విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య అసలేం జరిగింది.. ఇంత రచ్చకి కారణం అదే అంటున్న తమ్ముడు
అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద రచ్చే చూసాం. వాస్తవానికి అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య ఏం జరిగిందో పూర్తిగా క్లారిటీ లేదు.

అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద రచ్చే చూసాం. వాస్తవానికి అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య ఏం జరిగిందో పూర్తిగా క్లారిటీ లేదు. కానీ అర్జున్ రెడ్డి చిత్రం రిలీజైనప్పటి నుంచి ఏదో విధంగా అనసూయ విజయ్ ని టార్గెట్ చేస్తోంది. అర్జున్ రెడ్డి చిత్రంలో ఉపయోగించిన బూతులపై అనసూయ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
కానీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయని ఇంకా తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేశారు. దీనితో అనసూయ కూడా ఈ వివాదాన్ని ఆపకుండా కంటిన్యూ చేసింది. అయితే అనసూయ, విజయ్ మధ్య వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయా అనేది తెలియదు.తన అన్నయ్య, అనసూయ గొడవపై తమ్ముడు ఆనంద్ దేవరకొండ సుతిమెత్తగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రంపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్ నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్ పై, ఆనంద్ దేవరకొండ పై ఇటీవల అనసూయ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ కూడా చేసింది. ఆనంద్ దేవరకొండ నటన ఇంటెన్స్ గా ఉందని అనసూయ విజయ్ దేవరకొండ తమ్ముడిని పొగిడేసింది.
అయితే అనసూయ, విజయ్ దేవరకొండ రచ్చపై ఆనంద్ స్పందిస్తూ.. నాకు కొన్ని కామెంట్స్ మాత్రమే తెలుసు. ఇష్యూ గురించి పూర్తిగా తెలియదు. నాకు తెలిసి అన్నయ్యకి అనసూయకి మధ్య ఎలాంటి గొడవ లేదు. ఇదంతా ఒక వైపు నుంచి జరిగిన కామెంటరీ మాత్రమే. ఏ వీళ్లిద్దరి విషయంలో నేను లోతుగా వెళ్లదలుచుకోలేదు.
అయితే ఒకటి మాత్రం నిజం ఇప్పుడు జరుగుతున్న చాలా గొడవలకు.. మనస్పర్థలకు, ఆవేశాలకు కారణంగా నిలుస్తోంది సోషల్ మీడియానే. ఒక వ్యక్తిని మనం నేరుగా చూసి అతడి పేరు గురించి కామెంట్ చేయలేం. ఇతర విషయాల గురించి కూడా కామెంట్ చేయలేం. అదే సోషల్ మీడియాలో నీ పేరు ఏంటి ఇలా ఉంది అని అడిగేయొచ్చు.. కామెంట్ పెట్టేయొచ్చు. సోషల్ మీడియా అనేది సైకలాజికల్ గా మనల్ని దెబ్బ కొడుతోంది. కానీ మనకి తెలియకుండానే అందులో భాగం అవుతున్నాం అంటూ ఆనంద్ దేవరకొండ వివరణ ఇచ్చాడు.
ఆనంద్ దేవరకొండ బేబీ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆనంద్ దేవరకొండకి ఇంతవరకు థియేట్రికల్ సక్సెస్ లేదు. తొలిసారి విజయం రుచి చూడాలని అనిపిస్తుంది అంటూ బేబీ మూవీపై ఆనంద్ దేవరకొండ తన అంచనా తెలిపాడు.