- Home
- Entertainment
- Ananya Nagalla Holi Pics: హోళీలో `వకీల్ సాబ్` భామ రచ్చ.. కలర్‌ఫుల్ అందాలతో కేక పెట్టిస్తుందిగా!
Ananya Nagalla Holi Pics: హోళీలో `వకీల్ సాబ్` భామ రచ్చ.. కలర్‌ఫుల్ అందాలతో కేక పెట్టిస్తుందిగా!
కత్తిలాంటి ఫోటోలను పంచుకుంటూ ఇంటర్నెట్‌లో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్న `వకీల్‌సాబ్` బ్యూటీ అనన్య నాగళ్ల హోళీ పండుగని ఎంజాయ్ చేస్తుంది. కలర్ ఫుల్ అందాలతో రచ్చ చేస్తుంది. వైరల్‌గా మారింది.

తెలంగాణ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) చేస్తున్నరచ్చ అంతా ఇంతా కాదు. ముంబయి ఇంపోర్టెడ్ హీరోయిన్లు కూడా ఆ రేంజ్‌లో హాట్ షో చేయరేమో. బౌండరీలు బ్రేక్ చేస్తూ ఈ బ్యూటీ దిగే ఫోటో షూట్ పిక్స్ నెటిజన్లని కనువిందు చేస్తుంటాయి. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంటాయి. అయితే హోళీ పండుగ సందర్బంగా తెగ ఎంజాయ్ చేసిందీ అందాల సోయగం.
`వకీల్‌సాబ్` బ్యూటీగా ఇటీవల హల్‌చల్ చేస్తున్న అనన్య నాగళ్ల హోలీ పండుగని సెలబ్రేట్ చేసుకుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి ఆమె రంగులద్దుకుంది. కలర్‌ఫుల్ రంగులు తన వైట్ డ్రెస్‌పై పడగా అనన్య అందాల మరింత కలర్‌ఫుల్‌గా మారిపోయాయి. అదే సమయంలో క్యూట్ అందాలు మరింత హాట్‌గా మారాయి.
ప్రస్తుతం ఈ పిక్స్ ని పంచుకుంటూ అనన్య నాగళ్ల తన అభిమానులకు, ఫాలోవర్స్ కి హోళీ శుభాకాంక్షలు తెలిపింది. దీంతో నెటిజన్లు సైతం ఆమెకి విషెస్ తెలియజేస్తున్నారు. పలువురు నెటిజన్లు హాట్ కామెంట్లు చేస్తున్నారు. కలర్‌ఫుల్ బ్యూటీ, అనన్య కలర్‌ఫుల్ అందాలు అని, క్యూట్‌నెస్ కాస్త హాట్‌నెస్‌గా మారిందని, ఫైరింగ్ ఎమోజీలను పంచుకుంటున్నారు. మరికొందరు లవ్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.
మొత్తంగా అనన్య నాగళ్ల హోళీ పండుగ సందర్భంగా ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. తెగ ఆకట్టుకుంటుంది. ఆమె అభిమానులు ఈ బ్యూటీ ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తుండటం విశేషం. రచ్చ మొత్తం అనన్యదే అనేట్టుగా ఈ పిక్స్ సందడి చేస్తున్నాయి.
`మల్లేశం` సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయ్యింది అనన్య నాగళ్ల. ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా చాలా సెటిల్డ్ నటనని కనబరించింది. సాఫ్ట్ వేర్ గా పనిచేసిన అనన్య సినిమాలపై ఆసక్తితో ఈ రంగంపై దృష్టిపెట్టింది. `మల్లేశం`లో అవకాశం రావడంతో పూర్తిస్థాయి నటిగా మారిపోయింది. తొలి చిత్రంతోనే విశేష ఆదరణ పొందింది.
ఆ తర్వాత `ప్లే బ్యాక్` ఓటీటీ సినిమాలో మెరిసింది. ఈ క్రమంలో ఆమెకి `వకీల్‌సాబ్` సినిమాలో ముగ్గురు అమ్మాయిల్లో ఒకరి పాత్రని పోషించింది. ఇందులో తెలంగాణ అమ్మాయిగా, తెలంగాణ యాసతో అలరించింది. ఇన్నోసెంట్ యాక్టింగ్‌తో మంచి మార్కులు వేసుకుంది.
ఆ తర్వాత నితిన్ నటించిన `మ్యాస్ట్రో` సినిమాలో చిన్న రోల్ చేసింది. ఈ పాత్ర కూడా ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది. కానీ హీరోయిన్‌గా అవకాశాలు రాకపోవడం విచారకరం. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ తరహా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలే అనన్యని వరిస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు సమంత నటిస్తున్న `శాకుంతలం`లోనూ కీరోల్ ప్లే చేస్తుంది అనన్య.ఈ సినిమాతోనైనా ఆమెకి మంచి గుర్తింపు, పేరు, అవకాశాలు వస్తాయేమో చూడాలి.
అయితే అవకాశాల విషయంలో తాను అన్నింటికి సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుంది అనన్య. హాట్ ఫోటో షూట్లతో రెచ్చపోయింది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. మేకర్స్ కి హింట్ ఇస్తుంది. మరి ఈ బ్యూటీ ప్రయత్నాలను మేకర్స్ కన్సిడర్ చేస్తారా? అవకాశాలిస్తారేమో చూడాలి. Ananya Nagalla Hot Photos.