- Home
- Entertainment
- నెటిజన్లని మళ్లీ గెలికిన అనసూయ.. నా ఫుడ్ నా ఇష్టం, మీకేమైనా ప్రాబ్లమా? అంటూ పోస్ట్.. రెచ్చిపోతున్న ట్రోలర్స్.
నెటిజన్లని మళ్లీ గెలికిన అనసూయ.. నా ఫుడ్ నా ఇష్టం, మీకేమైనా ప్రాబ్లమా? అంటూ పోస్ట్.. రెచ్చిపోతున్న ట్రోలర్స్.
హాట్ యాంకర్ అనసూయ తరచూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతుంటుంది. ఆమె వేసుకునే దుస్తులు విమర్శల పాలవుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం తనే ట్రోలర్స్ ని గెలకడం విశేషం.

అనసూయ సోషల్ మీడియాలో వరుసగా తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ అలరిస్తుంది. తన అభిమానులను,నెటిజన్లకి కావాల్సిన అందాల విందు వడ్డిస్తుంటుంది. ఆమె పొట్టిదుస్తుల్లో హాట్ అందాలు చూపిస్తూ రచ్చ చేస్తుంది. అందుకే ఈ బ్యూటీ తరచూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. తాజాగా ఈ అమ్మడు నెటిజన్లని గెలకడం విశేషం.
విదేశీ టూర్‌లో ఎంజాయ్ చేస్తుంది అనసూయ. అమెరికాలో చక్కర్లు కొడుతుంది. అక్కడ చిలిపి పోజులతో దిగిన ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. అందులో భాగంగా లేటెస్ట్ గా ఓ వీడియోని షేర్ చేసింది అనసూయ. ఇందులో ఆమె నాన్‌స్టాప్‌గా ఫుడ్ తింటుంది. వెరైటీ ఫుడ్‌లను టేస్ట్ చేస్తుంది. గ్యాప్ లేకుండా ఆరగిస్తూ ఉన్న వీడియోని షేర్ చేసింది.
అంతటితో ఆగలేదు. నా ఫుడ్ నా ఇష్టం మీకేమైనా ప్రాబ్లమా ? అనే రేంజ్‌లో పోస్ట్ పెట్టింది. `హే వుచ్చు చూడండి, నేను కొంత ఫుడ్ తీసుకుంటున్నా. ఆ తర్వాత మరికొంత ఎక్కువ తీసుకుంటున్నా. తర్వాత ఇంకొంత తీసుకుంటున్నా. మీకు ఏదైనా సమస్య ఉందా? అంటూ పోస్ట్ పెట్టింది అనసూయ.
ఇదే ఇప్పుడు ఇంటర్నెట్‌లో రచ్చ లేపుతుంది. తనేదో తాను తినకుండా ఇలా మమ్మల్ని గెలకడం ఎందుకంటున్నారు నెటిజన్లు. అంతగా ఇష్టం వచ్చినట్టు తిని పెంచుకోవడం ఎందుకు తర్వాత తగ్గించుకోవడం ఎందుకు, ఫుడ్ తినడం కోసమే పుట్టావా? అసలే హాట్‌గా ఉన్నావ్, ఇలా తింటే షేప్ ఔట్ అవుతావు అని, ఆంటీ కాస్త బామ్మ అవుతుందేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
ఇప్పటికే చాలా సందర్భాల్లో ట్రోల్స్ కి గురైంది అనసూయ. మొన్నటికి మొన్న తెరవెనకుండి ట్రోల్ చేసే నాస్టీ ట్రోలర్స్ కి నా యాటిట్యూడే సమాధానం. ఫ్యామిలీ లాగ ప్రేమించే ఎందరో అభిమానులున్నారంటూ కామెంట్ చేసింది అనసూయ. ఇది హాట్ టాపిక్‌గా మారింది. అంతలోనే ఇప్పుడు ఫుడ్ విషయంలో మరోసారి నెటిజన్లని గెలకడంతో వాళ్లు రెచ్చిపోతున్నారు.
అనసూయ `జబర్దస్త్` వీడిన తర్వాత నుంచి ఆమె జోరు తగ్గిన విషయం తెలిసిందే. యాంకర్‌గా ఆమెకి ఉన్నక్రేజ్ మొత్తం పడిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె స్టార్ మాలో `సూపర్ సింగర్స్ జూనియర్` షోకి సుడిగాలి సుధీర్‌తో కలిసి యాంకర్‌గా చేస్తుంది. మరోవైపు సినిమాలతో బిజీగా ఉంది అనసూయ.