MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనసూయ పొట్టి బట్టల వివాదం సీన్ రివర్స్..అప్పుడేమో చీప్ కామెంట్స్, ఇప్పుడేమో ఇలా

అనసూయ పొట్టి బట్టల వివాదం సీన్ రివర్స్..అప్పుడేమో చీప్ కామెంట్స్, ఇప్పుడేమో ఇలా

టాలీవుడ్ క్రేజీ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై వెలుగు వెలిగిన అనసూయ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రలు చేస్తోంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 27 2024, 06:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ క్రేజీ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై వెలుగు వెలిగిన అనసూయ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రలు చేస్తోంది. అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరినీ మెప్పిస్తోంది.

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

36

అనసూయకి ఎంత క్రేజ్ ఉందో అదే స్థాయిలో వివాదాలు కూడా వెంటాడుతూ ఉంటాయి. గత ఏడాది అనసూయ పలు వివాదాస్పద సంఘటనలతో ట్రోలింగ్ ఎదుర్కొంది. గతంలో అనసూయ డ్రెస్సింగ్ పై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం అయ్యాయి. అనసూయ.. ఆ అమ్మాయి వేసుకునే పొట్టి బట్టలు ఏంటండీ అంటూ కోట ఓ ఇంటర్వ్యూలో తీవ్రంగా విమర్శించారు. అలాంటి బట్టలు వేసుకోవలసిన అవసరం ఏంటి అని కోట విమర్శించారు. 

46

కోట వ్యాఖ్యలకు అనసూయ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. బట్టలు అనేవి వ్యక్తిగత విషయం. ఎవరికీ నచ్చినట్లు వాళ్ళు బట్టలు వేసుకుంటారు. పెద్దమనిషిగా చలామణి అవుతూ ఇలా చీప్ కామెంట్స్ చేయడం ఏంటి అంటూ అనసూయ బదులిచ్చింది. దీనితో ఆ వివాదం సోషల్ మీడియాలో బాగానే హై లైట్ అయింది. 

56

ఈ వివాదం జరిగి రెండేళ్లు గడుస్తోంది. తాజాగా మరోసారి అనసూయ ఈ వివాదం గురించి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. అయితే ఈసారి కోట శ్రీనివాసరావు గురించి మంచిగా మాట్లాడింది. ఈ సంఘటన జరిగిన తర్వాత కోట గారు నాతో మాట్లాడారు. నా ఇంట్లో బిడ్డలుగా భావించి అలా చెప్పానని అన్నారు. కాకపోతే అలా పబ్లిక్ ఫ్లాట్ ఫామ్ లో చెప్పడం తప్పే అని ఆయన ఫీల్ అయ్యారు. 

66

కోట లాంటి సీనియర్ నటులు నాకు క్షమాపణ చెప్పడంతో చెమటలు పట్టేసినట్లు అయింది. ఆయన చాలా గొప్ప నటులు. ఆయన నెగిటివ్ రోల్స్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఆయనకి పాపం ప్రస్తుతం డిజిటల్ యుగంలో లౌక్యంగా ఉండడం అర్థం కాలేదు. అందుకే అలా మాట్లాడారు. కొందరు ఆయన మాటలని అడ్వాంటేజ్ తీసుకుని నన్ను ట్రోల్ చేసారు అంటూ అనసూయ తెలిపింది. మొత్తంగా అప్పుడేమో చీప్ కామెంట్స్ అంటూ.. ఇప్పుడేమో కోటని ప్రశంసలతో ముంచేస్తూ అనసూయ సీన్ మొత్తాన్ని మార్చేసింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image3
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved