- Home
- Entertainment
- బెడ్‌పై పడుకుని అనసూయ పగటి కలలు.. క్యూట్ స్మైల్‌తో రచ్చ.. అలా చేస్తే చివరికి మిగిలేది ఇదేనంటూ..
బెడ్‌పై పడుకుని అనసూయ పగటి కలలు.. క్యూట్ స్మైల్‌తో రచ్చ.. అలా చేస్తే చివరికి మిగిలేది ఇదేనంటూ..
హాట్ యాంకర్ అనసూయ `జబర్దస్త్`తో విశేషంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇప్పుడు నటిగానూ రాణిస్తుంది. తరచూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసే ఈ భామ ఇప్పుడు మరో రకంగా వార్తల్లో నిలుస్తుంది.

అనసూయ తాజాగా బెడ్‌పై పడుకున్న ఫోటోని షేర్ చేసింది. బ్లాక్ టీషర్ట్ ధరించి, బ్లూ బెడ్ షీట్ కప్పుకుని చిలిపి స్మైల్‌తో కవ్విస్తుంది అనసూయ. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో అనసూయ పెట్టిన పోస్ట్ మరింత ఆకట్టుకుంటుంది.
ఈ ఫోటోతోపాటు అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. దుప్పటి కప్పుకుని పగటి కలలు కంటున్నట్టు పేర్కొంది. `కలలను వదిలేసుకోవద్దు, నిద్రపోతూ ఉండండి` అని పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేసే నెటిజన్లకి ఈ రూపంలో దొరికింది పూజా. దీంతో రచ్చ షురూ చేశారు.
దీనిపై హాట్ కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్ట్ కి `జబర్దస్త్`కి ముడిపెడుతున్నారు. `అప్పుడు అలా కామెంట్లు చేసి వదిలేసుకున్నారు. ఇప్పుడు ఖాళీగా ఉండకపోతే ఏం చేస్తారు. అలా చేస్తే ఇలానే ఉంటుంద`ని పరోక్షంగా దాన్ని గెలికే ప్రయత్నం చేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు బెడ్‌పై ఇలా పడుకుంటే కుర్రాళ్ల పరిస్థితి ఏమైపోను, నెటిజన్లని రెచ్చగొట్టడం కాకపోతే ఏంటిది? అని ప్రశ్నిస్తున్నారు.
మొత్తంగా చిలిపిగా ఉన్న అనసూయ ఫోటోపై ఫన్నీగా, కొంటెగా, సెటైరికల్ గా, రొమాంటిక్‌గా కామెంట్లు చేస్తూ ఈ ఫోటోని పంచుకుంటూ వైరల్ చేస్తున్నారు. ఇటీవల `జబర్దస్త్`ని అనసూయ వదిలేసిన విషయం తెలిసిందే. ఆమె దానిపై పలు విమర్శలు చేసింది. షో చేయడం, చేయకపోవడం ఆమె వ్యక్తిగతం. కానీ నెటిజన్లు మాత్రం ఆ విషయాన్ని గెలకడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. దీన్ని లైట్ తీసుకుంటుందా? రియాక్ట్ అవుతుందా? అనేది చూడాలి.
అయితే అనసూయ తరచూ వార్తల్లో నిలుస్తుంది. తన డ్రెస్ విషయంలోనో, ఫోటో షూట్ల విషయంలోనో, కామెంట్ల విషయంలోనో ఆమె ట్రోలర్స్ బారిన పడుతుంటారు. వారిపై అంతే ఘాటుగా ఫైర్ అవుతూ వారి నోళ్లు మూయించే ప్రయత్నం చేస్తుంది అనసూయ. పాజిటివ్, నెగటివ్ ఏదైనా అనసూయ చర్చనీయాంశం కావడం కామన్. ఆమె పాపులర్ కావడం పక్కా అని చెప్పొచ్చు.
అనసూయ ఆ మధ్య స్టార్ మాలో `సూపర్ సింగర్ జూనియర్` షోకి సుడిగాలి సుధీర్‌తో కలిసి యాంకరింగ్ చేసింది. ఆ షో సీజన్ పూర్తయ్యింది. కొత్తగా మరే షో చేయడం లేదు అనసూయ. కమిట్ అయిన సినిమాలే ఉన్నాయి. సినిమాల్లో షూటింగులు ఎప్పుడో రెండు మూడు రోజులుంటాయి. అవి పూర్తయితే ఫ్రీనే. ప్రస్తుతం అలా అనసూయ ఫ్రీగా ఉన్నట్టు తెలుస్తుంది.
అనసూయ చేతిలో మంచి ప్రాజెక్ట్ లే ఉన్నాయి. ఆమె `పుష్ప 2`లో కంటిన్యూ కాబోతుంది. `సింబా`, `రంగమార్తాండ` చిత్రాల్లో నటిస్తుంది. `రంగమార్తాండ` ఈ నెలలోనే విడుదల కానుందని సమాచారం.
ఇలా మరోసారి ఆమె వెండితెరపై సందడి చేయబోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ ఏడాది `ఖిలాడీ`, `దర్జా`, `పక్కా కమర్షియల్` చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.