MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • AOR Trailer: అనగనగా ఒక రాజు మూవీ ట్రైలర్‌ రివ్యూ, హైలైట్స్ ఇవే.. చిరు, రవితేజకి నవీన్‌ పొలిశెట్టి పోటీ

AOR Trailer: అనగనగా ఒక రాజు మూవీ ట్రైలర్‌ రివ్యూ, హైలైట్స్ ఇవే.. చిరు, రవితేజకి నవీన్‌ పొలిశెట్టి పోటీ

నవీన్‌ పొలిశెట్టి `అనగనగా ఒక రాజు` మూవీతో ఈ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. అయితే ఆయనకు చిరంజీవి, రవితేజ, శర్వానంద్‌ ల నుంచి గట్టి పోటీ ఉండబోతుందని తెలుస్తోంది. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Jan 08 2026, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
`అనగనగా ఒక రాజు`తో సంక్రాంతి బరిలోకి నవీన్‌ పొలిశెట్టి
Image Credit : youtube/@SitharaEntertainments

`అనగనగా ఒక రాజు`తో సంక్రాంతి బరిలోకి నవీన్‌ పొలిశెట్టి

సంక్రాంతికి ఐదు తెలుగు సినిమాలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అందులో కుర్ర హీరో నవీన్‌ పొలిశెట్టి కూడా ఉన్నాడు. ఆయన `అనగనగా ఒక రాజు` చిత్రంతో సంక్రాంతి బరిలోకి దిగారు. ఇందులో మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటించింది. మారి దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల కాబోతుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
ప్రమోషన్స్ లో బిజీగా నవీన్, మీనాక్షి
Image Credit : youtube/@SitharaEntertainments

ప్రమోషన్స్ లో బిజీగా నవీన్, మీనాక్షి

నవీన్‌ పొలిశెట్టి గతంలో `ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ`, `జాతిరత్నాలు`, `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి`తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాడు. ఇప్పుడు మరో హిట్‌ కోసం వస్తున్నారు. తన మార్క్ కామెడీని, ఫ్యామిలీ అంశాలను మేళవించిన `అనగనగా ఒక రాజు` చిత్రంతో ఈ సంక్రాంతికి రచ్చ చేసేందుకు వస్తున్నారు. గత కొన్ని రోజులుగా టీమ్‌ వరుసగా ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి ఇద్దరూ ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాని ఆడియెన్స్ కి చేరువ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ట్రైలర్‌ని విడుదల చేశారు.

Related Articles

Related image1
Balu Movie: పవన్‌ కళ్యాణ్‌ `బాలు`ని రిజెక్ట్ చేసిన స్టార్‌ హీరోయిన్ ఎవరో తెలుసా? మరో స్టార్‌కి ఇచ్చిన మాట కోసం
Related image2
Prabhas: నా కెరీర్‌లోనే బెస్ట్ పోస్టర్‌.. `స్పిరిట్‌` పోస్టర్‌పై ప్రభాస్ ఫస్ట్ రియాక్షన్‌.. రాజమౌళి కి షాక్‌
36
`అనగనగా ఒక రాజు` మూవీ ట్రైలర్‌
Image Credit : youtube/@SitharaEntertainments

`అనగనగా ఒక రాజు` మూవీ ట్రైలర్‌

దాదాపు మూడు నిమిషాల నిడివితో రూపొందిన 'అనగనగా ఒక రాజు' ట్రైలర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. `అనగనగా ఒక రాజు.. ఆ రాజుకి చాలా పెద్ద మనసు. ఆ మనసులోకి ధగధగా మెరిసిపోయే నగలు వేసుకొని యువరాణి దిగింది` అంటూ నాగార్జున వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఊరి పెద్దమనిషిలా బుల్లెట్ బండి మీద నవీన్‌ పొలిశెట్టి పాత్రను పరిచయం చేసిన తీరు బాగుంది. నోట్ల కట్టను గుడిలోని హుండీలో వేయబోతూ `కన్నాన్ని పెద్దది చేయండి` అని పూజారితో చెప్పడం క్రేజీగా ఉంది. మంత్రాన్ని తిరిగి చెప్పమని పూజారి అంటే.. మీనాక్షి చౌదరి గుండ్రంగా తిరగడం నవ్వులు పూయించింది.

46
చిరంజీవి, రవితేజ, శర్వానంద్‌లకు నవీన్‌ పోటీ
Image Credit : youtube/@SitharaEntertainments

చిరంజీవి, రవితేజ, శర్వానంద్‌లకు నవీన్‌ పోటీ

నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి పాత్రలను మలిచిన తీరు, ఆ పాత్రల నుంచి కామెడీని పుట్టించిన తీరు కట్టిపడేసింది. నవీన్‌, మీనాక్షి ప్రేమకథకు వచ్చిన సమస్య ఏంటి? ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు? అనే ఆసక్తిని కలిగిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. `పండగకు అల్లుడు వస్తున్నాడు` అంటూ ఎద్దులబండిపై నవీన్ ను చూపిస్తూ సంక్రాంతికి పండుగ సందడి అంతా తమ సినిమాలోనే ఉందనే విషయాన్ని చూపించారు మేకర్స్. ట్రైలర్‌ మాత్రం ఆకట్టుకుంది. సంక్రాంతికి పండక్కి కావాల్సిన అన్ని అంశాలను మేళవింపుతో ఈ మూవీని రూపొందించినట్టు ట్రైలర్‌ని బట్టి అర్థవుతుంది. నవీన్ పొలిశెట్టి తన కామెడీ టైమింగ్ తో మరోసారి మెప్పించారు. నవీన్, మీనాక్షి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. యువరాజు కెమెరా పనితనం, మిక్కీ జె మేయర్ నేపథ్య సంగీతం ట్రైలర్ కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి వస్తోన్న సినిమాలన్నీ ఇలా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లుగానే రూపొందాయి. చిరంజీవి `మన శంకరవరప్రసాద్‌ గారు`, రవితేజ `భక్త మహాశయులకు విజ్ఞప్తి`, శర్వానంద్‌ `నారి నారి నడుమ మురారి` కథలన్నీ ఒకేలా ఉన్నాయి. దీంతో నవీన్‌కి చిరు, రవితేజ, శర్వానంద్‌లతో గట్టి పోటీ ఉండబోతుందని తెలుస్తోంది.

56
ఆ లోటుని భర్తీ చేస్తా -నవీన్‌ పొలిశెట్టి
Image Credit : youtube/@SitharaEntertainments

ఆ లోటుని భర్తీ చేస్తా -నవీన్‌ పొలిశెట్టి

`అనగనగా ఒక రాజు' చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుక హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో గురువారం జరిగింది. ఈ వేడుకకు నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, దర్శకుడు మారి, నిర్మాత సూర్యదేవర నాగవంశీతో పాటు చిత్ర బృందం హాజరైంది. ఇందులో నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ, `ఈ సంక్రాంతికి మీ కుటుంబంతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా సినిమాని రూపొందించాం. మొదటి నుంచి చివరివరకు నవ్వుతూనే ఉంటారు. అదే సమయంలో అందమైన భావోద్వేగాలు కూడా ఉంటాయి. దర్శకుడు మారి మొదటి సినిమా అయినా చాలా బాగా తెరకెక్కించారు. ఈ సంక్రాంతికి నా అభిమాన హీరోలు ప్రభాస్ గారు, చిరంజీవి గారు, రవితేజ గారి సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నాకు జరిగిన ఒక రోడ్డు ప్రమాదం వల్ల నా సినిమా రావడం ఆలస్యమైంది. ఆ లోటుని భర్తీ చేసేలా `అనగనగా ఒక రాజు` సినిమా రెట్టింపు వినోదాన్ని అందిస్తుంది` అని అన్నారు.

66
అనగనగా ఒక రాజు పైసా వసూల్‌ మూవీ - మీనాక్షి చౌదరీ
Image Credit : youtube/@SitharaEntertainments

అనగనగా ఒక రాజు పైసా వసూల్‌ మూవీ - మీనాక్షి చౌదరీ

కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ,`ఇందులో నేను చారులత పాత్ర పోషించాను. ఇది నా మనసుకు దగ్గరైన పాత్ర. ఇది పక్కా పైసా వసూల్ ఫిల్మ్` అని తెలిపారు. దర్శకుడు మారి మాట్లాడుతూ, `ట్రైలర్ లాగే సినిమా కూడా ఉంటుంది. నవీన్ ని కొత్తగా చూస్తారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ కూడా బాగా పండాయి. నవీన్ గారు, మీనాక్షి గారి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. సంక్రాంతికి తగ్గ ఓ మంచి వినోదభరిత చిత్రమిది` అని తెలిపారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, `ట్రైలర్ లో ఎలాగైతే పంచ్ లు పేలాయో.. సినిమా అంతా అలాగే పంచ్ లు పేలుతాయి. రెండు గంటల పాటు మిమ్మల్ని నవ్విస్తూ నవీన్ శైలిలో సాగే సినిమా ఇది. కుటుంబంతో కలిసి సినిమాకు రండి. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. పండగ సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి` అని చెప్పారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image3
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Related Stories
Recommended image1
Balu Movie: పవన్‌ కళ్యాణ్‌ `బాలు`ని రిజెక్ట్ చేసిన స్టార్‌ హీరోయిన్ ఎవరో తెలుసా? మరో స్టార్‌కి ఇచ్చిన మాట కోసం
Recommended image2
Prabhas: నా కెరీర్‌లోనే బెస్ట్ పోస్టర్‌.. `స్పిరిట్‌` పోస్టర్‌పై ప్రభాస్ ఫస్ట్ రియాక్షన్‌.. రాజమౌళి కి షాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved