- Home
- Entertainment
- అర్థరాత్రి వరకు అక్కడే.. నిద్ర లేక అనసూయ ఎలా అయిపోయిందో చూడండి... సుకుమార్‌కి ఇది న్యాయమా?
అర్థరాత్రి వరకు అక్కడే.. నిద్ర లేక అనసూయ ఎలా అయిపోయిందో చూడండి... సుకుమార్‌కి ఇది న్యాయమా?
హాట్ యాంకర్ అనసూయ.. ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉంది. ఆమె టీవీ షోస్ వదిలేసి సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. అయితే సినిమా షూటింగ్‌లతో నిద్ర లేకుండా గడుపుతుందీ హాట్ యాంకర్. తన బాధలను అభిమానులతో పంచుకుంటుంది.

అనసూయ భరద్వాజ్.. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో పెద్ద సినిమా `పుష్ప2`. ఇది గత కొన్ని రోజులుగా కంటిన్యూగా చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పటికే చాలా లేట్ అయిన నేపథ్యంలో ఇక గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తుంది. ప్రధాన తారాగణం ఇందులో పాల్గొంటుందట.
`పుష్ప2` షూటింగ్ ఇప్పుడు ఎక్కువగా నైట్‌లో జరుగుతుందట. ఈ షూటింగ్‌లో అనసూయ పాల్గొంటుందట. తాజాగా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించింది. అంతేకాదు తాను ఎంత బాధ పడుతుందో కూడా వెల్లడించింది. అర్థ రాత్రి వరకు షూటింగ్ జరుగుతుందని చెప్పింది అనసూయ. ఈ మేరకు ఆమె అర్థ రాత్రి ఏ టైమ్ అయ్యిందో కూడా తన పోస్ట్ లో వెల్లడించింది.
ఇందులో అనసూయ దాక్షాయణి పాత్రలో కనిపించబోతుంది. ఆమెది పూర్తి నెగటివ్ రోల్. సునీల్ భార్యగా నటిస్తుంది. తన తమ్ముడిని చంపిన పుష్పరాజ్‌పై పగ తీర్చుకునేందుకు రగిలిపోయే పాత్ర ఆమెది. `పుష్ప2`లో మెయిన్‌గా ఉంటుందని సమాచారం. కట్ చేసిన జుట్టు, పట్టు చీర, చేతులకు బంగారు గాజులు, నోట్లో ఎప్పుడూ కిల్లీ నములుతూ ఉంటుంది దాక్షాయణి(అనసూయ).
ఇప్పుడు ఆమె పంచుకున్న లేటెస్ట్ ఫోటోలోనూ అదే లుక్‌లో కనిపిస్తుంది. అయితే దాన్ని కొద్దిగే చూపించింది అనసూయ. అసలు లుక్‌ని దాచేసింది. మరోవైపు 3.16 నిమిషాలకు దిగిన మరో ఫోటోని ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ఇందులో అనసూయ బాగా వాడిపోయి, అలసిపోయి కనిపిస్తుంది. నైట్ షూటింగ్‌తో బాగా అలసిపోతున్నట్టు, నిద్ర కూడా ఉండటం లేదనే విషయాన్ని అనసూయ తన పోస్ట్ ల ద్వారా వెల్లడించింది.
అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. నిద్ర లేక అనసూయ ఎలా అయిపోయిందో చూడండి అని, పాపం అనసూయ పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది?, ఎలాంటి అందం ఎలా అయిపోయిందని, సుకుమార్ మీకిది న్యాయమేనా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకా బోల్డ్ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.
అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న `పుష్ప2` చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాజిల్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. అనసూయ,సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లోగానీ, వచ్చే ఏడాది సమ్మర్‌లోగానీ విడుదలయ్యే అవకాశం ఉంది. దీన్ని భారీగా, లార్జ్ స్కేల్‌లో రూపొందిస్తున్నారు దర్శకుడు సుకుమార్.
అనసూయ.. ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. అందులో `పుష్ప2`తోపాటు `సింబా`, తమిళంలో ఓ సినిమా చేస్తుంది. తెలుగులోనూ మరో రెండు మూడు చిత్రాలున్నాయి. వాటికి సంబంధించిన ప్రకటనలు రావాల్సి ఉంది. ఇటీవల `విమానం`లో అనసూయ వేశ్యగా నటించింది. దీంతోపాటు ప్రభుదేవాతో చేస్తున్న సినిమాలోనూ వేశ్యగా కనిపించబోతుందని సమాచారం.