MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • విజయ్ దేవరకొండ ని తలచుకుని ఎమోషనల్ పోస్ట్ పెట్టిన ఆనంద్ దేవరకొండ, విషయం ఏంటంటే?

విజయ్ దేవరకొండ ని తలచుకుని ఎమోషనల్ పోస్ట్ పెట్టిన ఆనంద్ దేవరకొండ, విషయం ఏంటంటే?

అన్న విజయ్ దేవరకొండను తలుచుకుని తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఓ ఎమోషనల్ పోస్ట్ ఒకటి పెట్టారు. ఇంతకీ ఆనంద్ షేర్ చేసిన పోస్ట్ లో ఏముంది? ఎందుకు ఎమోషనల్ అయ్యాడు? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 19 2025, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : our own

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ సినిమా ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి 'అన్న అంటేనే..' అనే పాటను విడుదల చేశారు. అన్నాదమ్ముల అనుబంధం నేపథ్యంగా సాగే ఈ పాట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ పాట వినగానే తను ఎమోషనల్ అయ్యానని తాజా ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో ఆనంద్ దేవరకొండ పేర్కొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image Credit : ANI

'నేను ఏదైనా సాధించగలను అని నాకన్నా ఎక్కువగా నమ్మి అండగా నిలబడే వ్యక్తి మా బ్రదర్. అన్నాదమ్ముల మధ్య ఉండే అనుబంధాలను గుర్తుచేసేలా ఈ పాట ఉంది..' అని తన పోస్ట్ లో పేర్కొన్నారు ఆనంద్ దేవరకొండ. తన అన్న విజయ్ తో తీసుకున్న చిన్నప్పటి ఫోటోస్ ను కూడా వీడియో రూపంలో షేర్ చేశాడు.

36
Image Credit : X/Sithara Entertainments

కింగ్డమ్ నుంచి రిలీజ్ అయిన ఈ"అన్న అటేనే ఉన్నానంటూ…" పాటను సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు. ఇందులో విజయ్ దేవరకొండ, సత్యదేవ్‌ల మధ్య సెంటిమెంట్‌ను ఆవిష్కరిస్తూ సాగే ఈ మ్యూజికల్ ట్రాక్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.

46
Image Credit : instagram / Anand Deverakonda

ఈ సాంగ్‌ను ఆనంద్ దేవరకొండ తన అన్నయ్యతో ఉన్న చిన్ననాటి ఫోటోలతో కలిపి వీడియో రూపంలోకి చేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంతే కాదు విజయ్ ఫ్యాన్స్ దీన్ని మరింతగా వైరల్ చేస్తున్నారు. ఈ పోస్ట్ దేవరకొండ బ్రదర్స్ మధ్య ఉన్న బంధాన్ని చాటిచెప్పింది.

56
Image Credit : Sithara Entertainments/ Youtube

కింగ్డమ్ సినిమాను గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా, ఇందులో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్స్ జంటగా నటిస్తున్నారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ నెల 31న ‘కింగ్డమ్’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌లతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది.

66
Image Credit : instagram / Anand Deverakonda

ఇక ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ సినిమా తర్వాత మళ్లీ అలాంటి సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. బేబీ తరువాత చేసిన గంగం గణేష సినిమాపెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. దాంతో ప్రమాదంలో పడకముందే కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టాడు ఆనంద్. ప్రస్తుతం వైష్ణవి చైతన్యతో కలిసి ఓ కొత్త సినిమాలో ఆనంద్ నటిస్తున్నాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhita Dhulipala: శోభిత ధూళిపాళకి తమిళ డైరెక్టర్ ఫిదా.. ఆమె చేసిన సాహసం ఏంటో తెలుసా, డూప్ లేకుండా
Recommended image2
Mahesh Babu: అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ ఎవ్వరితో కుదర్లేదు.. మహేష్ తో బాలీవుడ్ డైరెక్టర్ ప్రయత్నాలు ?
Recommended image3
Bigg Boss Telugu 10: డేంజర్‌ జోన్‌లో క్రేజీ కంటెస్టెంట్, రిస్క్ లో గ్లామర్‌ బ్యూటీ, బిగ్‌ బాస్‌ ఓటింగ్‌
Related Stories
Recommended image1
కృష్ణ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడిన హీరోయిన్ ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Recommended image2
జూనియర్ ఎన్టీఆర్ వదిలేసుకున్న 8 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఏవో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved