హాస్పిటల్ బెడ్ పై యాంకర్ లాస్య, ఆందోళనలో అభిమానులు, ఆమెకు ఏమైంది..?
యాంకర్ లాస్య హస్పిటల్ పాలు అయ్యారు. హాస్పిటల్ బెడ్ పై దీనంగా పడుకుని ఉన్న లాస్య ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెకు హెల్త్ బాగోలేదని.. స్వయంగా లాస్య భర్త మంజునాథ్ ప్రకటించారు. అసలు లాస్యకు ఏమైంది.

బిగ్ బాస్ ఫేమ్.. ప్రముఖ యాంకర్ లాస్య హాస్పిటలైజ్ అయ్యారు. స్పెషలిస్ట్ ల పర్యావేక్షణలోఆమె ఉన్నారు. ఇక లాస్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయాన్ని ఆమె భర్త మంజునాథ్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. త్వరగా కోలుకోవాలని ఆకాంస్లూ వీడియోను పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో లాస్య హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి. బెడ్ పై ఉన్న లాస్యకు వరుసగా సెలైన్ ఎక్కిస్తున్నట్టు కనిపిస్తోంది. కాని అసలు లాస్యకు ఏమైంది అన్న వియాన్ని మంజునాథ్ వెల్లడించలేదు. కాని ఆమె అనారోగ్యానికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.
సోషల్ మీడియా ఇన్ ఫర్మేషన్ ప్రకారం లాస్య కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్యం బాగా లేక ఇబ్బందిపడుతుందట. అంతకంతకు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో భర్త మంజునాథ్ వెంటనే ఆమెను హాస్పిటల్ అడ్మిట్ చేశారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . దీంతో ఈ విషయం తెలిసి యాంకర్ లాస్య అభిమానులు ఆందోళన చెందుతున్నారు
స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా లాస్య స్టైల్ డిఫెరెంట్ గా ఉంటుంది. రవితో కలిసి ఆమె ఎన్నో షోస్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించింది. యాంకర్ గా కొంతకాలంగా ఆమె యాక్టివ్ గా లేదు. అంతకుముందు సంథింగ్ స్పెషల్ అనే ప్రోగ్రాం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన లాస్య.. రవితో కలిసి బుల్లితెరకే కొత్త ఫార్ములాను తీసుకొచ్చారు .
పెళ్లి తర్వాత చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది లాస్య. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తరువాత మళ్ళీ యాక్టీవ్ అయ్యింది. ఇప్పటికీ యాంకరింగ్ మానేసి అప్పుడప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ లో దర్శనం ఇస్తుంది. ఇక ఫుల్ టైమ్ ఫ్యామిలీని చూసుకుంటూ.. కొంతకాలం నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని తన పర్సనల్ విషయాలు తన షూటింగ్ విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.