- Home
- Entertainment
- విజయ్ దేవకొండలో ఆ క్వాలిటీకి అనన్య పాండే పడిపోయిందట, అమెరికా టూర్ స్పెషల్ అంటున్న బ్యూటీ
విజయ్ దేవకొండలో ఆ క్వాలిటీకి అనన్య పాండే పడిపోయిందట, అమెరికా టూర్ స్పెషల్ అంటున్న బ్యూటీ
రౌడీ హీరో విజయ్ దేవకొండను పొగడ్తలతో ముంచెత్తి... ఆకాశానికి ఎత్తింది బాలీవుడ్ భామ అనన్య పాండే. విజయ్ లో ఆ క్యాలిటీకి ఆమె పడిపోయిందట. అమెరికాలో విజయ్ తో కలిసి తెగ ఎంజాయ్ చేశానంటోంది బీటౌన్ బ్యూటీ.

విజయ్ దేవరకొండలోని ఒక విషయం తనను బాగా ఆకర్షించిందంటోంది లైగర్ భామ అనన్య పాండే. విజయ్ దేవరకోండతో తొలిసారి జత కట్టిన అనన్య... విజయ్ తో చాలా అద్భుతమైన మూమెంట్స్ ను ఎంజాయ్ చేశానంటోంది. యంగ్ హీరోని గట్టిగానే పొగిడేస్తుంది.
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో పవర్ ప్యాక్ మూవీ లైగర్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. పూరీతో తో తొలిసారి జట్టు కట్టాడు రౌడీ హీరో. ఈమూవీలో విజయ్ జోడీగా బాలీవుడ్ భామ అనన్య పాండే జత కట్టింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నాడు. మొత్తంగా లైగర్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా త్వరలోనే మన ముందుకు రాబోతోంది.
లైగర్ సినిమా గురించి హీరోయిన్ అనన్య పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రీసెంట్ గా ఓమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడిచింది. అంతే కాదు సినిమాకు సంబంధించిన చాలా విషయాలు మీడియాతో పంచుకుంది అనన్య పాండే.
విజయ్ ది ఎంతో దయాగుణమని అంటోంది బ్యూటీ. విజయ్ అద్భుతమైన వ్యక్తి అని చెప్పింది. అమెరికాలో షూటింగ్ సమయంలో సరదాగా గడిపామని గుర్తు చేసుకుంది. విజయ్ తో వర్క్ చేయడం సెట్ లో అంతా ఉల్లాసంగా ఉంటుందంటోంది అనన్య. అతనిలో అంత మంచి విషయాలు ఉండబట్టే షూటింగ్ ఏ ఇబ్బంది లేకుండా సాగిందంటోంది అనన్య.
ఇక సినిమాకు సంబంధించి దాదాపు అన్నీ పనులు పూర్తయ్యాయని చెప్పింది అనన్య.. తన డబ్బింగ్ పార్ట్ కూడా అయిపోయిందని చెప్పింది. ఆగస్టులో సినిమా విడుదలవుతుందని, మాంచి మసాలా సినిమా అని చెప్పుకొచ్చింది. సినిమాను చూసి ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోయిన్.
ఇక అన్ని పనులు పూర్తి చేసుకున్ని లైగర్ సినిమాను ఆగస్టు 25న విడుదల చేసేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అంతే కాదు ఇటు అనన్య పాండే కూడా లైగర్ సినిమాతో తెలుగులోకి అరంగేట్రంచేస్తోంది.