- Home
- Entertainment
- అమితాబ్ హోస్ట్‌గా తప్పుకోలేదా? 'కౌన్ బనేగా కరోడ్‌పతి' సీజన్ 17 కి ముహూర్తం ఫిక్స్, ఎప్పుడంటే?
అమితాబ్ హోస్ట్‌గా తప్పుకోలేదా? 'కౌన్ బనేగా కరోడ్‌పతి' సీజన్ 17 కి ముహూర్తం ఫిక్స్, ఎప్పుడంటే?
అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి 17' రిజిస్ట్రేషన్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. ఈసారి కూడా బిగ్ బీనే హోస్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఆయన ఈ షో నుంచి తప్పుకుంటానని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. దాంతో సీజన్ 17లో బిగ్ బీ కనిపించరని ఫ్యాన్స్ బాధపడ్డారు. తాజా సమాచారం ప్రకారం అమితాబ్ హోస్టింగ్ లోనే సీజన్ 17 స్టార్ట్ కాబోతున్నట్ట తెస్తోంది.

హిందీలో బాగా పాపులర్ అయిన రియాలిటీ షోలలో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ఒకటి. దీని 17వ సీజన్‌లో పాల్గొనడానికి ఏప్రిల్ 14 నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ షోతో మరోసారి అమితాబ్ హోస్ట్‌గా వస్తున్నారు. ఇక ఈ షోలో పాల్గోనడానికి పెద్ద ఎత్తున రెడీ అవుతున్నారు అభిమానులు.
Also Read: దివ్య భారతి మరణంతో ఆగిపోయిన 10 సినిమాలు, పూర్తి చేసిన స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
కేబీసీ 17 జూలై లేదా ఆగస్టులో మొదలయ్యే ఛాన్స్
కౌన్ బనేగా కరోడ్‌పతి 17 జూలై లేదా ఆగస్టు 2025లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ, షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇంకా అదికారికంగా డేట్ ను ప్రకటించలేదు. ముందుగా సెలక్షన్స్ కు కేబీసీ టీమ్ రెడీ అవుతున్నారు.
కేబీసీ 17కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి
కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 17కి సెలక్షన్ క్యశ్చన్స్ ఏప్రిల్ 14, 2025 నుంచి స్టాట్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ రాత్రి 9 గంటలకు చెప్తారు. సోనీ లివ్ యాప్ లేదా వాట్సాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.
Also Read: 3 సినిమాలతో 3000 కోట్లు రాబట్టిన టాలీవుడ్ హీరోయిన్ కు బాలీవుడ్ లో బ్రేక్
కేబీసీ 17లో మార్పులు
కౌన్ బనేగా కరోడ్‌పతి 17 కొత్త మార్పులు, అదిరిపోయే ఫీచర్లతో వస్తుందట. అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా మళ్లీ వస్తున్నారు. గత సీజన్ తరువాత అమితాబ్ ఈ షో నుంచి తప్పుకుంటారన్న వార్తలు వినిపించాయి. అమితాబ్ కూడా ఈ విషయంలో హింట్ ఇచ్చారు. ఈక్రమంలో కేబీసీకి కొత్త హోస్ట్ వస్తారని ప్రచారం జరిగింది. కాని అభిానులను దిల్ ఖుష్ చేస్తూ.. సీజన్ 17కి కూడా అమితాబ్ హోస్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
Also Read: 3 నెలల్లో 60 ఫ్లాప్ సినిమాలు, 4 హిట్లు మాత్రమే, కోలీవుడ్ పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయింది ?
Also Read: బాహుబలి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, ప్రభాస్ కంటే ముందు రాజమౌళి ఆఫర్ ఇచ్చింది ఎవరికి?