MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విజయ్ కు తెలియకుండానే అవన్నీ జరిగాయా? : విభేదాలపై అనసూయ

విజయ్ కు తెలియకుండానే అవన్నీ జరిగాయా? : విభేదాలపై అనసూయ

'అర్జున్ రెడ్డి' సినిమా ఎంత హిట్ అయిందో విజయ్ దేవరకొండతో అనసూయ గొడవ అంతకంటే ఎక్కువే హిట్ అయింది. అసలు ఆ సినిమా రిలీజ్ టైమ్‌లో అనసూయ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

4 Min read
Surya Prakash
Published : Jun 08 2023, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114


రౌడీ హీరో  విజయ దేవరకొండ, ప్రముఖ టీవీ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మధ్య విభేదాలు అందరికీ తెలిసినవే. సోషల్ మీడియా వేదికగా  అనసూయను లక్ష్యంగా చేసుకుని విజయ్ దేవరకొండ అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం, కామెంట్లు, దూషణలతో విరుచుకుపడడం తెలిసిందే.  రీసెంట్ గా  ఖుషీ సినిమా పోస్టర్ పై విజయ్ దేవరకొండ పేరు ముందు 'ద' అని పేర్కొనడాన్ని పైత్యంగా అనసూయ అభివర్ణించింది.  అయితే ఈ విభేధాలపై అనసూయ డైరక్ట్ గా స్పందించిందిలేదు. కానీ తొలిసారిగా ఈ అంశాలపై అనసూయ భరద్వాజ్ తన స్పందనను ఓ మీడియా సంస్థతో పంచుకుంది. 

214

అనసూయ మాట్లాడుతూ... ‘‘విజయ్, నేను లోగడ స్నేహితులమే. అప్పుడు ఏ సమస్యా లేదు. అర్జున్ రెడ్డి (2017) విడుదల అయిన తర్వాతే పరిస్థితి మారింది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ బూతులను మ్యూట్ చేశారు. విజయ్ ఓ థియేటర్ ను సందర్శించినప్పుడు వాటిని ఆన్ స్క్రీన్ పై వేశారు. వాటిని పలకాలని విజయ్ దేవరకొండ అభిమానులను కోరాడు. వారు ఆ బూతు పదాలను మాట్లాడారు. 

314


విజయ్ ఆ సినిమాలో ధూషించే పాత్రను పోషించాడు. సినిమా వరకు బాగానే ఉంది. కానీ, నిజ జీవితంలో ప్రేక్షకులను ఆ పదాలు పలికేలా ప్రోత్సహించడం ఏంటి? ఓ తల్లిగా ఇలాంటి అసభ్యకర పదాలు నన్ను బాధిస్తాయి. నేను దీనిపై విజయ్ తో మాట్లాడాను. నిజజీవితంలో వాటిని ప్రోత్సహించొద్దని కోరాను’’ అని అనసూయ వివరించింది. ఆన్ లైన్ లో మహిళలను యువత దూషించడం పెరిగిపోయినట్టు అనసూయ పేర్కొంది.  

414


విజయ్ దేవరకొండ తండ్రి 2019లో 'మీకు మాత్రమే చెప్తా' సినిమాని నిర్మిస్తున్న సమయంలో తనకు పాత్రను ఆఫర్ చేసినట్టు అనసూయ తెలిపింది. ‘‘విజయ్ ప్రచారకర్త తనను దర్భాషలాడుతూ పోస్టులు పెట్టినట్టు అతడి బృందానికే చెందిన ఒకరు నాకు చెప్పారు. ప్రచారకర్త పెయిడ్ ట్రోల్స్ చేస్తున్నప్పుడు దానిపై విజయ్ కు అవగాహన ఉంటుంది కదా? అతడికి తెలియకుండా వారు ఇలాంటివి చేయరని నేను ఖచ్చితంగా చెప్పగలను’’ అని అనసూయ తన ఆవేదన వ్యక్తం చేసింది.

514

విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా ‘ఖుషి’ పోస్టర్‌లో ‘ది దేవరకొండ’ అని వేసుకుంటే నీకెందుకు? ‘ద దేవరకొండ’ అని వేసుకుంటే నీకెందుకు? అతని సినిమా అతని ఇష్టం.. మధ్యలో అతన్ని కెలకడం ఎందుకు? అతని ఫ్యాన్స్‌తో తిట్టించుకోవడం ఎందుకు? తాజా వివాదంపై యాంకర్ అనసూయపై నెటిజన్ల నుంచి.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవే. 

614


నిజానికి అనసూయ.. విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావించకుండానే మంట పెట్టేసింది. అసలే రౌడీ ఫ్యాన్స్ ఊరుకుంటారా? అనసూయను ఆంటీ పేరుతో ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఇక అనసూయ మాత్రం తక్కువా.. వాళ్లు ఒకటి అంటే రెండు అంటా అన్నట్టుగా విజయ్ ఫ్యాన్స్‌కి కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తుంది.

714


 అయితే తన గురించి జనం మరిచిపోతున్నారన్నపుడల్లా.. అనసూయ ఇలాంటి వివాదాల్లో వేలు పెడుతూనే ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. అయితే ఆ తరువాత మీడియాపై నోరు పారేసుకోవడం కామనే అంటున్నారు.  ఈ వివాదంపై కూడా ఎప్పటిలాగే మీడియాపై నోరు పారేసుకుంది అనసూయ. 

814


నిజానికి విజయ్‌ని అతని ఫ్యాన్స్‌ని కెలకాలని కాకపోతే.. ఆ పోస్టర్‌లో ద దేవరకొండ అని పెట్టుకుంటే అనసూయకి ఏం సంబంధం అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి అనసూయ.. ఎన్ని సినిమాలు చేసినా.. కామెడీ షోలు చేసినా కూడా అప్పట్లో అర్జున్ రెడ్డి వివాదంతోనే బాగా హాట్ టాపిక్ అయ్యింది. ఆంటీ అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ కాస్త గ్యాప్ ఇచ్చి విజయ్ దేవరకొండ‌ని కెలికింది అనసూయ.
 

914

తన ఫేస్ బుక్‌ స్టోరీలో అనసూయ వీడియో వదిలింది. ‘నస పెట్టను సూటిగా పాయింట్‌కి వచ్చేస్తా.. కొన్ని వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్.. మాలాంటి పబ్లిక్ ఫిగర్స్, పేరున్న వాళ్లపై వార్తలు రాసి పొట్ట నింపుకునేవాళ్ల కోసం నేను చెప్పబోతున్నాను. సో అండ్ సో ఫ్యాన్స్ అనసూయని ఏసుకున్నారు. సో అండ్ సో ఫ్యాన్స్ అనసూయని ఏడిపించారు.. ట్రోల్ చేశారు.. అని కాదు రాయాల్సింది

1014
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

మీకింకా దునియా దారి తెలియదని చెప్తున్నా.. మీకు క్లారిటీ ఇస్తున్నా.. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డ వాడు కాదు.. అన్నవాడి నోరే కంపు.. మీకు ధైర్యం ఉంటే.. ఉప్పు కారాలు తిని ఉంటే నిజం రాయండి. నేను ధైర్యంగా నా అభిప్రాయం చెప్పడం జరిగింది. చేతకాని వాళ్లు అదుపుతప్పారు. ఇది మీరు రాయాల్సింది’ అంటూ బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేసింది అనసూయ. 

1114
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj


యాంకర్ అనసూయ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. థాయిలాండ్‌ బీచ్‌లో భర్తతో హాయిహాయిగా ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. లిప్‌లాక్, బికినీ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఎప్పుడూ లేనంతగా ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇచ్చింది. అది కూడా ఒకదాని తర్వాత ఒకటి వదలుతూనే ఉంది.

1214

'అర్జున్ రెడ్డి'ని మరిపించే కిస్సింగ్ ఫొటో అయితే హైలెట్. ఇక ఆ తర్వాత బికినీలో అందాలు ఆరబోస్తూ రంగమత్త చేసిన హడావిడి అయితే వేరే లెవల్. ఇక వరసగా ఇలా అనసూయ పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలు చూసి ఫ్యాన్సే అవాక్కవుతున్నారు. అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం అనసూయను ఓ ఆట ఆడుకుంటున్నారు.

1314

ఇక సినిమాల్లో నటిగానే నిరూపించకోవాలనుకుంటున్నట్టు తెలిపింది. దీనికితోడు తన పిల్లలు పెద్దగా అవుతున్నారు. వారికి తనపై వచ్చే కామెంట్లు, ట్రోల్స్ అర్థమవుతున్నాయనే ఉద్దేశ్యంతో తాను టీవీ నుంచి తప్పుకున్నట్టు తెలిపింది అనసూయ. దీనికితోడు గ్లామర్‌ ఫోటో షూట్లు కూడా తగ్గించింది. అడపాదడపా చాలా తక్కువగానే ఫోటో షూట్‌ పిక్స్ పంచుకుంటుంది. 

1414
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj


 తాజాగా ఇన్‌స్టాలో అనసూయ ఇలా లిప్‌లాక్, బికినీ వీడియోలు పోస్ట్ చేయడంతో రౌడీ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. "ఆ రోజు అర్జున్ రెడ్డి బూతు అన్న నీకు ఇవి బూతులా కనిపించడం లేదా, హక్కులు నీకు మాత్రమే ఉంటాయా?, నీతులు నీకు వర్తించవా, ఈ ఫొటోలు, వీడియోలతో సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావ్" అంటూ విజయ్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అనసూయ భరద్వాజ్
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
Recommended image2
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు
Recommended image3
BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved