Anasuya: అనసూయ బాలీవుడ్ ఎంట్రీ.. దానికోసమేనా ఇందంతా ?
బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది.
ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో Anasuya Bharadwaj ఎప్పుడూ తొందరపడదు. ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తోంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది.
క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.
అనసూయ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పుష్ప చిత్రంతో అనసూయ బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైంది. దీనితో వైవిధ్యమైన పాత్రల్లో నటించేందుకు బిటౌన్ నిర్మాతలు ఆమెని సంప్రదిస్తున్నారట. నటనతో పాటు గ్లామర్ కూడా ఉండడంతో అనసూయపై బాలీవుడ్ కన్ను పడ్డట్లు తెలుస్తోంది.
దీనితో అనసూయ కూడా బాలీవుడ్ ఎంట్రీకి ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా అనసూయ పోస్ట్ చేసిన ఫొటోస్ గమనిస్తే.. ఈ హాట్ యాంకర్ మునుపటి కంటే కొంచెం సన్నబడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో అందాలు ఒలికించేందుకు అనసూయ నాజూగ్గా మారుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. చివరగా అనసూయ ఇన్స్టాలో పోస్ట్ చేసిన రెడ్ డ్రెస్ పిక్స్ లో అనసూయ నాజూగ్గా మారినట్లు అనిపించింది.
అలాగే ఖిలాడీ చిత్రంలో కూడా అనసూయ అందాలు ఆరబోసింది. ఇందంతా నార్త్ ఎంట్రీ కోసం చేస్తున్న కసరత్తులే అని అంటున్నారు. ఏది ఏమైనా అనసూయ ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉన్న యాంకర్ అలాగే నటి.
నా గ్లామర్ ని టివిలో చూస్తూనే ఉన్నారు. ఇక్కడ సినిమాల్లో మాత్రం మిమ్మల్ని సర్ ప్రైజ్ చేయాలనే కంకణం కట్టుకున్నా అంటూ వైవిధ్యమైన పాత్రల గురించి అనసూయ గతంలో తెలిపింది.