Bigg Boss Telugu Season 9 లోకి అమృత ప్రణయ్? రెమ్యునరేషన్ ఎంతంటే?
Bigg Boss Telugu Season 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కి సబంధించి రోజుకో వార్త వినిపిస్తోంది. ఈ ఏడాది జరగబోయే సీజన్ 9 లో పాల్గొనబోయే సెలబ్రిటీల లిస్ట్ గురించి ఎప్పటి కప్పుడు కొత్త పేర్లు వినిపిస్తూనే ఉన్నయి. అయితే అఫీఫియల్ గా మాత్రం ఎవరి పేరు అనౌస్స్ చేయలేదు కాని.. ఈసారి మాత్రం సంచనలాలు సృష్టించిన పలువురు స్టార్స్ బిగ్ బాస్ లోకి రాబోతున్నట్టు మాత్రం తెలుస్తోంది. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు అమృత ప్రణయ్.

తెలుగు రాష్ట్రాలకు పెద్దగా పరిచయం చేయనక్కర్లేని పేరు అమృత వ ప్రణయ్ అలియాస్ అమృత వర్షిణి. తన స్నేహితుడు ప్రణయ్ ని ప్రేమించి, పెద్దలు ఎదిరించి పెళ్లి చేసుకొని, చాలా చిన్నవయస్సులోనే. అదికూడా పెళ్ళైన ఏడాదిలోనే భర్తను కోల్పోయింది అమృత.
5 నెలల గర్బవతిగా ఉన్నప్పుడే.. తన స్వయంగా తన తండ్రి తన పసుపుకుంకాలు తుడిచేయడం అతి పెద్ద విషాదంగా మారింది. తన కూతురు తమ కంటే తక్కువ కులంవారిని పెళ్లిచేసుకోవడం జీర్ణించుకోలేకపోయిన అమృత తండ్రి మారుతీ రావు, 2018 లో తన మనుషుల చేత ప్రణయ్ ని చంపించిన ఘటన దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది.
ఆ తర్వాత 2020 వ సంవత్సరం లో మారుతీ రావు పశ్చాత్తాపంతో సూసైడ్ చేసుకున్న ఘటన కూడా సంచలనం గా మారింది. ఇలా ఎన్నో సంచనాలకు దారి తీసిన ఈ ఘటనకు సంబంధించిన ప్రధాన నిందితుడికి రీసెంట్ గానే ఉరి శిక్ష పడింది. ఇలా వరుస ఘటనల తరువాత అమృత ఏం చేస్తుంది అనేది చాలామందికి తెలియకపోవచ్చు. కాని ఆమె ఇప్పుడు సోషల్ మీడియా సెలబ్రిటీ. యూట్యూబ్ ఛానెల్ ద్వారా బాగా పేమస్ అయ్యింది. ఆమె సబ్ స్క్రైబర్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నారు.
అయితే రీసెంట్ గా అమృత చేసిన మరో పని చర్చనీయాంశంగా మారింది. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఉన్న ప్రోఫైల్ పేరును మార్చేసింది. గతంలో ఉన్న అమృత ప్రణయ్ ప్రేరును మార్చి..అమృతి వర్షిణిగా పెట్టింది. దాంతో పలువురు రకరకాల కామెంట్లు కూడా చేశారు. ఆమెత్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్టు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో నెగెటీవ్ కామెంట్స్ కూడా వచ్చాయి. చాలామంది మాత్రం ఆమె పెళ్లి నిజం అయితే.. మంచి నిర్ణయం తీసుకన్నట్టే అని సపోర్ట్ చేస్తున్నారు.
ఇక ఇదంతా ఓక వైపు అయితే.. తాజాగా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం అమృత ఈ ఏడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. . రీసెంట్ గానే బిగ్ బాస్ టీం ఆమెను సంప్రదించినట్టు, భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ ని కూడా ఇచ్చినట్టు రూమర్స్ బయటకు వచ్చాయి. గతంలో కూడా ఈ విషయంపై నెట్టింట్లో చర్చ జరిగింది.
అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా కాని... అమృత మాత్రం స్పందించలేదు. కావాలనే ఆమె స్పందించలేదా అన్న వాదన కూడా ఉంది. బిగ్ బాస్ లోకి వెళ్లే వారకూ ఈ విషయం సీక్రేట్ గా ఉంచాలని అనుకుందా అని చర్చించుకుంటున్నారు జనాలు. ఇక అమృత నిజంగానే బిగ్ బాస్ లోకి వస్తే.. ఆమె కెరీర్ లో స్పీడ్ పెరిగి సెలబ్రిటీగామారే అవకాశం కూడా లేకపోలేదు.