MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Entertainment
  • Epic Movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి రొమాన్స్ తో పెరిగిపోయిన అంచనాలు.. 'ఎపిక్' రిలీజ్ డేట్ ఇదేనా ?

Epic Movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి రొమాన్స్ తో పెరిగిపోయిన అంచనాలు.. 'ఎపిక్' రిలీజ్ డేట్ ఇదేనా ?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న 'ఎపిక్' జూలై 24న విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే విడుదల తేదీపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 22 2026, 08:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Anand Deverakonda
Image Credit : Asianet News

Anand Deverakonda

‘బేబీ’ సినిమాతో యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్’ విడుదల తేదీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టీజర్ లో రొమాన్స్
Image Credit : Asianet News

టీజర్ లో రొమాన్స్

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘సంచారమే’ మంచి ఆదరణ పొందగా,  టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. టీజర్‌లో కనిపించిన విజువల్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్, సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. టీజర్ లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి మధ్య రొమాన్స్ బాగా హైలైట్ అయింది. ముఖ్యంగా ‘బేబీ’ తర్వాత ఆనంద్–వైష్ణవి జోడీ మళ్లీ తెరపై కనిపించనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. 

Related Articles

Related image1
Samantha: కామెడీ షో హిట్ కానీ మూవీ ఫ్లాప్..సమంతతో ఆ సినిమా చేస్తే నీ కెరీర్ నాశనం అన్నారు
Related image2
VishnuPriya: కష్టం లేకుండా నెలకు రూ.20 లక్షలు సంపాదిస్తున్న యాంకర్.. సుమ, శ్రీముఖి లకు కూడా సాధ్యం కాదు
35
లండన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం
Image Credit : Asianet News

లండన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం

లండన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆధునిక ప్రేమకథగా రూపొందుతోంది. ప్రేమ, సంబంధాలు, యువత ఆలోచనా విధానం వంటి అంశాలను కొత్త కోణంలో చూపించనున్నట్లు టీజర్ సూచించింది. ఇందులో ఆనంద్ దేవరకొండ ఇంట్రోవర్ట్ యువకుడిగా కనిపించగా, వైష్ణవి చైతన్య ఉత్సాహభరితమైన ఎక్స్‌ట్రోవర్ట్ పాత్రలో సందడి చేయనుంది.

45
ఆదిత్య హాసన్ దర్శకత్వం
Image Credit : Asianet News

ఆదిత్య హాసన్ దర్శకత్వం

ఈ చిత్రానికి ‘90’s – A Middle Class Biopic’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందిన ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత దర్శకుడు హిషామ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ‘సంచారమే’ పాట ఇప్పటికే సంగీత ప్రియుల ప్లేలిస్టుల్లో చోటు దక్కించుకుంది. టీజర్‌కు కూడా మంచి స్పందన రావడంతో సినిమాపై పాజిటివ్ బజ్ కొనసాగుతోంది.

55
నిర్మాతలు, ఇతర టీమ్ వివరాలు
Image Credit : others

నిర్మాతలు, ఇతర టీమ్ వివరాలు

సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. అజీమ్ మహ్మద్ సినిమాటోగ్రఫీ అందించగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ‘EPIC’కు సంబంధించిన తదుపరి అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Korean Kanakaraju 13 Days Collections: చతికిల పడ్డ కొరియన్‌ కనకరాజు.. వరుణ్‌ తేజ్‌ మూవీ టోటల్‌ ఎంత చేసిందంటే?
Recommended image2
Dil Raju: మహేష్, రాంచరణ్, బన్నీ రిజెక్ట్ చేసిన కథతో సూపర్ హిట్ కొట్టిన హీరో.. వాళ్ళు చేసుంటే సినిమా షెడ్డుకే
Recommended image3
Sowcar Janaki: ఐసీయూలో షావుకారు జానకి.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Samantha: కామెడీ షో హిట్ కానీ మూవీ ఫ్లాప్..సమంతతో ఆ సినిమా చేస్తే నీ కెరీర్ నాశనం అన్నారు
Recommended image2
VishnuPriya: కష్టం లేకుండా నెలకు రూ.20 లక్షలు సంపాదిస్తున్న యాంకర్.. సుమ, శ్రీముఖి లకు కూడా సాధ్యం కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved