MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'అమరన్' OTT రైట్స్ ఎంతకు అమ్మారో తెలిస్తే మైండ్ బ్లాక్

'అమరన్' OTT రైట్స్ ఎంతకు అమ్మారో తెలిస్తే మైండ్ బ్లాక్

శివ కార్తికేయన్, సాయి పల్లవి నటించిన 'అమరన్' సినిమా ఓటిటి రిలీజ్ కు సిద్ధమవుతోంది. నిర్మాత కమల్ హాసన్ ఓటిటి రైట్స్ ను ఎంతకు అమ్మారనేది ఆసక్తికరంగా మారింది.

3 Min read
Surya Prakash
Published : Nov 23 2024, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Siva karthikeyan, sai Pallavi, Amaran

Siva karthikeyan, sai Pallavi, Amaran

శివ కార్తికేయన్‌ (Siva Karthikeyan), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రం ‘అమరన్‌’ (Amaran)మంచి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్‌ నిర్మించారు. మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘అమరన్‌’. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించారు.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

 

27
Amaran Movie

Amaran Movie

 ముకుంద్ వర‌ద‌రాజ‌న్ (శివ కార్తికేయ‌న్‌), ఇందు రెబెకా వ‌ర్ఘీస్ (సాయిప‌ల్లవి) నటించారు.  ఈ సినిమా త్వరలో ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం నిమిత్తం నిర్మాత కమల్ హాసన్ ఎంతకు రైట్స్ అమ్మారు. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో అనే విషయాలు బయిటకు వచ్చాయి.
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం ‘అమరన్‌’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సాయి  పల్లవి ఉండటంతో  టాలీవుడ్‌లో కూడా ఈ మూవీపై హైప్‌ క్రియేట్‌ అయింది. 
 

37
Sivakarthiekyans Amaran film

Sivakarthiekyans Amaran film


భారీ అంచనాల మధ్య దీపావళి రోజు (అక్టోబర్‌ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి రివ్యూలు తెచ్చుకుంది. తమిళంలో సాలిడ్ హిట్ టాక్ నడుస్తోంది. తెలుగు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కూడా ఎ, మల్లిప్లెక్స్ లలో  అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.

మరీ ముఖ్యంగా ప్రేక్షకులు కంటతడి పెట్టుకునేలా సాయిపల్లవి తనదైన యాక్టింగ్‌తో అదరగొట్టేసిందని అంటున్నారు. దీనికి కూడా రూ.30 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ చెప్తోంది. ఈ సినిమా  Netflix లో స్ట్రీమ్ అవనుంది.  నవంబర్ 29 నుంచి లేదా డిసెంబర్ 5 నుంచి ఈ సినిమా అన్ని లాంగ్వేజ్ లలోనూ స్ట్రీమ్ అవనుందని సమాచారం. 
 

47
Siva karthikeyan, sai Pallavi, Amaran

Siva karthikeyan, sai Pallavi, Amaran


ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు అమరన్ ఓటిటి రైట్స్ ని నెట్  ప్లిక్స్  ₹60 కోట్లకు కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ విక్రయించింది. తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ, హిందీ రైట్స్ కలిపి ఈ  రైట్స్ ఇచ్చారు.

అయితే శివకార్తికేయన్ సినిమా స్దాయికి ఇది భారీ ఎమౌంటే. కానీ వేరే తమిళ బ్లాక్ బస్టర్స్ వేట్టయాన్  (₹90 crore), అజిత్ విట్టా మయూర్చి  (₹100 crore), విజయ్ ది గోట్ (₹110 crore) సినిమాలతో పోలిస్తే తక్కువే కావటం చెప్పుకోదగ్గ విశేషం.
 

57
Amaran Controversy

Amaran Controversy


చిత్రం విషయానికి వస్తే... వాస్తవానికి నిజ జీవిత కథలను తెరకెక్కించటం చాలా కష్టం. అందులో డ్రామా తక్కువ ఉంటుంది. చెప్పటానికి చాలా ఉంటుంది. ఏది వదిలేయాలి, ఎక్కడ ఎమోషన్ వస్తుందో చూసుకుని ముందుకు వెళ్లాలనేది స్క్రిప్టు నుంచి పెద్ద టాస్క్, ఏ మాత్రం తేడా వచ్చినా, కల్పన ఎక్కువైనా విమర్శలు వస్తాయి.  

2014లో కాశ్మీర్ లో ఓ స్పెషల్ ఆపరేషన్ లో వీరమరణం పొంది, భారతదేశపు అత్యున్నత పురస్కారమైన అశోక చక్రతో గౌరవించబడ్డ గొప్ప సైనికుడు తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తమిళంలో తెరకెక్కిన చిత్రం “అమరన్” (Amaran). 

67
Actor Sivakarthikeyan Amaran

Actor Sivakarthikeyan Amaran


అమరన్ పూర్తిగా సాయి పల్లవి చిత్రం. తెరపై శివకార్తికేయన్ సీన్స్ ఎక్కువ కనిపించినా, స్పైస్ మొత్తం సాయి పల్లవి లాగేసుకుంది. తన నటనతో రెబెక్కా వర్గీస్ పాత్రకు ప్రాణం పోసింది. ఇంకొకరు ఈ పాత్రను చేస్తే ఈ స్దాయిలో అయితే చేయలేరు అనేంతగా జీవించింది.

శివకార్తికేయన్ ఈ పాత్ర కోసం పడిన కష్టం,తాపత్రయం, బాడీ లాంగ్వేజ్ ఆశ్చర్యపరుస్తాయి. ఇన్నాళ్లూ కామెడీకే పరిమితమైన శివకార్తికేయన్ ఈ సినిమాతో నెక్ట్స్ లెవిల్ కు వెళ్లారు.  ఆర్మీ చీఫ్ గా రాహుల్ బోస్ (Rahul Bose) ,సైనికుడిగా భువన్ అరోరా (Bhuvan Arora) గుర్తుండిపోతారు.  తల్లి పాత్రలో గీతా కైలాసం కూడా మనం థియటర్ నుంచి బయిటకు వచ్చాక కూడా గుర్తుకు వస్తుంది.

77
Amaran

Amaran


ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan)  నిర్మించిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకుడు. 2014లో వీరమరణం పొందిన గొప్ప సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను ఆధారం చేసుకుని దర్శకుడు ‘అమరన్’ని రూపొందించాడు.

ఈ చిత్రం మొదటి వారం  తెలుగు స్ట్రెయిట్ సినిమాతో కిరణ్ అబ్బవరం KAతోనూ,  రెండవ వారం వరుణ్ తేజ మట్కా తోనూ, సూర్య నటించిన కంగువా సినిమాతోనూ పోటీ పడింది. అయితే కంగువా, మట్కా  రెండు సినిమాలు టాక్ సరిగ్గా లేకపోవటం కలిసొచ్చింది.  ఈ సినిమాకు వచ్చిన బజ్ తో సెకండ్ వీకెండ్ సైతం సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

read more: గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్: ఊహించని ట్విస్ట్!

also read: సినిమాల్లోకి రోజా రీఎంట్రీ.. ఎలాంటి రోల్స్ చేయాలని ఉందో మనసులో మాట బయటపెట్టిన ఫైర్‌ బ్రాండ్

 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Recommended image1
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
Recommended image2
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
Recommended image3
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved