MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎట్టకేలకు బయటపడిన సిద్ధార్థ్-అదితి రావ్ ల బండారం... ముంబై హోటల్ లో కెమెరా కంటికి చిక్కిన జంట!

ఎట్టకేలకు బయటపడిన సిద్ధార్థ్-అదితి రావ్ ల బండారం... ముంబై హోటల్ లో కెమెరా కంటికి చిక్కిన జంట!

హీరో సిద్దార్థ్-అదితి రావ్ హైదరి రిలేషన్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుండగా... వాటికి బలం చేకూర్చేలా తాజా సంఘటన చోటు చేసుకుంది. ముంబైలో కలిసి చక్కర్లు ఈ జంట కెమెరా కంటికి చిక్కారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 01 2022, 07:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Siddharth

Siddharth

సిల్వర్ స్క్రీన్ లవర్ బాయ్ సిద్ధార్థ్ రియల్ లైఫ్ లో కూడా అలాంటోడే.  సిద్ధార్థ్ ని సౌత్ ఇండియా రన్బీర్ అనడంలో తప్పులేదు. మనోడు కెరీర్ బిగినింగ్ నుండి అధికారికంగానే అరడజను ఎఫైర్స్ నడిపాడు. బాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు ప్రేమాయణాలు సాగించాడు. శృతి హాసన్, సమంతలతో సిద్ధార్థ్ లవ్ ఎఫైర్స్ బాగా రచ్చకెక్కాయి. అనగనగా ఓ ధీరుడు మూవీలో శృతి హాసన్, సిద్ధార్థ్ జతకట్టారు. ఆ మూవీ సెట్స్ లో ఆమెను లైన్లో పెట్టాడు. కొన్నేళ్ల పాటు చక్కగా డేటింగ్ చేశారు. శృతి హాసన్ కూడా ఇలాంటి రిలేషన్స్ పెద్ద సీరియస్ గా తీసుకోదు. ఇద్దరికీ బోర్ కొట్టడంతో ఎలాంటి గొడవా లేకుండా విడిపోయారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26


శృతికి బ్రేకప్ చెప్పాక సమంతకు దగ్గరయ్యారు. నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత-సిద్ధార్థ్ జబర్దస్త్ టైటిల్ తో మూవీ చేశారు. ఇది డిజాస్టర్ అయ్యింది. అయితే సమంత, సిద్దార్థ్ రిలేషన్ కి బీజం వేసింది. సీరియస్ గా ప్రేమించే లక్షణం లేని సిద్దార్థ్ ఓ కన్నడ నటికి దగ్గరయ్యాడని సమంతకు తెలిసింది. సన్నిహితులు హెచ్చరించడంతో తెలివిగా రైట్ టైంలో అతడికి బ్రేకప్ చెప్పేసింది. సిద్దార్థ్ తో రిలేషన్ గురించి ఒకసారి ఓపెన్ అయిన సమంత పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాను, లేకుంటే నా లైఫ్ ఏమయ్యేదో, అని కామెంట్ చేసింది. 

36

సమంతతో విడిపోయి చాలా కాలం అవుతుండగా సిద్ధార్థ్ మరికొన్ని ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్నాడు. హీరోయిన్ అదితిరావ్ హైదరితో సిద్దార్థ్ రిలేషన్ లో ఉన్నాడనేది ప్రస్తుత సమాచారం. కొద్దిరోజులుగా అదితి, సిద్దార్థ్ డేటింగ్ చేస్తున్నారనే కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా ఇద్దరూ ముంబై హోటల్ లో కనిపించారు. చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఈ ప్రేమ జంట కెమెరా కంటికి చిక్కారు. దీంతో... ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారని జనాలు కన్ఫర్మ్ చేసేశారు. వారికి పెళ్లి చేసుకునే ఆలోచన ఉండకపోవచ్చు... కాబట్టి అధికారికం ప్రకటించడం కష్టమే అంటున్నారు. 

46

ఇక సిద్ధార్థ్, అదితిరావ్ హైదరిలకు పెళ్ళిళ్ళై విడాకులు అయ్యాయి. సిద్దార్థ్ 2003లో మేఘన అనే అభిమానిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 2007లో ఆమెకు విడాకులు ఇచ్చారు. అప్పటి నుండి మళ్ళీ పెళ్లి మాట ఎత్తలేదు.

56

అదితి చాలా చిన్న వయసులో సత్యదేవ్ మిశ్రా అనే వ్యక్తిని రహస్య వివాహం చేసుకున్నారు. అనంతరం అతనితో అదితి విడిపోవడం జరిగింది. ఇక వీరి కెరీర్స్ పరిశీలిస్తే ఏమంత ఆశాజనకంగా లేవు. సిద్దార్థ్ హిట్ మూవీలో నటించి ఏళ్ళు దాటిపోతుంది.తెలుగులో అదితి చివరి చిత్రం మహాసముద్రం. ఈ మూవీలో సిద్ధార్థ్ సెకండ్ హీరో రోల్ చేశాడు.

66
Image: Siddharth/Instagram

Image: Siddharth/Instagram

సిద్ధార్థ్ ప్రస్తుతం భారతీయుడు 2 చిత్రంలో కీలక రోల్ చేస్తున్నారు. వివాదాలతో ఆగిపోయిన ఈ చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఇక అదితి గాంధీ టాక్ టైటిల్ తో ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 OTT: ఒకే సినిమా, రెండు ఓటీటీలు.. రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ ప్లాన్ అదుర్స్!
Recommended image2
Roja Selvamani: రోజాకి హీరోలెవ్వరూ ఎందుకు ప్రపోజ్ చేయలేదో తెలుసా..ఇన్నేళ్లకు నిజం బయటపడింది
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యోకు మాటిచ్చిన దీప- తాళి కట్టమంటే కడతావా అని ప్రశ్నించిన శ్రీధర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved