- Home
- Entertainment
- టీడీపీ అభిమానుల్లో మంటలు రగిల్చిన కళ్యాణ్ రామ్.. ఎవరికి మద్దతు అనేది ఎన్టీఆర్ తో చర్చించాకే నిర్ణయం
టీడీపీ అభిమానుల్లో మంటలు రగిల్చిన కళ్యాణ్ రామ్.. ఎవరికి మద్దతు అనేది ఎన్టీఆర్ తో చర్చించాకే నిర్ణయం
మరో రెండు రోజుల్లో డెవిల్ రిలీజ్ ఉండగా కళ్యాణ్ రామ్ తాజాగా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మంటలు రేపే విధంగా ఉన్నాయి.

నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి లేటెస్ట్ గా వస్తున్న చిత్రం డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది క్యాప్షన్. అభిషేక్ నామా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంయుక్త మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. బింబిసార తర్వాత ఇది కళ్యాణ్ రామ్ తో ఆమెకి రెండో చిత్రం. బింబిసార లాంటి రీసౌండింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ జోరు పెంచారు.
బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నారు. ఆ క్రమంలో చివరగా విడుదలైన అమిగోస్ చిత్రం షాకిచ్చింది. అంచనాలు అందుకోలేక బోల్తా కొట్టింది. ఈసారి నందమూరి హీరో బాక్సాఫీస్ ని బలంగా కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. డిసెంబర్ 29న ఇయర్ ఎండ్ లో డెవిల్ అడుగుపెడుతున్నాడు.
మరో రెండు రోజుల్లో డెవిల్ రిలీజ్ ఉండగా కళ్యాణ్ రామ్ తాజాగా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మంటలు రేపే విధంగా ఉన్నాయి. ఇప్పటికే జూ.ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలీకి కాస్త గ్యాప్ ఉందనే ప్రచారం ఉంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు తారక్ స్పందించిన తీరుపై ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే.
అయితే ఫ్యామిలిలో, టిడిపి పార్టీలో తారక్ కి ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆగ్రహం యంగ్ టైగర్ ఫ్యాన్స్ లో ఉంది. ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా తారక్ స్పందించలేదు. ఈ క్రమంలో రూమర్స్ పెరుగుతూ వచ్చాయి. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు ఆ రూమర్స్ ని మరింత పెంచేలా చేశాయి. నందమూరి ఫ్యామిలిలో ఎవరైనా రాజకీయయంగా మద్దతు ఎవరికి అంటే వెంటనే టిడిపికే అంటారు..
కానీ కళ్యాణ్ రామ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు నందమూరి ఫ్యాన్స్ లో, టిడిపిలో వివాదంగా మారేలా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ట్రోలింగ్ మొదలైంది. 2024 ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి అని యాంకర్ ప్రశ్నించినప్పుడు.. కళ్యాణ్ రామ్ దీర్ఘంగా కాసేపు అలోచించి ఇక ఫ్యామిలీగా నేను, ఎన్టీఆర్ కలసి నిర్ణయం తీసుకుంటాం అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమా వేరు రాజకీయం వేరు. కాబట్టి ఫ్యామిలీతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం.
మా ఫ్యామిలిలో నేను, తారక్ కలసి నిర్ణయం తీసుకోవాలి అని కళ్యాణ్ రామ్ తెలిపాడు. ఈ వ్యాఖ్యలే వివాదంగా మారేలా కనిపిస్తున్నాయి. టిడిపి అభిమానులు కళ్యాణ్ రామ్ వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఉన్నారు. ఏఈ తరుణంలో డెవిల్ మూవీపై ఎలాంటి ప్రభావం అయినా ఉంటుందా అనేది కూడా చర్చగా మారింది. తారక్, కళ్యాణ్ రామ్ ఫాన్స్ మాత్రం ఎప్పుడూ వారికి మద్దతుగా ఉంటారు.
కళ్యాణ్ రామ్ ఇచ్చిన తాజా స్టేట్మెంట్ టిడిపి పార్టీకి తాము దూరం అనే సంకేతాలు పంపుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఆ తర్వాత తారక్, కళ్యాణ్ రామ్ టిడిపి కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు.