- Home
- Entertainment
- Ananya Nagalla: డాక్టర్ అయిన `వకీల్‌సాబ్` బ్యూటీ.. ఎలా ముసిముసినవ్వులు నవ్వుతుందో చూడండి..
Ananya Nagalla: డాక్టర్ అయిన `వకీల్‌సాబ్` బ్యూటీ.. ఎలా ముసిముసినవ్వులు నవ్వుతుందో చూడండి..
`వకీల్‌సాబ్` బ్యూటీ అనన్య నాగళ్ల నిత్యం గ్లామర్ ఫోటోలతో అలరిస్తుంది. కట్టిపడేసే అందాలతో, పర్‌ఫెక్ట్ కొలతలతో ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్‌నిస్తుంది. కానీ ఇప్పుడు సర్‌ప్రైజ్ చేసింది. సడెన్‌గా తానేంటో చూపించింది.

`మల్లేశం` చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అనన్య నాగళ్ల(Ananya Nagalla). సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నుంచి నటిగా మారినట్టు అప్పుడు వెల్లడించారు. యాక్టింగ్‌పై ఇష్టంతో, జాబ్‌ని వదులుకుని ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్టు సమాచారం. తొలి సినిమా మంచి పేరు రావడంతో సినిమాల్లోనూ కంటిన్యూ అవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు డాక్టర్‌గా మారి షాకిస్తుంది. అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తుంది.
అనన్య నాగళ్ల చైర్ లో కూర్చొని మెడలో స్టెతస్కోప్ ధరించి, ఫోన్ చూస్తూ కనిపించింది. మరో ఫోటోలు మిర్రర్ షేడ్‌లో ముసిముసినవ్వులు నవ్వుతూ కనిపించింది. ఈ రెండు పిక్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఇందులో ఆమె పెట్టిన పోస్ట్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. తనపైనే తాను పంచ్ వేసుకున్నట్టుగా ఉంది.
`పాప సర్ అబ్బబ్బ జస్ట్ అలా కూర్చుంది అంతే` అంటూ నవ్వుతున్న ఎమోజీని పంచుకుంది అనన్య. `చిరుత` చిత్రంలో హీరోయిన్‌ని ధర్మవరపు సుబ్రమణ్యం పొగిడినట్టు, ఇందులో తనపై తాను పంచ్‌లేసుకోవడం హైలైట్‌గా నిలిచింది. దీంతో నెటిజన్లు మరింత రెచ్చిపోతున్నారు, మీపై మీరే మీమ్స్ ఏసుకుంటే మేమేం చేయాలంటున్నారు. మరికొందరు ఇంకాస్త రెచ్చిపోయి పాప సార్ కేక అంటూ కామెంట్లు చేస్తున్నారు.
`పర్‌ఫెక్ట్ ఫిగర్`, `పిచ్చెక్కించే చుట్టుకొలతలు మీ సొంతం` అంటూ కామెంట్ చేస్తున్నారు. లేటెస్ట్ అనన్య నాగళ్ల ఫోటోలను పంచుకుంటూ ట్రెండ్ చేస్తున్నారు. మొత్తంగా ఈ `వకీల్‌సాబ్` బ్యూటీ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. తెగ ఆకట్టుకుంటుంది.
అయితే అనన్య డాక్టర్ లుక్‌లో కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఆమె డాక్టర్ కావడమేంటంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదైనా సినిమాలో ఇలా డాక్టర్‌గా నటిస్తుందా? లేక డాక్టర్ పట్టా పొందిందా? అంటూ ప్రశ్నలు సందిస్తున్నారు. ఏదేమైనా అనన్య నాగళ్ల మాత్రం నెటిజన్లుకి కొత్త పరీక్ష పెట్టిందని చెప్పొచ్చు.
ఖమ్మం జిల్లాకి చెందిన అనన్య నాగళ్ల ఇబ్రహింపట్నంలోని రాజమహేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బీటెక్ పూర్తి చేసింది.ఆ తర్వాత ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా జబ్ చేసింది. అట్నుంచి చిత్ర పరిశ్రమలోకి `మల్లేశం` చిత్రంతో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తొలి చిత్రంలో ఎన్నోసెంట్ అమ్మాయిగా, స్ట్రగులింగ్ ఇల్లాలుగా నటించి మెప్పించింది.
పవన్ కళ్యాణ్‌తో `వకీల్‌సాబ్` చిత్రంలోనూ తెలంగాణ అమ్మాయిగా, ఇన్నోసెంట్ లుక్‌లో మెప్పించింది. దీంతోపాటు `ప్లేబ్యాక్`, `మ్యాస్ట్రో` చిత్రాల్లో మెరిసింది. ప్రశంసలందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ `శాకుంతలం` సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది విడుదలకు రెడీ అవుతుంది. అయితే డాక్టర్ లుక్‌లో కనిపించింది ఏ సినిమాలో అనేది తెలియాల్సి ఉంది. లేదా? సరదాగా అలా స్టెథస్కోప్ వేసుకుని దిగిందా అనేది తెలియాల్సి ఉంది.