- Home
- Entertainment
- Anasuya Sorry: ఆ రోజే నిలదీయాల్సింది, తప్పు వాళ్లదే అంటూ అనసూయ ట్విస్ట్.. నటి రాశికి క్షమాపణలు
Anasuya Sorry: ఆ రోజే నిలదీయాల్సింది, తప్పు వాళ్లదే అంటూ అనసూయ ట్విస్ట్.. నటి రాశికి క్షమాపణలు
హీరోయిన్ రాశి.. ఇటీవల అనసూయ తనపై చేసిన తప్పుడు వ్యాఖ్యలను ఓ షోలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అనసూయ స్పందించింది. ఆమెకి సారీ చెప్పింది.

అడ్డంగా దొరకిపోయిన అనసూయ
నటుడు శివాజీ చేసిన కామెంట్స్ రోజు రోజుకి మరింత వివాదంగా మారుతున్నాయి. ఆ వివాదం పెరుగుతుందే తప్ప, తగ్గడం లేదు. కామెంట్ చేసిన శివాజీ ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. కానీ దాన్ని పూసుకొని కొందరు సెలబ్రిటీలు ఇంకా వివాదాన్ని కొనసాగిస్తున్నారు. అందులో ముందు వరుసలో ఉన్నది అనసూయ. ఆమె ఈ వ్యాఖ్యలపై చాలా సందర్భాల్లో స్పందించింది. ఛాన్స్ దొరికితే కౌంటర్లతో విరుచుకుపడుతుంది. అయితే ఊహించని విధంగా ఇప్పుడు ఆమె దొరికిపోయింది. గతంలో ఆమె హీరోయిన్ రాశిపై చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి.
రాశికి అనసూయ క్షమాపణలు
అనసూయ గతంలో తాను యాంకర్‌గా చేసిన షోలో నటి రాశిపై డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో కామెంట్ చేసిన నేపథ్యంలో దానిపై రాశి ఘాటుగా స్పందించింది. అది వైరల్‌గా మారింది. హాట్ టాపిక్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఎట్టకేలకు అనసూయ దిగొచ్చింది. రాశికి క్షమాపణలు చెప్పింది. అయితే తప్పు తనదేం లేదని, వాళ్లదే అని షో నిర్వాహకులపైకి నెట్టింది. తాను కూడా క్షమాపణలు చెబుతూనే వాళ్ల వల్లే ఆ తప్పు జరిగిందని చెప్పింది. ఈ మేరకు అనసూయ ఒక క్షమాపణల నోట్ ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ఆ రోజే తప్పుని నిలదీయాల్సింది
`రాశి గారు మీకు క్షమాపణలు. మూడు ఏళ్ల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్‌లో మీ పేరుని ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది. కానీ అప్పటికినాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించేదు. అది పొరపాటే. దయజేసి నా క్షమాపణనుల అంగీకరించండి. వెనక్కి వెళ్లి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను, పీపుల్ ఇప్పుడు చాలా మారిపోయారు, చాలా ఎదిగారు. ఆ షోలో డబుల్ మీనింగ్ డైలాగ్ లను ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచి పెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు` అని తెలిపింది అనసూయ.
నాపై హేట్ కంపెయిన్ నడిపిస్తున్నారు- అనసూయ
ఆమె ఇంకా చెబుతూ, ఈ రోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి హేట్ కంపెయిన్ నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక, రచయిత, నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా, చెప్పకపోయిన నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెబుతున్నా. మహిళల బాడీకి సంబంధించి గతంలో కంటే ఇప్పుడు నేను చాలా స్ట్రాంగర్‌గా, ఎంపవర్‌గా మారిపోయాను. ఇది మీరు అర్థం చేసుకొని సపోర్ట్ గా ఉంటారని భావిస్తున్నా` అని తెలిపింది అనసూయ. ప్రస్తుతం ఆమె పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే ఇందులో తాను మాత్రమే కాదు, ఆ షో నిర్వహకుల తప్పుకూడా ఉందని చెప్పింది అనసూయ. ఈ క్రమంలో షో నిర్వాహకులను గట్టిగా ఇరికించింది.
రాశి ఏం మాట్లాడిందంటే ?
ఇంతకి రాశి ఏమన్నదంటే, శివాజీ చేసిన కామెంట్స్ కి రియాక్ట్ అవుతూ, శివాజీ గారు మాట్లాడింది 100 శాతం తప్పు అని నేను అనను. కొన్ని మాటలు ఆ విధంగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. కానీ అలా మాట్లాడినందుకు ఆయనే బాధపడ్డారు. క్షమాపణలు కూడా చెప్పారు. ఇది పక్కన పెడితే నాకు నాలుగేళ్ళ క్రితం ఒక సంఘటన ఎదురైంది. ఒక షోలో యాంకర్ ఒక కామెడీ స్కిట్ చేసింది. ఆ స్కిట్ లో హైపర్ ఆది రాశి ఫలాలు అని అంటాడు.. వెంటనే ఆ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా అని అడుగుతుంది. ఒక మహిళ అయి ఉండి ఆమె అలా ఎలా మాట్లాడుతుంది. నా భర్త నాకు ఒక వీడియో క్లిప్ చూపించారు. అది మీరంతా రెగ్యులర్ గా చూసే ఒక కామెడీ షోకి సంబంధించిన క్లిప్. అందులో జడ్జెస్, యాంకర్ కూడా మీ అందరికీ తెలుసు. ఆ షోకి రమ్మని నన్ను కూడా పిలిచారు. `ప్రేయసి రావే` సినిమాకి సంబంధించి కామెడీ స్కిట్ చేయాలని అడిగారు. ఆ సినిమా ఒక క్లాసిక్. దాన్ని కామెడీ చేయడం ఇష్టం లేక రానని చెప్పాను. ఆ షోకి జడ్జిగా, గెస్ట్ గా రమ్మంటే వస్తాను కానీ, ప్రేయసి రావే` సినిమాని కామెడీ చేయడానికి మాత్రం అంగీకరించను అని చెప్పా.
రోజా నవ్వింది, కానీ నేను నవ్వేదాన్ని కాదు- రాశి
అదే యాంకర్ ఇప్పుడు శివాజీ వివాదంలో బాగా మాట్లాడుతున్నారు. రాశి ఫలాల్లో నేను లేను. కానీ రాశి గారి ఫలాలు అంటే నేను ఉంటాను. ఆ యాంకర్ మాట్లాడింది నా గురించే. రాశి గారి ఫలాలు అని యాంకర్ అనగానే అక్కడున్న జడ్జి కూడా నవ్వారు. ఆ టైంలో జడ్జిగా ఉన్నది రోజా. నేను ఆ ప్లేస్ లో ఉంటే నవ్వను. పైగా స్కిట్ ని ఆపేసేదాన్ని. బాడీ షేమింగ్ చేసే హక్కు ఎవరికీ లేదు. కన్న తల్లిదండ్రులకు కూడా లేదు. నేను దీనిపై లీగల్ గా వెళదాం అని అనుకున్నా. కానీ మా అమ్మ వద్దని చెప్పింది అందుకే ఆగిపోయాను` అని తెలిపింది రాశి. దీంతో ఇప్పుడు ఎట్టకేలకు అనసూయ దిగొచ్చి రాశికి బహిరంగంగానే లేఖ ద్వారా క్షమాపణలు చెప్పింది.

