Anasuya: అనసూయ పై రగిలిపోతున్న జబర్దస్త్ లవర్స్... నీ ఫీలింగ్ అదేనా అంటూ ట్రోల్స్
ఫైనల్ గా అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది. వచ్చేవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ తో ఆమె ప్రస్థానం ముగియనుంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా పెద్ద నాటకీయ పరిణామం చోటు చేసుకున్నట్లు అర్థమైంది.

కొద్దిరోజుల క్రితం అనసూయ జబర్దస్త్(Jabardasth) నుండి వెళ్ళిపోతున్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చింది. దీనిపై ఇండస్ట్రీ వర్గాలు ఆరా తీయగా నిజమే అని తేలింది. తనకు నేమ్ ఫేమ్ తెచ్చి పెట్టిన జబర్దస్త్ నుండి అనసూయ ఎందుకు వెళ్ళిపోతుందని విశ్లేషణ జరిగింది. అయితే విబేధాలు, రెమ్యూనరేషన్ నచ్చకపోవడం ప్రధాన కారణాలు కావచ్చని అంచనా వేస్తున్నారు.
తన కాంట్రాక్టు ముగిసే వరకు ఎదురుచూసిన అనసూయ(Anasuya) జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేశారన్న వాదన వినిపిస్తుంది. ఓ తలనొప్పి పోయిందిరా బాబు అని అనసూయ ఫీలైనట్లు స్పష్టంగా తెలుస్తుంది. నిన్న కాక మొన్నొచ్చిన ఇంద్రజ సైతం అనసూయ వెళ్లిపోతుంటే ఎమోషనల్ అయ్యారు. ఆమె కన్నీరు పెట్టుకున్నారు. అనసూయ మాత్రం ఈ ఎమోషనల్ డ్రామా అవసరమా అన్నట్లు చూశారు.
జబర్దస్త్ తో అనసూయది దాదాపు తొమ్మిదేళ్ల ప్రయాణం. ఇటీవల జబర్దస్త్ వీడిన రోజా సైతం తన చివరి ఎపిసోడ్ లో కన్నీటి పర్యంతం అయ్యారు. తప్పక జబర్దస్త్ వీడాల్సి వస్తుందని వెల్లడించారు. అనసూయలో ఏదో కోల్పోతున్నామన్న భావన కొంచెం కూడా కనిపించలేదు. ఈ క్రమంలో అనసూయపై జబర్దస్త్ లవర్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
నీకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ నుండి వెళ్ళిపోతూ కనీసం నువ్వు కన్నీరు పెట్టుకోలేదు. కళ్ళలో కృతజ్ఞతా భావం కనిపించలేదని అనసూయపై మండిపడుతున్నారు. నీకు అన్నం పెట్టిన షో పట్ల నీకున్న ప్రేమ ఇంతేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇక నెలలో మూడు రోజులు జబర్దస్త్ కి కేటాయించలేవా? అని చలాకీ చంటి అనసూయను నిలదీసిన విషయం తెలిసిందే.
రాకెట్ రాఘవ అయితే ఆమెకు పరోక్షంగా చురుకలు వేశాడు. జబర్దస్త్ చాలా మందికి లైఫ్ ఇచ్చింది, ఇంకా చాలా మందికి లైఫ్ ఇస్తుంది. ఎవరు ఉన్నా లేకున్నా జబర్దస్త్ ఆగదు. కొత్తవాళ్లు వస్తూనే ఉంటారు. మంచి మంచి కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటారని ఆయన అన్నారు. జబర్దస్త్ ప్రారంభం నుండి ఇంత వరకు ఆ షోని వీడని వాడిగా రాఘవకు రికార్డు ఉంది.