- Home
- Entertainment
- పండుగల టైంలో టార్గెట్ చేస్తున్న యాంకర్ రష్మీ.. ధైర్యం ఉంటే ముందు ఆ పని చేయ్, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
పండుగల టైంలో టార్గెట్ చేస్తున్న యాంకర్ రష్మీ.. ధైర్యం ఉంటే ముందు ఆ పని చేయ్, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది.

జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది. ఒకప్పుడు రష్మీ, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించింది. బుల్లితెరపై గ్లామర్ గా, కామెడీ పంచ్ లు వేస్తూ కనిపించే రష్మీ వేరు.. ఆఫ్ స్క్రీన్ లో రష్మీ వేరు.
ఆమెలో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది. లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది.
జంతు హింస గురించి చిన్న సంఘటన జరిగినా రష్మీ వెంటనే సోషల్ మీడియాలో స్పందిస్తుంది. అయితే తరచుగా రష్మీ ఇదే అంశంపై ఒక రేంజ్ లో ట్వీట్స్ వేస్తోంది. అయితే రష్మీ జంతు ప్రేమ కారణంగా తరచుగా వివాదాల్లో చిక్కుకుంటోంది.
ఆ మధ్యన అంబర్ పేటలో నాలుగేళ్ళ బాలుడిని కుక్కలు అటాక్ చేసి చంపేసిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కూడా రష్మీ కుక్కలపై ప్రేమ కురిపించడం నెటిజన్లకు నచ్చలేదు. దీనితో రష్మీని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు. ఇప్పుడు మరోసారి రష్మీ వివాదాల్లో కేంద్రంగా మారింది.
ఇటీవల ముస్లిం సోదరులంతా ఘనంగా బక్రీద్ వేడుకలు జరుపుకున్నారు. బక్రీద్ సందర్భంగా పెద్ద ఎత్తున మేకలు, పొట్టేళ్లు బలవుతాయి. దీనితో రష్మీ పండుగలు ఆచారాల కోసం జంతువులని బలిచేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది. రష్మీ ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతూ కౌంటర్లు ఇస్తున్నారు. రష్మీకి ప్రతిసారి పండుగల సమయంలోనే జంతుబలులు, జంతువుల పై ప్రేమ గుర్తుకు వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.
మరికొందరు.. పెద్ద పెద్ద కంపెనీలు నాన్ వెజ్ ని రెగ్యులర్ బ్రాండ్ గా మార్చేశారు. నిత్యం పెద్ద మొత్తంలో మాంసం విక్రయిస్తున్నారు. ఆ కంపెనీల వల్ల పెద్ద సంఖ్యలో జంతువులు బలవుతున్నాయి. నీకు ధైర్యం ఉంటే ఆ కంపెనీలని ప్రశ్నించు అంటూ రష్మీపై విరుచుకుపడుతున్నారు. ఇలా పండుగల సమయంలో అటెన్షన్ కోసం, పాపులారిటీ కోసం రష్మీ ఇలాంటి ట్వీట్స్ చేస్తోంది అంటూ మండిపడుతున్నారు.