గోపీచంద్ మోసం చేశాడంటూ అమ్మా రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు.. కన్నీరు మున్నీరు..
మొన్న హీరో నితిన్‌పై విరుచుపడ్డ అమ్మా రాజశేఖర్ ఇప్పుడు మరో హీరోని టార్గెట్ చేశారు. గోపీచంద్ తనని దారుణంగా మోసం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడాయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

కొరియోగ్రాఫర్ నుంచి డైరెక్టర్‌గా మారిన వారిలో అమ్మా రాజశేఖర్ ఒకరు. కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగానూ పాపులర్ అయ్యారు. అయితే రెండు విభాగాల్లోనూ ఆయనకు కొంత గ్యాప్ వచ్చింది. దీంతో ఔట్ డేటేడ్ టెక్నీషియన్‌ని మారిపోయిన టైమ్‌లో బిగ్ బాస్ ఆయనకు మరోసారి పేరుని తీసుకొచ్చింది. `బిగ్ బాస్ 4`లో పాల్గొన మెప్పించారు. ఎమోషనల్ జర్నీతో అందరి హృదయాలను దగ్గరయ్యారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు అమ్మా రాజశేఖర్. ఆయన రూపొందించిన చిత్రం `హైయ్ ఫైవ్`. ఇందులో ఆయనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు. ఈసినిమా ఈవెంట్ కోసం నితిన్‌ని గెస్ట్ గా పిలవగా, ఆయన హాజరు కాలేకపోవడంతో నితిన్‌పై దుమ్మెత్తిపోశాడు అమ్మా రాజశేఖర్. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయినా దీనిపై నితిన్ స్పందించకపోవడం విశేషం.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో హీరోని టార్గెట్ చేశారు అమ్మారాజశేఖర్. మ్యాచో స్టార్, యాక్షన్ హీరో గోపీచంద్‌పై విరుచుకుపడ్డారు. ఆయన తనని మోసం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన `హైయ్ ఫైవ్` సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమ్మా రాజశేఖర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తనతో సినిమా చేస్తానని కమిట్ అయి హ్యాండిచ్చాడని తెలిపారు.
గోపీచంద్ హీరోగా అమ్మారాజశేఖర్ `రణం` చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మరో సినిమా చేద్దామని అమ్మా రాజశేఖర్‌కి మాట ఇచ్చారట. అందుకోసం ఆయన ఓ లైన్ కూడా చెప్పారట. ఆ టైమ్‌లోనే తనకు సురేష్ ప్రొడక్షన్‌నుంచి ఓ ఆఫర్ వచ్చిందని, వెంకటేష్ ఒప్పుకోవడంతో సినిమా సెట్ కూడా వేశామని, తనకు అడ్వాన్స్ కూడా ఇచ్చారని తెలిపారు.
వెంకటేష్ హీరోగా సినిమా స్టార్ట్ చేద్దామనుకునే టైమ్‌లోనే గోపీచంద్ హీరోగా రూపొందిన సినిమా విడుదలైంది. అందులో సత్యరాజ్ కీలక పాత్ర(శంఖం)లో నటించారు. ఆ సినిమా చూశాక తాను షాక్ అయినట్టు చెప్పారు అమ్మారాజశేఖర్. తాను గోపీచంద్ కి చెప్పిన కథ, ఆ సినిమా స్టోరీ ఒకేలా ఉందని, ఇది చూసిన సురేష్‌బాబు సైతం ఆ కథ వద్దని మరో సినిమా చేద్దామన్నారు. కానీ ఆ సినిమాకూడా సెట్ కాలేదు. దీంతో కెరీర్ పరంగా డౌన్‌ఫాల్ అయినట్టు చెప్పారు అమ్మారాజశేఖర్. దీంతో చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి.