- Home
- Entertainment
- కింద పడ్డా.. లేస్తానంటోన్న `జబర్దస్త్` రష్మి.. మేకప్ వేసుకుంటూ ఎమోషన్ పోస్ట్.. వైరల్
కింద పడ్డా.. లేస్తానంటోన్న `జబర్దస్త్` రష్మి.. మేకప్ వేసుకుంటూ ఎమోషన్ పోస్ట్.. వైరల్
యాంకర్ రష్మి గౌతమ్.. `జబర్దస్త్` షోతో పాపులారిటీని సొంతం చేసుకుంది. `ఢీ` షోతో మరింత పీక్‌లోకి వెళ్లిన ఈ అమ్మడు దాన్నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె పంచుకున్న పోస్ట్ వైరల్ అవుతుంది.

హాట్ యాంకర్ రష్మి.. తాజాగా షో కోసం రెడీ అవుతున్న ఫోటోలను పంచుకుంది. మిర్రర్ రిఫ్లెక్షన్‌లో తీసిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న పిక్స్ ని పంచుకుంటూ రష్మి పెట్టిన పోస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆలోచింప చేస్తుంది. ఆమె ఫోటోలు వైరల్ అవుతుండగా, ఆమె పెట్టిన పోస్ట్ సైతం చక్కర్లు కొడుతుంది.
రష్మి గౌతమ్ ఇందులో `గోడ మీద మిర్రర్‌లోని మిర్రర్.. నేను పడ్డా మళ్లీ లేస్తాను.. అది రన్‌వాక్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు` అంటూ ఆమె పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్ ద్వారా యాంకర్ రష్మి ఏం చెప్పదలచుకున్నదనేది ఆసక్తికరంగా మారింది. అయితే జీవితంలో రష్మి ఎన్నో ఆటుపోట్టు, ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడింది. ఆమెకి పడటం కొత్తకాదు, లేవడం కొత్త కాదు. అదే విషయాన్ని ఇప్పుడు చెబుతున్నట్టు అనిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఆ మధ్య రష్మి లవ్ లో ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఓ షోలోనూ ఆమె తన ప్రేమ గురించి వెల్లడించింది. అవి చాలా చర్చనీయాంశంగా మారాయి. అయితే దీనిపై క్లారిటీ లేదు. ఆమె షోలో సీన్ రక్తి కట్టించడం కోసం అలా చెప్పిందా? లేక నిజంగానే ఆమె ప్రేమలో ఉందా అనేది సస్పెన్స్ గా మారింది.
అయితే గతంలోనూ తన ప్రేమ విషయం వెల్లడించింది రష్మి. కానీ ఏరోజు బయటపడలేదు. ప్రేమ ఇంకా ఉందా? బ్రేకప్ అయ్యిందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. కేవలం రష్మి షోలో ఏదో సందర్బంలో చెప్పడం తప్ప.. రష్మి ఎవరితో ప్రేమలో ఉంది? అనేది తెలియరాలేదు.
ఇదిలా ఉంటే రష్మి, సుడిగాలి సుధీర్ ప్రేమలో ఉన్నట్టు అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. వీరిద్దరు కలిసి `జబర్దస్త్`, `ఢీ` షోలో ప్రేమ పక్షుల మాదిరిగా స్కిట్లు చేయడం, షోలోనే ఇద్దరూ రొమాన్స్ ని పండించడంతో అంతా వీరిద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటున్నారు. కానీ వీరిద్దరు మాత్రం తామి మంచి స్నేహితులమనే చెప్పుకుంటున్నారు. తమ మధ్య ప్రేమ లేదనే విషయాన్ని పలు మార్లు వెల్లడిచారు.
అభిమానులు మాత్రం రష్మి, సుధీర్‌ని కలిసే చూడాలనుకుంటున్నారు. ప్రేమ జంటగానే చూస్తున్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనే డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇటీవల `ఢీ` షో నుంచి రష్మి, సుధీర్ తప్పుకున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే తప్పించారనే టాక్ కూడా ఉంది. దీంతో అభిమానులు మళ్లీ `ఢీ` షోలోకి రావాలనే డిమాండ్ పెరిగింది.
కానీ `జబర్దస్త్` షో ద్వారా ఆడియెన్స్ ని అలరిస్తున్నారు రష్మి, సుధీర్. యాంకర్‌గా రష్మి, కమెడీయన్‌గా సుధీర్ రచ్చ చేస్తున్నారు. ఒకరిపై ఒకరు సెటైర్లు, పంచ్‌లు వేసుకుంటున్నారు. అభిమానులను అలరిస్తున్నారు. ఇటీవల న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రామ్‌లో రష్మి చేసిన ఎమోషనల్ డాన్స్ కిట్ అందరిని కదిలించింది. ఆకట్టుకుంది.
హాట్ యాంకర్ రష్మి టీవీ షోలో అందాలతో కనువిందు చేస్తూనే సినిమాల్లోనూ రాణించేందుకు ప్రయత్నిస్తుంది. ఆమె ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
also read: కుందనపు బొమ్మలా మెరిసిపోతూ సమంత కనువిందు.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. గతాన్ని మర్చిపోలేకపోతుందా ?