Amitabh Bachchan Net Worth : అమితాబ్, జయ బచ్చన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? లెక్కలు చెప్పిన దంపతులు!
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ Amitabh Bachchan, జయ బచ్చన్ Jaya Bachchan ఆస్తుల లెక్కలను తాజాగా వెల్లడించారు. వీరి మొత్తం నెట్ వర్త్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే... కేవలం బ్యాంక్ బ్యాలెన్సే కోట్లలో ఉండటం విశేషం.
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన నటన, సినిమాలు, వ్యక్తిగత జీవితాన్ని ఇష్టపడే వారి సంఖ్య లెక్కగట్టడమూ కష్టమే. దేశ వ్యాప్తంగా అమితాబ్ కు అభిమానులు ఉన్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా అమితాబ్ బచ్చన్, సతీమణి జయ బచ్చన్ బ్యాంక్ బ్యాలెన్స్, నెట్ వర్త్ వివరాలను తాజాగా వెల్లడించారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున ఉత్తరప్రదేశ్ నుండి ఆమె రాజ్యసభకు ఐదవసారి పోటీ చేయబోతున్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో తమ వ్యక్తిగత సంపాదన వివరాలను, ఆస్తుల విలువను వెల్లడించారు. ఇద్దరి బ్యాంక్ బ్యాలెన్స్, మొత్తం నెట్ వెర్త్ ప్రస్తుతం హాట్ టాపిక్ గ్గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
అఫిడవిట్ ప్రకారం.. జయ బచ్చన్ బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 10.11 కోట్లు, అమితాబ్ బచ్చన్ బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 120.45 కోట్లుగా వెల్లడించారు. కేవలం వీరి బ్యాంక్ లో ఉండే సొమ్ముగా ఇది తెలుస్తోంది.
ఇక అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ కు సంబంధించిన ప్రాపర్టీస్, ఇతర ఆస్తుల విలువ మొత్తం రూ.150 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అయితే 2018లో మాత్రం వీరి ఆస్తి విలువ రూ.1000 కోట్లు కాగా.. ఐదేళ్లలో రూ.500 కోట్లు పెరిగిందంటున్నారు.
అమితాబ్ బచ్చన్ ఈ వయస్సులోనూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో రూపుదిద్దుకుంటున్న పాన్ వరల్డ్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో ఈ మూవీ తెరకెక్కతున్న విషయం తెలిసిందే.