్ బాస్ షోకి వెళ్లడం ఇష్టం లేదు. కానీ చాలా ఏళ్లుగా నేను మా టీవీతో అసోసియేట్ అయి ఉన్నాను. సీజన్ 1 నుంచి వాళ్ళు నన్ను అడుగుతూనే ఉన్నారు. సీజన్ 5లో పాల్గొనమని మరింత ఒత్తిడి చేశారు. ఎలాగోలా తప్పించుకుందాం అని వాళ్ళు ఇవ్వలేని రెమ్యునరేషన్ డిమాండ్ చేశా. నేను అడిగినంత ఇవ్వడానికి వెంటనే ఒకే చెప్పేశారు. అక్కడ లాక్ అయిపోయాను. నో చెప్పలేకపోయాను.
బిగ్ బాస్ వల్ల జరిగిన మంచి అదొక్కటే
నాకు తెలిసి బిగ్ బాస్ అన్ని సీజన్లలో ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చింది నాకే. కోటి రూపాయలకు అటు ఇటుగా ఇచ్చారు. బిగ్ బాస్ వల్ల నాకు జరిగిన మంచి అదొక్కటే. ఆ డబ్బుతో ఇల్లు కొనుక్కోగలిగాను. బిగ్ బాస్ తెరవెనుక చాలా జరుగుతాయి. బిగ్ బాస్ షోలో చూపించేది గంట మాత్రమే. చుట్టూ కెమెరాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ నటిస్తారు. రోజులో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఒరిజినాలిటీ బయటకి వస్తుంది. బిగ్ బాస్ షోలో నేను నటించలేదు, జెన్యూన్ గా ఉన్నాను అని ఎవరైనా చెబితే వాళ్ళు అబద్దం చెబుతున్నట్లే అని రవి అన్నారు.
నా జీవితంతో ఆడేసుకున్నారు
బిగ్ బాస్ షోలో నేను ఒకటి అనుకుంటే మరొకటి అయింది. నెగిటివిటీ వల్ల నా ఫ్యామిలీ ఇబ్బంది పడ్డారు. సోషల్ మీడియాలో నా పర్సనల్ లైఫ్ ని లాగి విమర్శలు చేశారు. అసలు బిగ్ బాస్ షోకి నా పర్సనల్ లైఫ్ కి ఏంటి సంబంధం. బిగ్ బాస్ లో నేను చేసిన దాని గురించి మాట్లాడితే పర్వాలేదు. కానీ నా క్యారెక్టర్ పై మచ్చ వేశారు, పర్సనల్ లైఫ్ ని బయటకి తీశారు. నా జీవితంతో ఆడేసుకున్నారు. అందుకే సోషల్ మీడియాలో నాపై నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిపై కేసులు పెట్టాల్సి వచ్చింది అని రవి తెలిపారు. ఒక సెలెబ్రిటీ బిగ్ బాస్ షోకి వెళ్లడం వల్ల నష్టమే తప్ప ఉపయోగం లేదు అని రవి కామెంట్స్ చేశారు.