- Home
- Entertainment
- మెగా ఫ్యామిలీని గెలికిన అనసూయ.. అల్లు అర్జున్‌పై షాకింగ్ కామెంట్స్.. మరో వివాదానికి తెరలేపిన హాట్ యాంకర్
మెగా ఫ్యామిలీని గెలికిన అనసూయ.. అల్లు అర్జున్‌పై షాకింగ్ కామెంట్స్.. మరో వివాదానికి తెరలేపిన హాట్ యాంకర్
యాంకర్ అనసూయ కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమె విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూ కామెంట్లతో వార్తల్లో నిలిచింది. దానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. కానీ అల్లు అర్జున్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి.

అనసూయ.. యాంకరింగ్ మానేసి సినిమాలు చేసుకుంటుంది. టీవీ షోస్‌లో వచ్చే విమర్శలు, ట్రోల్స్, బాడీ షేమింగ్ కామెంట్లని తట్టుకోలేక ఆమె బుల్లితెరకి గుడ్ బై చెప్పినట్టు వెల్లడించింది. ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. అందులో భాగంగా ఆమె చేస్తున్న సినిమాల్లో పెద్ద మూవీ `పుష్ప2` అని చెప్పాలి. ఇందులో ఆమె దాక్షాయణిగా నెగటివ్ రోల్ చేస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇందులో పుష్పరాజ్‌పై పగ తీర్చుకునేందుకు రగిలిపోయే పాత్రలో అనసూయ కనిపించనుంది.
దీంతోపాటు మెగా ఫ్యామిలీలో అందరు హీరోలతోనూ కలిసి నటిస్తుంది అనసూయ. రామ్‌చరణ్‌తో `రంగస్థలం` చేసింది. ఈ సినిమానే ఆమెకి పెద్ద బ్రేక్ ఇచ్చింది. దీంతోపాటు చిరంజీవితోనూ కలిసి నటించింది. అయితే అనసూయ.. బన్నీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఆమెకి సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనసూయ కామెంట్లు దుమారం రేపుతున్నాయి.
ఇందులో అనసూయ మాట్లాడుతూ అల్లు అర్జున్ హీరో ఏంటీ? అనేది ఆమె కామెంట్ చేసింది. మెగా ఫ్యామిలీ అయితే హీరో అయిపోతారా? అంటూ అనసూయ స్టార్ట్ చేసింది. `గంగోత్రి` చూసి అసలు మనవాళ్లకి ఏమైంది అంటూ ఆశ్చర్యపోయిందట. ఆ పాటలో మాత్రం అస్సలు చూడలేకపోయాను అంటూ వెల్లడించింది. బన్నీ హీరో ఏంటి? అని అనసూయ ఆశ్చర్యపోయింది. అంతేకాదు ఇందులో ఓ పాటని అల్లు అర్జున్ లేడీ గెటప్‌లో కనిపిస్తాడు. అస్సలు చూడలేకపోయాను అంటూ వెల్లడిచింది. చాలా ఏళ్ల క్రితం అనసూయ మాట్లాడిన వీడియో క్లిప్ ఇది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ అనసూయని ఓ రేంజ్‌లోఆడుకుంటున్నారు.
ఎనిమిదేళ్ల క్రితమే దీనిపై ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. కానీ అప్పుడు ఇంతటి సోషల్ మీడియా లేదు. ఇప్పుడు విస్తృతంగా విస్తరించింది. దీంతో ప్రతిదీ వైరల్‌గా మారుతుంది. అలానే అనసూయ ఓల్డ్ వీడియో క్లిప్ సైతం ఇప్పుడు వైరల్ అవుతుంది. అందరిని ఆశ్చర్యపరచడమే కాదు, షాక్‌కి గురి చేస్తుంది. అనసూయ ఇలాంటి కామెంట్స్ చేయడమేంటి? అని అంతా నోరెళ్లబెడుతున్నారు. మొత్తంగా ఈ వీడియో నెట్టింట పెద్ద దుమారమే రేపుతుంది. మరి దీనిపై అనసూయ రియాక్ట్ అవుతుందా? ఇది మున్ముందు ఎలాంటి వివాదాలు క్రియేట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Anasuya Bharadwaj
అనసూయ ప్రస్తుతం `పుష్ప2`తోపాటు `సింబా`, తమిళంలో `వోల్ఫ్`, అలాగే మరో రెండు మూడు తెలుగు సినిమాలు చేస్తుంది. నటిగా బిజీగా ఉంది ఈ భామ. మరోవైపు అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా ఎదిగారు. ఆయన `పుష్ప`తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. `పుష్ప2` హిట్ అయితే గ్లోబల్ స్టార్ జాబితాలో చేరిపోతారు. అలాంటిది బన్నీపై అనసూయ ఇలాంటి కామెంట్లు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.