- Home
- Entertainment
- బిగ్ బాస్ సీజన్ 3 లోనే టీవీలు బంద్ చేసేవాళ్ళం.. అందరి ముందు శ్రీముఖి పరువు తీసిన అమ్మాయి
బిగ్ బాస్ సీజన్ 3 లోనే టీవీలు బంద్ చేసేవాళ్ళం.. అందరి ముందు శ్రీముఖి పరువు తీసిన అమ్మాయి
బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోలో పార్టిసిపెంట్స్, జడ్జీల మధ్య హీట్ పెరుగుతోంది. లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో ఓ అమ్మాయి శ్రీముఖి పరువు తీసేలా మాట్లాడింది.

బిగ్ బాస్ అగ్నిపరీక్ష ప్రారంభం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభానికి ముందే హంగామా మొదలైంది. సామాన్యులని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంపిక చేసే ప్రక్రియ బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఆగష్టు 22న ప్రారంభం అయింది. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో పాల్గొనే పార్టిసిపెంట్స్ లో నుంచి 15 మందిని ఫిల్టర్ చేసి వారిలో బెస్ట్ టాప్ 5 ని బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్ గా ఎంపిక చేయనున్నారు. ఆల్రెడీ అగ్నిపరీక్ష తొలి ఎపిసోడ్ ప్రసారం అయింది.
KNOW
లేటెస్ట్ ప్రోమో వైరల్
తాజాగా ఎపిసోడ్ 2 ప్రోమో విడుదలయింది. ఎపిసోడ్ ఎపిసోడ్ కి హంగామా పెరుగుతున్నట్లు ఉంది. ఓ అమ్మాయి కేకలు పెడుతూ వేదికపైకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె అలా అరవడం చూసి న్యాయనిర్ణేతలు షాక్ కి గురయ్యారు. జస్ట్ కిడింగ్ గయ్స్.. అందరి అటెన్షన్ కోసమే అలా అరిచా అని ఆమె అంటుంది.
బిగ్ బాస్ కి ఎందుకు పంపాలి నిన్ను ?
బిగ్ బాస్ కి ఎందుకు పంపాలి నిన్ను అని నవదీప్ ఆమెని ప్రశ్నిస్తాడు. ఎందుకు పంపకూడదో చెప్పాలి అని తిరిగి ఆ అమ్మాయి ప్రశ్నిస్తుంది. దీనితో శ్రీముఖి కలగజేసుకుని నువ్వు ఇలా బిగ్ బాస్ హౌస్ లో కూడా అరిస్తే.. ఏంటి ఈ పిల్ల ఇలా అరుస్తుంది అని జనాలు టీవీలు బంద్ చేస్తారు అని శ్రీముఖి కౌంటర్ ఇచ్చింది.
సీజన్ 3లోనే టీవీలు బంద్ చేసేవాళ్ళం
ఆ అమ్మాయి కూడా అస్సలు తగ్గలేదు. తిరిగి శ్రీముఖి కి కౌంటర్ ఇస్తూ ముఖం మీదే సెటైర్ వేసింది. అలా అయితే సీజన్ 3లో నువ్వు పాల్గొన్నావు కదా అక్కా..అప్పుడే టీవీలు బంద్ చేసేవాళ్ళం అని ఊహించని విధంగా పరువు తీసింది. దీనితో శ్రీముఖి ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోయినట్లు ప్రోమోలో చూపించారు. కంప్లీట్ ఎపిసోడ్ లో వీరిద్దరి మధ్య ఆర్గుమెంట్ ఎలా జరిగిందో చూడవచ్చు.
పేడ పూసుకోమని చెప్పిన బిందుమాధవి
ఇక మరో అమ్మాయి వేదికపైకి ఎంట్రీ ఇచ్చాక జడ్జీ బిందుమాధవి ఆమెని ముఖానికి పేడ పూసుకోమని అడుగుతుంది. బిందు మాధవి చెప్పినట్లుగానే ఆ అమ్మాయి పేడ పూసుకుంది. పక్కనే ఉన్న శ్రీముఖి ఇదీ అగ్ని పరీక్ష అంటే అంటూ కామెంట్ చేసింది.