- Home
- Entertainment
- మేకప్ ఉంటే ఒకలా, లేకుంటే మరోలా.. ఏళ్ల తరబడి అతడితో సింక్ బాగా కుదిరింది, అనసూయ క్రేజీ కామెంట్స్..
మేకప్ ఉంటే ఒకలా, లేకుంటే మరోలా.. ఏళ్ల తరబడి అతడితో సింక్ బాగా కుదిరింది, అనసూయ క్రేజీ కామెంట్స్..
సెలెబ్రిటీలు అందంగా కనిపించడంలో వాళ్ళ మేకప్ ఆర్టిస్టుల శ్రమ ఎంతైనా ఉంటుంది. మేకప్ ఆర్టిస్టులకి సైతం క్రెడిట్ ఇచ్చే సెలెబ్రిటీలు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో అనసూయ ఒకరు అని చెప్పొచ్చు.

టాలీవుడ్ క్రేజీ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై వెలుగు వెలిగిన అనసూయ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రలు చేస్తోంది. అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరిని మెప్పిస్తోంది.
గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తన అందాలతో యువతని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు అనసూయ సోషల్ మీడియాని ఎంచుకుంది. ఇంస్టాగ్రామ్ లో అనసూయ ఇచ్చే ఫోజులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక రంగస్థలం, పుష్ప, క్షణం లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పెదకాపు చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. పుష్ప చిత్రంలో దాక్షాయణి గా అనసూయ డీ గ్లామర్ రోల్ లో మెప్పించింది. పుష్ప మొదటి భాగం ఆమె పాత్రకి శాంపిల్ మాత్రమే. అనసూయ అసలైన విశ్వరూపం పుష్ప పార్ట్ 2లో ఉండబోతోంది.
అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. అనసూయ చీర కడితే అచ్చతెలుగు వనితలాగా మెరుపులు మెరవాల్సిందే. మోడ్రన్ డ్రెస్సుల్లో సైతం ఉడికించడం అనసూయకి అలవాటే. అయితే సెలెబ్రిటీలు అందంగా కనిపించడంలో వాళ్ళ మేకప్ ఆర్టిస్టుల శ్రమ ఎంతైనా ఉంటుంది. మేకప్ ఆర్టిస్టులకి సైతం క్రెడిట్ ఇచ్చే సెలెబ్రిటీలు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో అనసూయ ఒకరు అని చెప్పొచ్చు.
తాజాగా అనసూయ తన మేకప్ ఆర్టిస్ట్ ని ప్రశంసలతో ముంచెత్తుతూ పోస్ట్ చేసింది. తాను ఇంత అందంగా కనిపించడం వెనుక మేకప్ ఆర్టిస్ట్ ప్రతిభ ఉందని పేర్కొంది. తాను మేకప్ లేకుండా.. మేకప్ వేసుకుని ఉన్న దృశ్యాలని పోస్ట్ చేసింది. ఎంత తేడా ముందో మీరే గమనించవచ్చు.
అనసూయ పోస్ట్ చేస్తూ.. నా మేకప్ ఆర్టిస్ట్ శివ గారి ప్రతిభని ప్రశంసించకుండా ఉండలేకున్నా. గత కొన్నేళ్లుగా నా వెనుక బలంగా నిలబడినందుకు కృతజ్ఞతలు. మా మధ్య సింక్ చాలా బాగా కుదిరింది. నేను ఏం కావాలో ఎలాంటి మేకప్ కావాలో అడగను. నా టీం కి అర్థం అయిపోతుంది. మీ మేకప్ నైపుణ్యం నన్ను కాన్ఫిడెన్స్ గా ఉంచింది అంటూ అనసూయ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
తన మేకప్ ఆర్టిస్ట్ కి కూడా అనసూయ ఇంత ప్రాధాన్యత ఇస్తుండడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మేకప్ ఉన్నా లేకున్నా మీరు చాలా అందంగా ఉంటారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.