స్లీవ్‌లెస్ టైట్ ఫిట్‌లో కట్టిపడేస్తున్న అనసూయ పోజులు.. ఆ ఫోటోపై ఇంత రచ్చేంటి?
`జబర్దస్త్` యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఇప్పుడు మరోసారి హాట్ డిస్కషన్‌గా మారింది. ఆమె పంచుకున్న ఫోటో చర్చనీయాంశం అవుతుంది. అదే సమయంలో తన నయా గ్లామర్ ఫోటోలతో కనువిందు చేస్తుంది.
హాట్ యాంకర్ అనసూయ(Anasuya) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. పార్టీ వేర్‌లో హోయలు పోయింది. స్లీవ్‌లెస్ టైట్ ఫిట్‌లో కనువిందు చేసింది యాంకర్ అనసూయ. ఆమె లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.
అనసూయ.. సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) సినిమా ఈవెంట్‌లో మెరిసింది. సుధీర్ `గాలోడు`(Gaalodu) చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం సాయంత్రం జరిగింది. ఇందులో సుధీర్‌కి విషెస్ చెప్పేందుకు గెస్ట్ గా హాజరైంది. పార్టీ వేర్‌లో కనువిందు చేసింది.
అయితే ఇందులో ఆమె సైడ్‌గా ఇచ్చిన పోజులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. సైడ్ పోజ్‌లో అనసూయ యమ హాట్‌గా ఉందని, ఆమె డ్రెస్‌పై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ప్రత్యేకంగా ఆ ఫోటోని షేర్ చేస్తూ రచ్చ లేపుతున్నారు. ఆ ఫోటోలో ఆమె అందాలను వర్ణిస్తూ రెచ్చిపోతున్నారు. దీంతో అనసూయ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది.
ఇది వరకే తన డ్రెస్‌పై కామెంట్లు చేసిన నెటిజన్లని ఓ రేంజ్‌లో ఆడుకుంది అనసూయ. ఆ మధ్య తనని ఆంటి అని పిలిచినందుకు గట్టిగానే ఏసుకుంది. తనని అల పిలవద్దని, తాను కత్తిలాగా ఉంటానని స్వయంగా అనసూయనే చెప్పుకొచ్చింది. చూడబోతుంటే ఇప్పుడు మరోసారి ఆమె హాట్ టాపిక్‌గా నిలవబోతుందని, ఇంటర్నెట్‌కి మంచి కంటెంట్ ఇచ్చిందని తెలుస్తుంది.
ఇక `గాలోడు` ఈవెంట్‌లో పాల్గొన్న అనసూయ.. సుధీర్‌పై ప్రశంసలు కురిపించింది. మామూలు కమెడియన్ గా ఉన్న సుధీర్ ఇప్పుడు హీరో రేంజ్‌కి ఎదిగాడని, టాలెంట్ ఎక్కడ ఉన్నా దాగదని, అది ఓ వెలుతురులా దూసుకొస్తుందని తెలిపింది. ఈ చిత్రం నేడు విడుదలై పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే.
మరోవైపు అనసూయ ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగాఉంది. `జబర్దస్త్` నుంచి ఆమె బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఆ షోపై కొన్ని విమర్శలు చేస్తూ ఆమె బయటకొచ్చింది. స్టార్ మాలో `సూపర్ సింగర్ జూనియర్` కి సుధీర్‌తో కలసి హోస్ట్ గా చేసింది. ఇప్పుడు అది పూర్తి కావడంతో ఆమె చేతిలో ఒక్క షో కూడా లేదు.
దీంతో పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం అనసూయ చేతిలో `రంగమార్తాండ`, `పుష్ప2`, `సింబా` వంటి చిత్రాలున్నాయి. వీటితోపాటు అనౌన్స్ చేయని మరికొన్ని సినిమాలతో అనసూయ ఫుల్ బిజీగానే ఉంది.
ఇదిలా ఉంటే ఇంటర్నెట్ అభిమానులు అనసూయ విషయంలో చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. ఆమె `జబర్దస్త్` చేస్తున్న సమయంలో ప్రతి వారం గ్లామర్ ఫోటోలను పంచుకుని వారిని ఆకట్టుకునేది. సోషల్ మీడియాని షేక్ చేసేది. కానీ ఇప్పుడు ఆ ఫోటోలు లేవు, ఆ సందడి లేదు. దీంతో నిరాశ చెందుతున్నారు. అడపాదడపా వచ్చే ఈ ఫోటోలతో సర్దుకుంటున్నారు. మరి ఇంటర్నెట్ ఫ్యాన్స్ బాధని అనసూయ అర్థం చేసుకుని ఫోటో షూట్లు చేస్తుందా? లేక తనపై విమర్శలకు నెలవుగా మారుతున్న నేపథ్యంలో లైట్ తీసుకుంటుందా? అనేది చూడాలి.