- Home
- Entertainment
- మేకప్ లేకుండా వెన్నెల రాత్రిలో అనసూయ షాకింగ్ లుక్.. అక్కడ మిస్ అవుతున్నామంటూ ఫ్యాన్స్ గోల..
మేకప్ లేకుండా వెన్నెల రాత్రిలో అనసూయ షాకింగ్ లుక్.. అక్కడ మిస్ అవుతున్నామంటూ ఫ్యాన్స్ గోల..
హాట్ యాంకర్ అనసూయ `జబర్దస్త్`తో పాపులర్ అయ్యింది. కానీ ఇటీవల అనూహ్యంగా దానికి గుడ్ బై చెప్పింది. దీంతో ఆ అందాలు దూరమవుతున్నాయి. అడపాదడపా మెరుస్తుందీ హాట్ బ్యూటీ.

అనసూయ భరద్వాజ్ తాజాగా మేకప్ లేకుండా మెరిసింది. అయితే చాలా సందర్భాల్లో ఆమె మేకప్ లేకుండా కనిపించింది. తన సహజమైన అందాలను చూపించి అభిమానులను ఆకట్టుకుంది. పండులాంటి అందాలతో కనువిందు చేసింది. కానీ ఈ సారి అందుకు భిన్నంగా కనిపించింది అనసూయ. తాజాగా ఈ హాట్ యాంకర్ మేకప్ లేకుండా రాత్రి సమయంలో మెరవడం విశేషం. వెన్నెల రాత్రిని తలపించేలా ఓ రీసార్ట్ లో మెరిసింది. లాంథర్ లైట్లని తలపించే చిన్ని వెలుగుల నీడలో మేకప్ లేకుండా కనిపించింది అనసూయ.
ఈ సందర్బంగా దిగిన ఫోటోని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇందులో టీషర్ట్, టైట్ ప్యాంట్ ధరించింది. బిగువైన టీషర్ట్ లో పరువాల విందు చేస్తూ మెరిసింది. వెన్నెల రాత్రుల్లో అనసూయ మేకప్ లేకుండా కనిపించడంతో అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. వామ్మో ఇదెక్కడి లుక్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
యాంకర్ అనసూయ అడపాదడపా హాట్ ఫోటోలు పంచుకుంటుంది. తాను ఉన్నాననే విషయాన్ని చాటుకుంటుంది. కానీ రెగ్యూలర్‌గా గ్లామర్‌ని మిస్ అవుతున్నారు నెటిజన్లు. ఆమె అందాలు, ఆమె అప్పియరెన్స్ ని మిస్ అవుతున్నారట. తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఆమె ఫోటోకి పోస్ట్ పెడుతూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మేడం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నామని, కనిపించడమే మానేశావని, గ్లామర్ ట్రీట్ లేక అల్లాడిపోతున్నామని పోస్ట్ లు పెడుతున్నారు. జబర్దస్త్ లో మళ్లీ చూడాలని ఉందని కోరుకుంటున్నారు. వియ్ మిస్ యూ మేడమ్, మళ్లీ టీవీలోకి రావాలని కోరుకుంటున్నారు. ఏదైనా షో చేయాలంటున్నారు. మరి వారి రిక్వెస్ట్ లను అన్నుబేబీ కన్సిడర్ చేస్తుందా అనేది చూడాలి.
ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొంది అనసూయ. ఇందులో ఆమె రెడ్ డ్రెస్‌లో మెరిసింది. జ్యోతి ప్రజ్వలన చేస్తూ కనిపించింది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులను అలరిస్తున్నాయి. ఇందులో బొద్దుగా ఎంతో అందంగా ఉంది అనసూయ.
ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది అనసూయ. ఆమె చేతిలో ఐదారు సినిమాలుండటం విశేషం. వాటిలో `పుష్ప2`, `రంగమార్తాండ`, `సింబా`తోపాటు మరికొన్ని సినిమాలు చేస్తుంది. తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తుండటం విశేషం. అందానికి దూరంగా నటనతో నిరూపించుకోవాలనుకుంటుంది అనసూయ.
అనసూయ జబర్దస్త్ ని మానేయడానికి కారణం తనపై వచ్చే వల్గర్ కామెంట్లు అనే వెల్లడించిన విషయం తెలిసిందే. తన పిల్లలు పెద్దవుతున్నారు. వాళ్లకి అన్నీ అర్థమవుతుంటాయి. ఈటైమ్‌లో కామెడీ షోలో బాడీ షేమింగ్ కామెంట్లు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఫేస్ చేయడం సరికాదని ఆమె షోకి గుడ్ బై చెప్పినట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. మంచి షో వస్తే ఆలోచిస్తానని తెలిపింది.