Amritha Aiyer: మెస్మరైజ్ చేస్తున్న కన్నడ సోయగం అమృతా అయ్యర్.. టాలీవుడ్ ను టార్గెట్ చేసింది.
టాలీవుడ్ మెస్మరైజ్ చేస్తుంది కన్నడ భామ అమృత అయ్యర్. తెలుగులో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తన టాలెంట్ కు ఛాలెంజ్ విసిరే పాత్రకోసం ఎదురు చూస్తుంది అమృత.
డిఫరెంట్ స్టోరీస్ ను సెలక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తోంది కన్నడ బ్యూటీ అమృతా అయ్యర్. తన బ్యూటీతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన అర్జున ఫాల్గుణ మూవీలో నటిస్తోంది. రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో మెరుపులు మెరిపించింది బ్యూటీ.
అర్జున ఫల్గుణ ప్రీ రిలీజ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది అమృత. స్లీవ్ లెస్.. లైట్ కలర్ డిజైనర్ డ్రెస్ లో అదరగొట్టింది. తమిళ, తెలుగు భాషల్లో మంచి మంచి కథలను సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తుంది అమృత. చిన్నహీరోలు, పెద్ద హీరోలు అన్న తేడా లేకుండా అవకాశాన్ని బట్టి, సినిమాలో తన క్యారెక్టర్ ను బట్టి సెలక్టీవ్ గా వెళ్తుంది.
ఇప్పటి వరకూ తెలుగులో రామ్ తో రెడ్ సినిమాలో, యాంకర్ ప్రదీప్ తో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో నటించింది అమృత. తనకు సెట్ అయ్యే పాత్రలు ఏవీ వచ్చినా చేస్తానంటుంది బ్యూటీ. కాని ఇప్పటి వరకూ తనకు క్లాసిక్ రోల్స్ మాత్రమే వచ్చాయంటుంది. సిటీ కల్చర్ కు దగ్గర గా ఉండే ఫ్యాషన్ రోల్స్ చేయాలని ఉంది అంటోంది అమృత.
గ్లామర్ రోల్స్ తనకు కంఫర్టబుల్ గా ఉండవంటోంది అమృత అయ్యర్. ఒక పరిది వరకే చేయగలనంటోంది. అయితే ఇప్పటి వరకు క్లాసిక్ పాత్రలు చేసకుంటూ వచ్చిన అమృత.. తన టాలెంట్ కు సవాల్ విసిరే క్యారెక్టర్ ఉన్న సినిమా కోసం చూస్తుంది. తెలుగులో శ్రీవిష్ణు జంటగా అర్జున ఫాల్గుణ సినిమాలో నటించిన కన్నడ భామ.. తేజ్ సజ్జాతో హనుమాన్ మూవీ కూడా చేస్తోంది.
తమిళ్ లో బిజిల్ లాంటి పెద్ద ప్రాజెక్ట్స్ లో నటించింది అమృత. ప్రస్తుతం టాలీవుడ్ పై దృస్టి పెట్టింది. తేజ్ మర్నీ డైరెక్షన్ లో తెరకెక్కిన అర్జున ఫాల్గున మూవీ.. న్యూ ఇయర్ కానుకగా ఈనెల 31న రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకూ ఈమూవీ నుంచి వచ్చిన ప్రతీ అప్ డేట్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాతో మరిన్ని ఆఫర్స్ ను కొట్టేయాలని చూస్తోంది అమృత.