MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: తులసిని దారుణంగా అవమానించిన అనసూయ.. బాధతో కుమిలిపోతున్న తులసి..?

Intinti Gruhalakshmi: తులసిని దారుణంగా అవమానించిన అనసూయ.. బాధతో కుమిలిపోతున్న తులసి..?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు నవంబర్ 4వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Nov 04 2022, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్లో అనసూయ కాయగూరలు కొనడానికి వెళ్ళగా ఇక్కడ కొందరు ఆడవాళ్లు తులసిని కూతురు అని నెత్తికెక్కించుకున్నావు ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని తలా ఒక మాట అంటూ ఉంటారు. అదొక్కటే కాదు బాయ్ ఫ్రెండ్స్ సామ్రాట్ తో పాటు అంటూ అని మాట్లాడడంతో అనసూయ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలోనే తులసి ఇంట్లోకి వెళ్లడం చూసిన అనసూయ ఆగు అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడు తులసి అనసూయ ఆశీర్వాదాలు తీసుకోవాలి అనుకోగా వెంటనే ఆగు చాలు నాటకాలు నన్ను ముట్టుకోకు అని గట్టిగా అరుస్తుంది అనసూయ.
 

27

అప్పుడు అందరూ చూస్తుండగా ఇదిగో మీరు అనుకుంటున్నాట్టు తులసి వెళ్లిపోలేదు నేనే గెంటేసాను అని వారందరు ముందు తులసిని అవమానిస్తుంది అనసూయ. అప్పుడు అనసూయ తులసి నిందిస్తూ ఈవిడ మర్యాదలు కట్టుబాట్లు దాటడంతో పాటు సిగ్గు లేకుండా అన్ని హద్దులు జరుపుకుంటూ పోయింది అని తులసీని నానా మాటలు అంటూ అవమానిస్తూ ఉంటుంది అనసూయ. మీరందరూ చెప్పినట్టుగా తప్పు నాదే కోడలిని కూతురుగా భావించాను అని ఉంటుంది అనసూయ. అప్పుడు అక్కడ ఉన్న ఆడవారికి మీ అందరికీ గట్టిగా మళ్లీ మళ్లీ చెప్తున్నాను ఈ తులసి నా కోడలు కాదు కూతురు కాదు మళ్ళీ గుర్తు పెట్టుకోండి అని అంటుంది.
 

37

 ఈవిడ గారితో నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు అని అంటుంది అనసూయ. అప్పుడు నేను వెళ్ళొస్తాను అత్తయ్య అని వెళ్ళిపోతూ ఉండగా  లాస్య ఆగు తులసి అంటూ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని తీసుకుని వస్తుంది. ఇప్పుడు తులసి ఎందుకు ఆగమన్నావు అని అనగా అప్పుడు లాస్య సామ్రాట్,తులసి గురించి నోటికి వచ్చిన విధంగా వాగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్తావా లేకపోతే వెళ్ళిపోవాలా అని అనగా ఇప్పుడు లాయర్ దగ్గర నుంచి వచ్చాను ఈ డాక్యుమెంట్స్ చదువు నీకు అర్థం అవుతుంది అని అంటుంది లాస్య.
 

47

ఈ ఇంటిని అత్తయ్య పేరు మీదకు మార్చాను అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి సంతకం పెట్టు అని అంటుంది లాస్య. కావాలంటే ఇవి సామ్రాట్ కూడా చూపించవచ్చు అనడంతో అనసూయ అవసరం లేదు అని అంటుంది. అప్పుడు అనసూయ కూడా నోటికి వచ్చిన విధంగా వాగడంతో తులసి సైన్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్లిన తులసి అనసూయ మాటలు గుర్తుతెచ్చుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ మాటలు గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది తులసి.
 

57

 ఇంతలోనే తులసి వాళ్ళ పిఏ అక్కడికి వచ్చి పేమెంట్స్ గురించి చెబుతూ ఉండగా ఇక ఆపుతావా డబ్బు డబ్బు అంటూ తులసి ఆమె పై సీరియస్ అవుతుంది. అప్పుడు తులసి ఏం మాట్లాడుతుందో అర్థం కాక పిఏ అలాగే నిల్చుంటుంది. అప్పుడు తులసి పీఏ ని గెట్ అవుట్ అని అరవడంతో ఇంతలో అక్కడికి సామ్రాట్ వస్తాడు. అప్పుడు తులసికి తాగడానికి నీళ్లు ఇస్తాడు సామ్రాట్. అప్పుడు తులసి స్వారీ అని అనగా మొదటిసారి మీరు ఆఫీస్ లో ఇంత కోపంగా కనిపిస్తున్నారు ఎందుకు అని అడుగుతాడు సామ్రాట్. 
 

67

అప్పుడు నా కోపానికి కారణం మా కుటుంబ సభ్యులు అనటంతో మళ్లీ గొడవ జరిగిందా అని సామ్రాట్ అడగగా ఎందుకు సామ్రాట్ గారు మనుషులు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు మనుషులకు కుళ్ళు కుతంత్రాలు మోసాలు అంటూ బాధతో మాట్లాడుతుంది తులసి. ఈ సమాజంలో ఓపిక లేకపోతే బ్రతకలేము రోజుకి ఒకరిని చంపేయాలి అనిపిస్తుంది అని అంటుంది తులసి. అప్పుడు సామ్రాట్ మాత్రం తులసి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు తులసి ఎమోషనల్ అవడం చూసి మరింత బాధపడతాడు. జీవితాంతం మా అత్తయ్యకి సేవ చేసిన ఎందుకు నా మీద మా అత్తయ్యకు కృతజ్ఞత లేదు అనీ బాధపడుతూ ఉంటుంది తులసి.
 

77

అప్పుడు తులసి తన అత్తయ్యను తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరొకవైపు అనసూయ అసలు ఆ తులసి ఏమనుకుంటుంది కనీసం నా వయసు కూడా మర్యాద ఇవ్వకుండా క్షమించండి అత్తయ్య గారు అని కూడా అడగకుండా ఆస్తి పేపర్ మీద సైన్ చేసి వెళ్ళిపోయింది అని కోప్పడుతూ ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్న లాస్య అనసూయన్ని తన మాటలతో మరింత రెచ్చగొడుతూ ఉంటుంది. మరొకవైపు తులసి తన బాధను మొత్తం సామ్రాట్ తో చెప్పుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. సామ్రాట్ ఇంత ఓదార్చినా కూడా తులసి మాత్రమే ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ పంచులు వేసి తులసిని నవ్విస్తాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలను పిచ్చిగా ఇష్టపడే ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకంతఇష్టమంటే?
Recommended image2
రామ్ చరణ్ పెద్ది సినిమాపై చిరంజీవి రివ్యూ, మెగాస్టార్ ఏమన్నారు? నిజమెంత?
Recommended image3
Illu Illalu Pillalu Today Episode Feb 23: భాగ్యానికి దొరికిపోయిన నర్మద సాగర్, వల్లికి పండగే పండగ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved