- Home
- Entertainment
- Anasuya Cruel Villain: కత్తి పట్టి, హుక్కా తాగుతూ హాట్ యాంకర్ క్రూరమైన విలనిజం.. ఇకపై రచ్చ రంబోలే
Anasuya Cruel Villain: కత్తి పట్టి, హుక్కా తాగుతూ హాట్ యాంకర్ క్రూరమైన విలనిజం.. ఇకపై రచ్చ రంబోలే
యాంకర్ అనసూయ `జబర్దస్త్` షోలో గ్లామర్‌ని పంచింది. సినిమాల్లో నటనని చూపించింది. ఇకపై విలనిజం చూపించబోతుందట. అది మామూలు కాదు అత్యంత క్రూరమైన విలన్ అవతారం ఎత్తబోతుంది.

హాట్ యాంకర్ అనసూయ అంటే అందమైన ఫోటో షూట్లే గుర్తొస్తాయి. ప్రతి వారం ఆమె `జబర్దస్త్` కోసం గ్లామరస్‌గా ముస్తాబై అభిమానులను, నెటిజన్లని కనువిందు చేస్తుంది. విజువల్ ట్రీట్ ఇస్తూ వారిని ఖుషీ చేస్తుంది. అదే సమయంలో ఆమె నెట్టింట రచ్చ చేస్తుంది. ఆమె పొట్టి దుస్తులపై తీవ్రమైన విమర్శలు వస్తుంటాయి. వాటికి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తూ నెటిజన్ల నోళ్లు మూయిస్తుంది.
మరోవైపు కేవలం టీవీ షోస్‌లోనే గ్లామర్ అని, బిగ్ స్క్రీన్‌పై మాత్రం నటనతో మెప్పించాల్సిందే అని, విభిన్నమైన, విలక్షణమైన పాత్రలు పోషించాల్సిందే అని, నటనతో మెస్మరైజ్ చేయాల్సిందే అని చెబుతుంది. అదే పంథాలో ముందుకు సాగుతుంది. విభిన్న మైన పాత్రలు పోషిస్తూ మెప్పిస్తుంది. బలమైన పాత్రలతో తనలోని కొత్త కోణాలను ఆవిష్కరిస్తుంది అనసూయ.
`రంగస్థలం`లో రంగమ్మత్తగా అనసూయ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె చిట్టిబాబు పాత్ర చేసిన రామ్‌చరణ్‌కి చేదోడు వాదోడుగా, సపోర్టివ్‌గా ఉండే ఓ బలమైన పాత్ర పోషించి మెప్పించింది. టాలీవుడ్‌లో రంగమ్మత్తగా నిలిచిపోయింది. ఓరకంగా వెండితెరపై అనసూయకిది బిగ్ బ్రేక్ ఇచ్చిన సినిమాగా చెప్పొచ్చు. కెరీర్ పరంగా మైల్ స్టోన్ పాత్రగానూ చెప్పాలి.
ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో మెయిన్ రోల్స్ చేసినా అనసూయ మెప్పించలేకపోయింది. ఆయా సినిమా పరాజయం చెందడంతో అనసూయకి ఆ స్థాయి పేరు రాలేదు. అంతేకాదు ఐటెమ్ సాంగ్ కూడా చేసింది. అయినా ఆడియెన్స్ ని అలరించడంలో సక్సెస్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో మరో పాత్రతో ముందుకొచ్చింది. `పుష్ప` సినిమాలో దాక్షాయణిగా మెప్పించింది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది. అయితే ఇందులో ఆశించిన స్థాయిలో నటనకు స్కోప్ దక్కలేదు. దీంతో అనసూయ పాత్ర తేలిపోయింది. `పుష్ప` రెండో పార్ట్ లోనైనా మరింతగా ఆకట్టుకుంటుందనే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.
ఇదిలా ఉంటే మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న `ఖిలాడీ` సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది అనసూయ. తాజాగా ఆమె పాత్ర ఫస్ట్ లుక్‌ని శుక్రవారం విడుదల చేశారు. ఇందులో అనసూయ .. చంద్రకళ అనే పాత్రలో కనిపించబోతుంది. అయితే ఫస్ట్ లుక్‌ని బట్టి అనసూయ ఇన్నోసెంట్ గల అమ్మాయిగా కనిపించబోతుందని తెలుస్తుంది. రెండు చేతులు గిల్లుకుంటూ నవ్వులు పూయిస్తూ అనసూయ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. నెట్టింట రచ్చ చేస్తుంది.
ఇదిలా ఉంటే మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తుంది అనసూయ. `ఆచార్య`, `రంగమార్తాండ` వంటి సినిమాలు చేస్తుంది. అయితే వీటితోపాటు సునీల్‌తో కలిసి మరో సినిమా చేస్తుంది అనసూయ. `దర్జా` పేరుతో ఈ చిత్రం రూపొందుతుంది. శివ శంకర పైడిపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో అనసూయ క్రూరమైన విలన్‌గా కనిపించబోతుందట. ఓ వైపు కత్తిపట్టి, మరోవైపు హుక్కా తాగుతూ కనిపిస్తుందట. సినిమాకి ఆమె మెయిన్ విలన్ అని తెలుస్తుంది. విలనిజాన్ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లే చిత్రమిదనే టాక్ వినిపిస్తుంది.
లేడీ విలన్స్ లో `దర్జా`లోని అనసూయ విలనిజం ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని తెలుస్తుంది. ఈ చిత్రంలో అనసూయ లుక్ సైతం భయంకరంగా ఉంటుందని టాక్. అయితే శనివారం ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ని, అనసూయ ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా అనసూయ పాత్ర తీరుతెన్నులు తెలుస్తాయని అంటున్నారు. ఇకపై అనసూయ విలన్‌గా రచ్చ చేయబోతుందని తెలుస్తుంది.