- Home
- Entertainment
- Anasuya: స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ వాడుకోవాలని ట్రై చేశారు..అసలైన క్యారెక్టర్ బయట పడింది, దటీజ్ అనసూయ
Anasuya: స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ వాడుకోవాలని ట్రై చేశారు..అసలైన క్యారెక్టర్ బయట పడింది, దటీజ్ అనసూయ
Anasuya comments on Casting couch: క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం పూర్తిగా నటిగా మారిపోయింది. నటిగా అనసూయకి టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది.

Anasuya Bharadwaj
Anasuya comments on Casting couch: క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం పూర్తిగా నటిగా మారిపోయింది. నటిగా అనసూయకి టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. అందుకు కారణం ఆమె ఎంచుకున్న చిత్రాలే. క్షణం, రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పుష్ప 2లో నటించింది.
లేటెస్ట్ ఇంటర్వ్యూలో అనసూయ మరోసారి బోల్డ్ గా తన మనసులో అభిప్రాయాలు, కెరీర్ లో ఎదురైన సవాళ్ల గురించి తెలిపింది. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమె డైరెక్ట్ గా చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఇండస్ట్రీకి ఎన్నో కలలతో వచ్చే అమ్మాయిలు ఎలా వ్యవహరించాలి అనే విషయంలో అనసూయ సలహా ఇచ్చారు. ఈ క్రమంలో తనకి ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ సంఘటనని బయట పెట్టారు.
Anasuya Bharadwaj
టాలీవుడ్ లో అమ్మాయిలని వాడుకోవడానికి దర్శక నిర్మాతలు, నటులు చాలా విధాలుగా ప్రయత్నిస్తారు. నన్ను ఒక స్టార్ హీరో అడిగారు. అయితే నేను ఒప్పుకోలేదు. అదే విధంగా స్టార్ డైరెక్టర్ కూడా ఛాన్స్ పేరుతో నన్ను వాడుకోవడానికి ప్రత్నించాడు. నేను సున్నితంగా తిరస్కరించాను. ఈ రెండు సంఘటనల వాళ్ళ చాలా ఆఫర్స్ కోల్పోవలసి వచ్చింది.
Anasuya
అమ్మాయిలకు నో చెప్పడం మాత్రమే కాదు దానివల్ల ఎదురయ్యే సమస్యలని ఎదుర్కొనే ధైర్యం కూడా ఉండాలి అని అనసూయ అన్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి ప్రపోజల్స్ చాలా వచ్చాయి. కాని వారు కోరుకునేది ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ట్యాలెంట్ ని చూసి అవకాశం ఇవ్వాలని నేను భావిస్తాను అని అనసూయ తెలిపింది. మనం అడిగిన దానికి ఆమె ఒప్పుకోలేదు, అయినా పర్వాలేదు క్యారెక్టర్ బాగా చేస్తుంది కదా అవకాశం ఇవ్వాలి అని వాళ్ళకే అనిపించాలి అని అనసూయ పేర్కొంది.
ఛాన్స్ ల కోసం సులభమైన పద్దతిని కొంతమంది అమ్మాయిలు ఎంచుకుంటుంటారు. పది మంది అమ్మాయిలు అదే మార్గంలో వెళుతున్నారు కదా అని అది కరెక్ట్ అయిపోదు. వాళ్ళు చేస్తున్నారు కదా అని నువ్వు కూడా తప్పు చేయడం సరైంది కాదు. కష్టాన్ని, ట్యాలెంట్ ని మాత్రమే నమ్ముకోవాలని అనసూయ ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు సూచించారు. అనసూయ కామెంట్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అసలైన క్యారెక్టర్ ఇది అని ప్రశంసలు కురిపిస్తున్నారు.