అర్ధరాత్రి మొదలుపెట్టి తెల్లారుజాము వరకు నాన్ స్టాప్ గా... బాగా అలసిపోయిన అనసూయ!
అనసూయ వెరీ కమిటెడ్. అలాగే హార్డ్ వర్కింగ్ నేచర్ కలిగిన ఆర్టిస్ట్. ఆమె తన లేటెస్ట్ ప్రాజెక్ట్ కోసం నిద్ర కూడా లేకుండా కష్టపడుతుంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు షేర్ చేసింది.

Anasuya Bharadwaj
నటి అనసూయ కొత్త ప్రాజెక్ట్ కోసం తెగ కష్టపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి తెలియజేశారు. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు. అర్థరాత్రి మొదలైన షూటింగ్ తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్ గా కొనసాగిందట. బాగా అలసిపోయనంటూ డల్ గా ఉన్న ఫోటో షేర్ చేశారు.
Anasuya Bharadwaj
అనసూయ ప్రస్తుతం నటిస్తున్న ఆ ప్రాజెక్ట్ వివరాలు ఆమె చెప్పలేదు. అయితే అద్భుతమైన పాత్ర దక్కింది అంటున్నారు. ఇలాంటి అరుదైన గొప్ప పాత్రలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న మేకర్స్, ఆడియన్స్ కి ధన్యవాదాలు అని ఆమె చెప్పుకొచ్చారు. అనసూయ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్స్ ఆసక్తి రేపుతున్నాయి.
Anasuya Bharadwaj
అనసూయ లేటెస్ట్ రిలీజ్ విమానం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో అనసూయ వేశ్య రోల్ చేయడం కొసమెరుపు. అలాంటి ఛాలెంజింగ్ రోల్ చేసేందుకు ముందుకు రావడమే కాకుండా, అత్యంత సహజంగా నటించి మెప్పించింది. విమానంలో మూవీలో అనసూయ పాత్రకు ప్రశంసలు దక్కాయి. అలాగే రంగమార్తాండ మూవీలో కూడా కీలక రోల్ చేశారు.
ఇక పుష్ప 2లో మరోసారి ఆమె దాక్షాయణిగా కనిపించనున్నారు. దర్శకుడు సుకుమార్ త్వరితగతిన ఈ క్రేజీ సీక్వెల్ షూట్ పూర్తి చేస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. వేర్ ఈజ్ పుష్ప కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకుంది. పుష్ప 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
కాగా బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. అనసూయకు యాంకరింగ్ మీద పుట్టిందట. మేకర్స్ టీఆర్పీ కోసం ప్లే చేస్తున్న ట్రిక్స్ తనకు నచ్చడం లేదట. అందుకే యాంకరింగ్ మానేశానని ఆమె వెల్లడించారు. ఇకపై ఆమె యాంకరింగ్ చేసేది లేదని గట్టిగా చెప్పారు. ఇది బుల్లితెర ఆడియన్స్ ని నిరాశపరిచే అంశమే..
అదే సమయంలో అనసూయ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అనసూయ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా అనసూయ-విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య యుద్ధం నడిచింది. అనసూయను వాళ్ళు ట్రోల్ చేశారు. అనసూయ ఏమాత్రం తగ్గలేదు. నేనేమిటో చూపిస్తానంటూ సవాల్ విసిరారు. ఇటీవల ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు అనసూయ వెల్లడించారు.