- Home
- Entertainment
- పనీపాటా లేదనుకున్నావా.. అనసూయకి పోలీసుల షాక్ అంటూ నెటిజన్ సెటైర్, అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన యాంకర్
పనీపాటా లేదనుకున్నావా.. అనసూయకి పోలీసుల షాక్ అంటూ నెటిజన్ సెటైర్, అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన యాంకర్
ఇటీవల అనసూయ లైగర్ చిత్రంపై కామెంట్స్ చేయడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అనసూయని ఆంటీ అని ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. ఏ సంబంధం లేని తనని ఆంటీ అని ఎలా పిలుస్తారు అంటూ అనసూయ ఫైర్ అయింది.

ఇటీవల అనసూయ లైగర్ చిత్రంపై కామెంట్స్ చేయడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అనసూయని ఆంటీ అని ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. ఏ సంబంధం లేని తనని ఆంటీ అని ఎలా పిలుస్తారు అంటూ అనసూయ ఫైర్ అయింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయినా ట్రోలర్స్ తగ్గడం లేదు. అదే పదం ఉపయోగిస్తూ అనసూయ పై కామెంట్స్ చేస్తున్నారు.
అనసూయ కూడా ట్రోలర్స్ కి ధీటుగా బదులిస్తూనే ఉంది. తాజాగా అనసూయ ట్వీట్స్ తో ఈ వివాదం మరోసారి నెట్టింట రచ్చగా మారింది. ఓ నెటిజన్ అనసూయని రెచ్చగొడుతూ కామెంట్స్ చేశాడు. నెటిజన్లు తనని ఆంటీ అంటూ ఏజ్ షేమింగ్ చేస్తున్నారని అనసూయ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చింది. దీనిపై సదరు నెటిజన్.. పోలీస్ డిపార్ట్మెంట్ కి నీలాగా పనీపాటా లేదు అనుకున్నావా అని చెప్పి వెనక్కి పంపారటగా అని అనసూయకి ట్యాగ్ చేశాడు. దీనిపై అనసూయ అంతే ఘాటుగా బదులిచ్చింది.
'లేదండి.. మీలాగా పనీపాటా లేని వాళ్ళకి బుద్ది చెప్పే టైం వచ్చింది అని చెప్పారు. నోరు జారడంలో మీకు తొందర ఎలాగూ ఉంది. బోల్తా పడేందుకు కూడా తొందరేనా.. కాస్త ఓపిక పట్టండి అన్నీ జరుగుతాయి' అని అనసూయ కౌంటర్ ఇచ్చింది.
మరో నెటిజన్.. అసలు ఆంటీ లేదా అంకుల్ అని పిలిస్తే ఏ సెక్షన్ వర్తిస్తుంది అని ప్రశ్నించాడు. అది ఆంటీ అని పిలిచినందుకు కాదు.. దానిని అడ్డం పెట్టుకుని ట్రోల్ చేస్తూ కించపరిచినందుకు. నా మానసిక ప్రశాంతతని దూరం చేసినందుకు అది శిక్షించ దగ్గ నేరం అవుతుంది.
మరికొందరు నెటిజన్లు.. ఒకరి సినిమా ఫెయిల్యూర్ ఇలా ఓపెన్ ఫ్లాట్ ఫామ్ లో సెలెబ్రేట్ చేసుకుంటే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. ఆ వేవ్ కాస్త మీపై తుఫాన్ లాగా మారింది. ఒకరిని ఇబ్బంది పెట్టాలని కామెంట్ చేస్తే మనమే ఇబ్బందుల్లో పడతాం అని నెటిజన్లు అనసూయని ట్రోల్ చేస్తున్నారు.
అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ చెప్పిన ఓ బూతు డైలాగ్ అప్పట్లో వివాదం సృష్టించింది. ఆ డైలాగ్ పై అనసూయ కూడా విమర్శలు చేసింది. ఇటీవల లైగర్ డిజాస్టర్ గా మారడంతో.. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు అంటూ అనసూయ విజయ్ దేవారకొండ చిత్రంపై పరోక్షంగా కామెంట్స్ చేసింది. అలా ఈ వివాదం మొదలైంది.