ద్వేషించే వారిని గెలికిన అనసూయ.. తనకు అభిమానులే అంటూ నిప్పులపై ఉప్పు చల్లిన హాట్ యాంకర్..
యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చేసే రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. ఆమె నిద్ర పోతున్న ట్రోలర్స్ లేపినట్టుగా వ్యవహరిస్తుంది. రెచ్చగొట్టే ప్రోగ్రామ్‌లు పెట్టుకుంటూ హల్‌చల్ చేస్తుంటుంది.
జబర్దస్త్ యాంకర్ అనసూయ.. కామెడీ షోని వదిలేసి సినిమాలతో బిజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఖాళీ టైమ్ ఎక్కువగా దొరుకుతున్న నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్ట్ లతో ఆకట్టుకుంటూ నెటిజన్లని ఎంగేజ్ చేస్తుంది. ఏదో రకమైన గిలిగింతలు పెట్టే పోస్ట్ లతో అందరి చూపు తనవైపు తిప్పుకుంటుంది.
సోషల్ మీడియాలో వివాదాలకు కూడా కేరాఫ్‌గా నిలుస్తుంది అనసూయ. తనని హేట్ చేసే వాళ్లని కౌంటర్లిస్తూ రచ్చ చేస్తుంది. అదే సమయంలో విచిత్రమైన పోస్ట్ లతోనూ ఆమె ట్రోల్స్ కి గురవుతుంది. ఈ అమ్మడిపై విమర్శలు, వారికి అనసూయ కౌంటర్లు అవి మరింత రచ్చ చేస్తుంటాయి. సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి.
పాజిటివ్‌గా అయినా, నెగటివ్‌గా అయినా తను వార్తల్లో ఉండేలా చూసుకుటుంది అనసూయ. ఏమాత్రం గ్యాప్ వచ్చినా, ఏదో రూపంలో ఆమె రచ్చ చేసే ప్రయత్నం చేస్తుంది. తాజాగా అదే చేసింది. చాలా రోజులుగా అనసూయ డిస్కస్ లేదు. చాలా కామ్ అయిపోయింది. ఈనేపథ్యంలో మరోసారి గిల్లే ప్రయత్నం చేసింది. తనహేటర్స్ కి గిలిగింతలు పెట్టింది అనసూయ.
వాళ్లని రెచ్చగొట్టేలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో అనసూయ చెబుతూ, `ద్వేషించే వారందరికీ ఒక సందేశం అంటూ, నేను చేసే పని మీకు నచ్చకపోవచ్చు, కానీ నేను చేసేదంతా మీరు చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ మీరు నా అభిమానినే` అంటూ పోస్ట్ పెట్టింది. ఇది నెట్టింట రచ్చ లేపుతుంది. ఇలా మరోసారి అనసూయ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేసింది.
అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఎందుకు మేడం నిద్రపోతున్న సింహాలను లేపుతారు అని, రెచ్చగొట్టడం అంటే ఇదే మరి, నిప్పులపై ఉప్పు చల్లి మళ్లీ రచ్చ చేస్తుందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుంది. చాలా వరకు అనసూయకి మద్దతు ప్రకటిస్తున్నారు. హేటర్స్ ఎవరూ లేరని, కొన్నిసార్లు మీరు చేసే పనులను ట్రోల్స్ చేయాల్సి వస్తుందని అంటున్నారు.
అదే సమయంలో కొన్ని సెటైర్లు పేలుస్తున్నారు. మీకు ఎవరూ ఫ్యాన్స్ లేరని, మీ ఫీగర్‌కే ఫ్యాన్స్ ఉన్నారంటున్నారు. వచ్చిందయ్యా వయ్యారీ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఆండ్రూ టేట్ కొటేషన్లని కాపీ చేస్తుందంటున్నారు. మొత్తానికి ఈ అమ్మడిని పోస్ట్ లపై రచ్చ చేస్తున్నారు.
photo credit-anasuya insta
ఇక అనసూయ ప్రస్తుతం టీవీ షోస్ మానేసి సినిమాలతోనే బిజీగా ఉంది. ఆమె `పుష్ప2`లో నటిస్తుంది. అలాగే `పెదకాపు1`లో, `సింబా`లో, దీంతోపాటు మరో రెండు మూడు తెలుగు సినిమాలు, ఓ తమిళ మూవీ చేస్తుంది. డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. పెద్ద తెరపై తానేంటో నిరూపించుకుంటుంది. అలాగే అడపాదడపా గ్లామర్ ట్రీట్ ఇస్తూ నెటిజన్లని ఖుషి చేస్తుందీ సెక్సీ యాంకర్.