MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కార్తీక్ చెంప పగలగొట్టిన ఆనంద్ రావు.. అసలు నిజం తెలియటంతో ఒంటరైన దీప?

కార్తీక్ చెంప పగలగొట్టిన ఆనంద్ రావు.. అసలు నిజం తెలియటంతో ఒంటరైన దీప?

బుల్లితెర ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగుతున్న ఈ సీరియల్లో ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 30 2021, 09:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

దీప (Deepa) ఒంటరిగా ఆలోచిస్తుండగా కార్తీక్ వచ్చి మాట్లాడుతాడు. దీప అమెరికా ప్రయాణం గురించి మోనిత గురించి ప్రశ్నించడంతో కార్తీక్ (Karthik) మోనిత పేరు విని బాగా కోపపడతాడు. ఎక్కడికి వెళ్లిన అదే పేరు తలచుకుంటున్నారు అని కాస్త ఎమోషనల్ అవుతాడు. తన గురించి కాకుండా మన జీవితం గురించి ఆలోచించాలని చెబుతాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఉదయం ఆనంద రావు, సౌందర్య ( Anand Rao, Soundarya) వాకింగ్ అని బయటికి వెళ్తుండగా కార్తీక్ ఎదురు రావడంతో ఆనందరావు కార్తీక్ ను పిలిచి గట్టిగా చెంప పగలగొడతాడు. ఎందుకిలా చేశావు అంటూ కార్తీక్ చొక్కా పట్టుకొని కోపంతో ప్రశ్నిస్తూ ఉంటాడు. సౌందర్య చెప్పినా కూడా కార్తీక్ ను వదలడు. కార్తీక్ (Karthik) బాధతో  ఏమీ అనలేకపోతాడు.
 

38

అదే సమయంలో దీప (Deepa) రావటంతో ఆనందరావు కార్తీక్ ను నిమురుతున్నట్టు చేస్తాడు. దీప వచ్చి ఏమైందని అడగటంతో కార్తీక్ (Karthik) చెంపమీద ఒక మచ్చ ఉందని మోనితను ఉద్దేశించి చెబుతాడు. దీపకు మాటలు అర్థం కాకుండా ఉంటాయి. వెంటనే కాఫీ తీసుకురావాలా అని అడగటంతో కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది.
 

48

ఆనంద రావు (Anand rao) ఇక కార్తీక్ ను ఇలా ఎందుకు చేశావంటూ దీపకి ఎలా అన్యాయం చేయాలనిపిస్తుందని ప్రశ్నిస్తాడు. ఒక అనుమానం తోనే దీపను (Deepa) ఎన్నో ఏళ్ళు దూరం పెట్టి బాధ పెట్టావు అని మళ్లీ ఈ నీచమైన పనితో దీపను ఇంకెంత బాధ పెట్టాలని చూస్తున్నావు అని గట్టిగా వాదించి అక్కడి నుండి వెళ్ళి పోతాడు.
 

58

దీప (Deepa) కాఫీ తీసుకుని రావడంతో ఆనందరావు, సౌందర్య లేకపోయేసరికి ఆశ్చర్యపోతుంది. కార్తీక్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుండగా కార్తీక్ (Karthik) మాటలు కూడా తనకు కొత్తగా అనిపిస్తుంది. వెంటనే దీప తన మనసులో ఏదో జరుగుతుందని ఎలాగైనా తెలుసుకోవాలి అని ల్యాబ్ కు వెళ్లొచ్చాక తెలుసుకుంటాను అని అనుకుంటుంది.
 

68

మరోవైపు హాస్పిటల్ లో మోనిత (Monitha) దగ్గరికి భారతీ వచ్చి తినమని సలహాలు ఇస్తుంది. మోనిత మాత్రం కార్తీక్ తనను ఇంట్లోకి రానిస్తాడా లేదా అని లేదంటే పరిస్థితి ఏంటి అని భారతి (Bharathi) తో మాట్లాడుతుంది. ఇక భారతి కూడా ఫ్రెండ్ అని నీ కోసం ఎన్నో చేశాను అంటూ సాటి ఆడదానిగా మాత్రం తప్పు చేశాను అని బాధపడుతుంది.
 

78

మోనిత (Monitha) మళ్లీ ధైర్యం తెచ్చుకొని గట్టిగా మాట్లాడుతుంది. సహజ గర్భం అని తెలిస్తే దీప దూరంగా వెళ్లి పోతుందని అంటుంది. ఇక ఇంట్లో పిల్లలు దీప కోసం వెతకడం తో అమ్మ కనిపించటం లేదని సౌందర్య, కార్తీక్ తో చెబుతారు. వెంటనే దీప (Deepa) ఎక్కడికి వెళ్ళింది అని టెన్షన్ పడుతుంటారు.
 

88

దీప (Deepa) వారణాసి (Varanasi) కారులో ల్యాబ్ దగ్గరికి వెళ్లి అక్కడ మరో ల్యాబ్ టెక్నీషియన్ ను కలుస్తుంది. తరువాయి భాగంలో ఎటువంటి శాంపిల్స్ బయటికి వెళ్ళలేదు అని ఆ ల్యాబ్  టెక్నీషియన్ గట్టిగా చెప్పటంతో దీప మరో మాట మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి బయటకు వెళుతుంది. కారు కూడా ఎక్కకుండా ఒంటరి ప్రయాణం మొదలుపెడుతుంది.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Alia Bhatt: ఫోన్‌లో రణ్‌బీర్ పేరును ఆలియా భట్ ఎలా సేవ్ చేసుకుందో తెలుసా? టాప్ సీక్రెట్
Recommended image2
Lenin OTT: ఓటీటీలోకి అఖిల్ 100 కోట్ల బ్లాక్‌బస్టర్, లెనిన్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులోనో తెలుసా?
Recommended image3
Mahesh Babu: అన్న కొడుకును పట్టించుకోరా? చిరంజీవితో పోల్చుతూ.. మహేష్ బాబుపై ట్రోలింగ్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved