నా సీన్స్ కట్ చేశారు, అందులో నా తప్పేముంది... పెదకాపు ఫెయిల్యూర్ పై అనసూయ హాట్ కామెంట్స్
పెదకాపు 1 మూవీపై అనసూయ భారీ ఆశలు పెట్టుకుంది. సినిమా మాత్రం అనూహ్యంగా ఫెయిల్ అయ్యింది. పెదకాపు చిత్ర ఫెయిల్యూర్ పై అనసూయ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
Anasuya bharadwaj
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు ఓ బ్రాండ్ నేమ్ ఉంది. కొత్త బంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు. బ్రహ్మోత్సవం మూవీ ఆయన ఇమేజ్ దెబ్బతీసినా... ఆయనలో విషయం ఉందని నమ్మే ఆడియన్స్ ఉన్నారు. ఈ క్రమంలో పెదకాపు 1 ప్రకటన ఆసక్తి రేపింది. ఒక సామాజిక వర్గాన్ని గుర్తు చేసేలా ఉన్న టైటిల్ పెట్టడం కూడా ఇందుకు కారణం. కొత్త కుర్రాడు విరాట్ కర్ణను హీరోగా పరిచయం చేస్తూ పీరియాడిక్ విలేజ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పెదకాపు తెరకెక్కింది.
Anasuya bharadwaj
ట్రైలర్ కూడా ఆకట్టుకున్న నేపథ్యంలో అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ షో నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. పది కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన పెదకాపు కోటి రూపాయల షేర్ కూడా రాబట్టలేదు. ఈ మూవీలో అనసూయ కీలక పాత్ర చేసింది. ఈ మూవీ తన కెరీర్ కి చాలా ప్లస్ అవుతుందని ఆమె భావించారు. ఫలితం మాత్రం దెబ్బేసింది.
పెదకాపు ఫెయిల్యూర్ పై అనసూయ రీసెంట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.. ''పెదకాపు పూర్తిగా శ్రీకాంత్ అడ్డాల మార్క్ మూవీ. కొన్ని విషయాలు మన అంచనాకు కూడా అందవు. నాకు అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. అయితే దర్శకుడు ముందు నేనెంత. బహుశా ఆయన విజన్ నాకు అర్థం కాలేదు అనుకుంటా. నాలాగే ఆడియన్స్ కి కూడా అర్థం కాలేదేమో. అయితే పెదకాపు చిత్రాన్ని ఇష్టపడేవారు ఉన్నారు. శ్రీకాంత్ అడ్డాల తాను అనుకున్నది సాధించాడు'', అని ఆమె అన్నారు.
Anasuya Bharadwaj
పెదకాపు మూవీలో తనకు సంబంధించిన సన్నివేశాలు కట్ చేశారని సమాచారం. ఈ విషయాన్ని ఆమె ఒప్పుకున్నారు. ''పెదకాపు మూవీలో నా సన్నివేశాలు కొన్ని ఎడిటింగ్ లో తీసేశారు. దీనివల్ల కథతో కనెక్షన్ మిస్ అయ్యిందని నా భావన. అది నా తప్పు కాదు కదా. అలా తీసేయడాన్ని కూడా తప్పుబట్టలేం. శ్రీకాంత్ అడ్డాలతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. పెదకాపు 2 కూడా వస్తుంది. పార్ట్ 1లో అర్థం కాని విషయాలను పార్ట్ 2లో చెప్పే అవకాశం ఉంది.
Anasuya Bharadwaj
పెదకాపు 1 లో అనసూయ అక్కమ్మ అనే పాత్ర చేసింది. పెద్దలకు ఎదురుతిరిగి అన్యాయానికి గురైన అక్కమ్మ అనే పాత్ర చేసింది. కథను మలుపు తిప్పే కీలక రోల్ లో ఆమెను శ్రీకాంత్ అడ్డాల చూపించాడు..