- Home
- Entertainment
- యాంకర్ అనసూయ బర్త్ డే స్పెషల్.. కొత్త సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్.. విభిన్న పాత్రల్లో రంగమ్మత్త
యాంకర్ అనసూయ బర్త్ డే స్పెషల్.. కొత్త సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్.. విభిన్న పాత్రల్లో రంగమ్మత్త
బుల్లితెర బ్యూటీ, యాంకర్ అనసూయ పుట్టిన రోజు సందర్భంగా ఆమె సన్నిహితులు, సినీ ప్రముఖులు బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా తను నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు.

బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ (Anasuya). బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకలను అలరిస్తోంది.
హైదరాబాద్ కు చెందిన ఈ బ్యూటీ.. 1985 మే 15న జన్మించింది. ఈ ఏడాది 35 ఏట అడుగెట్టింది. 2013 నుంచి టెలివిజన్ ప్రజెంటర్ గా, యాంకర్ గా యాక్టివ్ గా ఉన్న అనసూయ... ప్రస్తుతం వరుస చిత్రాల్లో విభిన్న పాత్రలో నటిస్తూ తన సత్తా చాటుతోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా అప్ కమింగ్ ఫిల్మ్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి.
రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించి తనలోని మరో కోణాన్ని చూపించింది. దీంతో ‘పుష్ప : ది రూల్’లో ఎలా కనిపించనుందోనని ఆసక్తిగా నెలకొంది. అదే జోష్ లో ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లో నటిస్తోందీ సుందరి.
అనసూయ నటిస్తున్న కొత్త చిత్రాల్లో ‘సింబా’ ఒకటి. ఈ చిత్రం నుంచి ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పోస్టర్ చాలా ఆసక్తిగా ఉంది. కోర్టు బోణులో నిల్చోని తీర్పుకోసం ఆత్రుతగా ఎదురుచూస్తు్నట్టుగా కనిపిస్తోంది. అటవీ సంరక్షణ ఆవశ్యకతపై తెరక్కుతున్న ఈ చిత్రాన్ని రాజేందర్ రెడ్డి, ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మిస్తున్నారు. మురళీమనోహర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
లీడ్ రోల్ లో అనసూయ నటిస్తున్న మరో మూవీ ‘వాంటెడ్ పండుగాడ్ : పట్టుకుంటే కోటీ’. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో అనసూయ క్రేజీ రోల్ ప్లేచేస్తోంది. చేతి చూసి జాతకాలు చెప్పే కోయ అమ్మాయిగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు సమర్పిస్తున్నారు. యునైటెడ్ కే బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీధర్ సీపన దర్శకత్వం వహిస్తున్నారు.
అనసూయ భరద్వాజ్ పుట్టిన రోజు సందర్భంగా తన చిత్రాల నుంచే కాకుండా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్, అలాగే సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ తరుఫున కూడా స్పెషల్ పోస్టర్లతో బర్త్ డే విషెస్ తెలియజేశారు. అలాగే రోజు సాయంత్ర 7:00 గంటలకు అనసూయ పుట్టిన రోజును సోషల్ మీడియా వేదికన స్పెషల్ సీడీపీలతో సెలబ్రేట్ చేయనున్నారు అభిమానులు.